జగన్ మోహన్ రెడ్డి సాక్షి మీడియాకు చెందిన బ్యాంకు ఖాతాలను నిలిపివేయటంపై మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి నిర్మోహమాటంగా ఖాతాల స్తంభన చట్ట విరుద్దం, న్యాయవిరుద్దం అని స్పష్టం చేశారు.ఇప్పటికి మూడు ఛార్జీ షీట్లు జగన్ ఆస్తుల కేసులో వేశారని, ఒక్కోసారి ఒక్కొక్కరిని అదనంగా చేర్చుతున్నారని గాదె వ్యంగ్యంగా అన్నారు.సిబిఐ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దీనివల్ల జగన్ పట్ల కక్ష సాధిస్తున్నారన్న బావన వ్యాప్తిలోకి వస్తుందని హెచ్చరించారు.కరెంటు ఖాతాలో రోజువారి వచ్చే అమ్మకాల ఆదాయం, ప్రకటనల ఆదాయం, రోజువారి ఖర్చులు జీతాలకు సంబంధించిన విషయాలు ఉంటాయని,దీనికి పెట్టుబడులకు సంబంధం ఏమిటని గాదె ప్రశ్నించారు.,కాగా ప్రఖ్యాత జర్నలిస్టు కులదీప్ నయ్యార్ ,ఎమ్మెల్సీ నాగేశ్వర్ ప్రభృతులు సాక్షి బ్యాంకు ఖాతాల స్తంబించిన తీరును తప్పుపట్టారు. పత్రికా స్వేచ్చకు ఇది విరుద్దమని నయ్యర్ వ్యాఖ్యానించారు.కాగా జగన్ తనకు అరెస్టు తప్పదనే ఉద్దేశ్యంతోనే ఈ వ్యవహరంలో అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నాడని తెలుగుదేశం నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు అన్నారు. ఇప్పటికే జగన్ ను అరెస్టు చేసి ఉండవలసిందని ఆయన తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-jagan-sakshi-24-13922.html
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది.
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.