జబర్దస్త్ లో మిస్ వైజాగ్ నక్షత్ర ... నెటిజన్స్ ఫైర్


జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో మొత్తం ఫుల్ గా  నవ్వులే నవ్వులు. ఐతే ఈ వారం ప్రోమోలో అన్ని కూడా బయట రియాలిటీలో జరిగిన ఇన్సిడెంట్స్ ని తీసుకుని చేసినట్టు తెలుస్తోంది. బులెట్ భాస్కర్- ఫైమా- నాటీ నరేష్ స్కిట్ చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. వీళ్ళ స్కిట్ లో భాస్కర్ - ఫైమా పెళ్లి చేసుకున్నట్టు నటించారు. ఐతే భాస్కర్ ఫైమాని వదిలేసి వేరే అమ్మాయితో ఉండడాన్ని చూపించారు.

అది తెలిసి ఫైమా లాగిపెట్టి భాస్కర్ ని కొట్టింది. రీసెంట్ గా సోషల్ మీడియాలో బాగా వైరల్ ఐన మిస్ వైజాగ్ నక్షత్ర స్టోరీ చూస్తే తెలుస్తుంది. అందులో నక్షత్ర తన భర్తను అలా కొట్టింది. ఆ క్లిప్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దాన్ని స్పూఫ్ గా చేసి చూపించారు బులెట్ భాస్కర్ అండ్ టీమ్ . ఇక తర్వాత స్కిట్ ఇస్మార్ట్ ఇమ్మానుయేల్ స్కిట్ లో వర్ష ఇంట్లో దెయ్యాలు ఉన్నాయి అని చెప్పడంతో ఇమ్ము రియాజ్ అనే మాంత్రికుడిని దెయ్యాలను తరమడానికి పిలిచాడు. 10 గంటలకు వస్తానన్నారు అని ఇమ్ము అడిగేసరికి నేను 10 గంటలకు రాను 11 కె వస్తాను..అంటూ రీసెంట్ గా ఏపీలో వైసీపీ 11 సీట్లు మాత్రమే తెచ్చుకున్న విషయాన్నీ హైలైట్ చేస్తూ స్కిట్ చేశారు. దాంతో నెటిజన్స్ అంతా ఫుల్ ఫైర్ అవుతున్నారు. అసలు జబర్దస్త్ లో పాలిటిక్స్ ఎంట్రీ ఏంటి... రియాజ్ అని అడ్డం పెట్టుకుని ఆది వైసీపీని ట్రోల్ చేయడం మొదలు పెట్టాడు..తర్వాత నుంచి అందరూ అదే కంటిన్యూ చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు.