దీపకి సారీ చెప్పిన ప్రిన్సిపల్.. పెళ్లి గురించి క్లారిటీ ఇస్తానన్న కార్తీక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -84 లో... ఫాథర్స్ డే రోజు శౌర్య దీప గురించి గొప్పగా చెప్పేసరికి.. అందరు దీపని పొగుడుతారు. మీరెంతో మందికి ఆదర్శం మిమ్మల్ని ఆ రోజు తక్కువ చేసి మాట్లాడానంటూ ప్రిన్సిపల్.. దీపకి సారీ చెప్తాడు. 

మరొకవైపు ఇక నేను వెళ్తున్నాను.. స్వప్నకి అంటే నిజం తెలియక మాట్లాడుతుంది. నీకేమైంది నిజం తెలుసు కదా అసలు స్వప్నకి ఎప్పుడో నిజం చెప్పాలిసిందని కావేరితో శ్రీధర్ అంటుంటాడు. అప్పుడే స్వప్న వచ్చి ఏం నిజమని అడుగుతుంది. దాంతో కావేరి, శ్రీధర్ లు ఇద్దరు టెన్షన్ పడతారు. ఏం లేదమ్మా తెల్సిన ఫ్యామిలీ ఉంది. అబ్బాయి బాగున్నాడని చెప్తున్నా.. ఆ నిజం ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా తనతో చెప్పేది కదా అంటున్నాని శ్రీధర్ కవర్ చేస్తాడు. ఆ తర్వాత శ్రీధర్ క్యాంపుకి వెళ్తున్నానని వెళ్ళిపోతాడు. నేనే అనవసరంగా తప్పు గా అర్థం చేసుకున్నానని స్వప్న అనుకుంటుంది. 

ఆ తర్వాత దీప వెళ్తుంటే.. నర్సింహా ఎదరుపడి నా కూతురిని ఎప్పుడు ఇస్తున్నావ్.. ఇందాక నేను స్కూల్ కి వచ్చాను. నేనే నాన్నని అని చెప్పాలనుకున్న అని నర్సింహా అంటాడు. నా కూతురు నా రక్తమే అయితే నాకు ఇవ్వు అని నర్సింహా తన మాటలతో దీపని టార్చర్ చేస్తాడు. నీకు ఎక్కవ రోజులు టైమ్ ఇవ్వడం లేదు. త్వరగా చెప్పని నర్సింహా వెళ్ళిపోతాడు. 

మరొకవైపు కార్తీక్ పెళ్లి గురించి శ్రీధర్ , కాంచనలు కార్తీక్ ని అడుగుతారు. నాకు టైమ్ కావాలని కార్తీక్ అంటాడు. నాకు తెలుసు నువ్వు ఇలాగే అంటావని.. లేట్ అయిన కొద్ది అందరు అనుకుంటున్నదే నిజం అయ్యేలా ఉందని భయంగా ఉందని శ్రీధర్ అనగానే.. కార్తీక్ షాక్ అవుతాడు మీకు పెళ్లి గురించి క్లారిటీ కావాలి కదా ఇస్తాను. ఈ రోజు రెస్టారెంట్ కి వెళ్దాం.. అక్కడ అన్ని చెప్తానని చెప్పి కార్తీక్ వెళ్ళిపోతాడు. ఇప్పటికైన పెళ్లి గురించి ఒక క్లారిటీ ఇస్తానన్నాడు అని శ్రీధర్, కాంచన లు హ్యాపీగా ఫీల్ అవుతారు. 

మరొకవైపు శౌర్య అలిగి కూర్చొని ఉంటుంది. ఏం అయిందని దీప అంటుంది. నీకు తెలియదా అని శౌర్య అంటుంది. అప్పుడే నర్సింహా అన్నమాటలు దీప గుర్తుకుచేసుకొని.. నువ్వు ఒక వారం రోజులు ఎక్కడికి వెళ్లొద్దని చెప్తుంది. అప్పుడే కార్తీక్ వచ్చి ఎందుకని అని అడుగుతాడు. ఇప్పుడు నరసింహ గురించి కార్తీక్ బాబుకి చెప్పొద్దని దీప అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.