పోలీసులపై రాళ్ల దాడి :  వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి దాష్టీకం

కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్  రెచ్చిపోయారు. ఎమ్మెల్యేగా ఓడిపోయి, వైసీపీ అధికారానికి దూరమైనా అతనిలో ఏ మార్పు లేదు. కాకినాడ టౌన్ మెయిన్ సెంటర్ వద్ద అక్రమంగా నాలుగు అంతస్తలు భవనాన్ని నిర్మించారు. గతంలో వైసీపీ హయాంలో అడిగేవారు లేకపోవడంతో అక్రమ కట్టడం గురించి అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. ప్రభుత్వం మారింది.. అక్రమ కట్టడాలపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టిసారించింది. రాష్ట్రంలో ఎక్కడ అక్రమ కట్టడాలు ఉన్న సరే నేలమట్టం చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దాంతో అధికారులు కాకినాడలో గల ద్వారంపూడి అక్రమ కట్టడం వద్దకు రాగా ద్వారంపూడి రెచ్చిపోయారు
ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేత సందర్భంగా కాకినాడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అధికారులపై మండిపడ్డారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఆపుతున్నా అధికారులపైకి దూసుకెళ్లేందుకు యత్నించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాకినాడ కార్పొరేషన్ కు చెందిన స్థలాన్ని ద్వారంపూడి అనుచరుడు ఆక్రమించాడు. ఆ స్థలంలో భారీ భవనాన్ని నిర్మిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఏం చేయలేక చేతులెత్తేసిన అధికారులు.. టీడీపీ అధికారంలోకి రావడంతో అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రారంభించారు. ముందుగా నోటీసులు ఇచ్చి, ఆపై తొలగింపులు చేపట్టారు. ఈ క్రమంలోనే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుడికి కూడా నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు ఎలాంటి స్పందన లేకపోవడంతో భవనం కూల్చివేత మొదలుపెట్టారు.
గొడవలు జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. కూల్చివేతల విషయం తెలిసి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. భవనం కూల్చివేతను ఆపాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అడ్డుకుంటున్నా ఆగకుండా అధికారులపైకి దూసుకెళ్లే యత్నం చేశారు. కాగా, ప్రభుత్వ అధికారుల విధి నిర్వహణకు అడ్డుతగిలిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.