అసెంబ్లీ ఆవరణలో విషాదం.. ఐఏఎస్ అధికారి పీఎస్ మృతి..!
Publish Date:Sep 8, 2026
Advertisement
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్) రాజు అకస్మాత్తు గా కుప్పకూలి కింద పడి పోయారు. అక్కడే ఉన్న మంత్రి వాకిటి శ్రీహరి వెంటనే స్పందించి రాజుకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. అసెంబ్లీ ఆవరణలో రాజు అస్వస్థతకు గురై కిందపడిపోవడాన్ని గమనించిన మంత్రి వాకిటి శ్రీహరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్వయంగా సీపీఆర్ చేశారు. (IAS officer PS passes away, IAS officer Naveen Mittal, Minister Vakiti Srihari, CPR, Telangana Assembly Premises, CM Revanth reddy, Telugu News, Telugu One)
అనంతరం అసెంబ్లీ వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసి, అంబులెన్స్‌లో రాజును హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రాజు పల్స్ పూర్తిగా పడిపోయినట్లు సమాచారం. ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. రాజు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించినట్లు తెలుస్తోంది. మంత్రి వాకిటి శ్రీహరి సమయస్ఫూర్తితో స్పందించి సీపీఆర్ చేయడం ద్వారా రాజును కాపాడేందుకు చివరి వరకు ప్రయత్నించారు. ఈ ఘటనతో అసెంబ్లీ ఆవరణలో విషాదఛాయలు అలుముకున్నాయి.
http://www.teluguone.com/news/content/(ias-officer-ps-passes-away-24-230987.html





