ఒకే ఇంట్లో బర్రెలక్కతో కిర్రాక్ ఆర్పీ!

 

సీరియల్స్, కామెడీ అండ్ డ్యాన్స్, గేమ్ షోస్ ఇలా ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఒకెత్తు బిగ్ బాస్ ఒక్కటే ఒకెత్తు.  తెలుగు బిగ్ బాస్ 7 సీజన్లను పూర్తి చేసుకుని  ఎనిమిదో సీజన్ కోసం రెడీ అవుతోంది. ఐతే రీసెంట్ గా బిగ్ బాస్ లోకి వెళ్లే వాళ్ళ పేర్లతో ఒక లిస్ట్ అనేది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ లో ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.   సుమారు 20 మంది కంటెస్టెంట్స్ ఇంట్లోకి అడుగు పెడతారనే టాక్ వినిపిస్తోంది.   యూట్యూబ్, ఇన్ స్టాతో ఫేమస్ అయిన ఇన్ఫ్లయెన్సర్లను ఎక్కువగా బిగ్ బాస్ హౌస్‌కి తీసుకొచ్చే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది.

బిగ్‏బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్..
1.అంజలి పవన్.. యాంకర్..
2.వింధ్య విశాక.. యాంకర్..
3.నయని పావని.. యూట్యూబర్..
4.కిర్రాక్ ఆర్పీ.. జబర్దస్త్ కమెడియన్..
5.రీతూ చౌదరి.. యాంకర్..
6.అమృతా ప్రణయ్..
7.నిఖిల్.. యాంకర్..
8.కుమారీ ఆంటీ..
9.బర్రెలక్క..
10.అనీల్ గీలా.. యూట్యూబర్..
11.బుల్లెట్ భాస్కర్.. జబర్దస్త్ కమెడియన్..
12.సోనియా సింగ్.. సినీనటి.
13.బమ్ చిక్ బబ్లూ.. యూట్యూబర్..
14.కుషితా కల్లపు.. హీరోయిన్..
15.వంశీ.. యూట్యూబర్..
16.సుప్రిత.. సురేఖ వాణి కూతురు..
ప్రస్తుతం వీరితోపాటు మరికొందరి పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇంకా ఫేమస్ అయ్యి ఆడియన్స్ కి బాగా తెలిసిన ముఖాలనే హౌస్ లోకి తీసుకురాబోతున్నారని వాళ్ళతో బిగ్ బాస్ టీమ్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. చాలా వరకు మసాలా కంటెస్టెంట్స్ ని , వాగుడుకాయల్ని, అలాగే పోట్లాడేవాళ్ళను బిగ్ బాస్ ఏరికోరి కంటెంట్ కోసం తీసుకొస్తూనే ఉంటుంది. మరి ఈసారి వీళ్ళే కాకుండా ఇంకా  అలాంటి ఇంటరెస్టింగ్ కంటెస్టెంట్స్ ఎవరు ఉండబోతున్నారో చూడాలి.