పైసా సంపాదించాలంటే పాలిటిక్స్...ఫేమ్ కావాలంటే మూవీస్

 

రాహుల్ సిప్లిగంజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ పాయింట్స్ చెప్పాడు. పొలిటీషియన్స్ కి పాటలు పాడడం కెరీర్ కి ప్లస్ అయ్యిందా మైనస్ అయ్యిందా అన్న ప్రశ్నకు "నాకు మ్యూజిక్ అంటే ఇష్టం..ఎవరు పాడమన్నా పాడతాను..పొలిటీషియన్స్ లో నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాడమంటే పడకుండా నో అని చెప్పలేను కదా. అన్నా అన్నా అని పిలుస్తారు...ఓల్డ్ సిటీ నుంచి నాకు చాలామంది పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. పాలిటిక్స్, సినిమా ఎప్పుడూ ఇంటరెస్టింగ్ గానే ఉంటాయి.

పైసా సంపాదించాలంటే పాలిటిక్స్, పైసా, ఫేమ్ సంపాదించాలంటే ఇండస్ట్రీ. నాకు అన్ని పార్టీల్లో ఫ్రెండ్స్ ఉన్నారు..అన్ని పొలిటికల్ పార్టీలకు పాడతాను. నేను పాట పాడితే వాళ్లకు ఏదో హెల్ప్ అవుతుంది అనే కదా అడుగుతారు. వాళ్ళ నమ్మకాన్ని ఎందుకు బ్రేక్ చేయాలి. నన్ను సాంగ్ పాడమని ఎవరైనా అడిగితే వాళ్ళది చిన్న సినిమానా , పెద్ద సినిమానా అనేది చూడను. పాడేస్తాను. నా చెయ్యి ఎంత పెద్దది అంటే నాకు బయటి నుంచి కోటి నుంచి కోటిన్నర రావాలి. అంతమందికి ఫ్రీగా సాంగ్స్ పాడాను. కొంతమంది సింగర్స్ ఉన్నారు.. పెద్ద సినిమాలైతేనే పాడతాం అంటారు. కానీ ఆ విషయం నాకు ఎందుకో రాంగ్ అనిపిస్తుంది. నేను అలా అనుకోను. నేను పాట పాడితే వాళ్ళ ఫిలింకి కానీ షార్ట్ ఫిలింకి కానీ మంచి ఫెచింగ్ అవుతుంది అంటే అవకాశం రావడమే గొప్ప అని పాడేస్తాను. మనం గొప్పవాళ్ళం అయ్యామంటే అంత గొప్ప మనసు కూడా ఉండాలి..మా నాన్న నా ఇన్స్పిరేషన్..ధూల్ పేటలో ఉన్నప్పుడు నేను పాటలు పాడడం గమనించి నాన్న నన్ను తీసుకెళ్లి మా తాత దగ్గర చేర్పించడం మొదలు పెట్టారు. అలా ఇంత దూరం వచ్చాను" అని చెప్పాడు.