ఆటో వెనుక  చందమామ ఫోటో...అంజలి పవన్  హ్యాపీ


బుల్లితెర మీద అంజలి పవన్ సీరియల్ యాక్టర్స్ గా అందరికీ తెలుసు. మొగలి రేకులు సీరియల్‌తో నటి అంజలి పవన్‌కు మంచి క్రేజ్ వచ్చింది. అప్పుడప్పుడు కొన్ని మూవీస్ లో సైడ్ రోల్స్ లో కనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్య మాత్రం అంజలి పవన్ యూట్యూబ్ చానెల్ ద్వారా హాట్ టాపిక్ మారింది. నటి అంజలి తన కూతురు ధన్వికతో, తన భర్త పవన్‌తో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఇన్ స్టాగ్రాంలో సందడి చేస్తుంటుంది. అలాంటి అంజలి రీసెంట్ గా ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. అందేంటంటే అంజలి వాళ్ళు బెంగళూరు వెళుతుండగా దారి మధ్యలో ఒక ఆటో వెనక ఒక పాప ఫోటొ చూసి ఆగి ఆ ఆటో డ్రైవర్ తో మాట్లాడింది అంజలి. ఆ పాప ఎవరు ఎందుకు ఫోటో వేయించుకున్నావ్ అని అడిగింది.

ఆ పాప బాగుందని పెయింటింగ్  వేయించుకున్నా అని ఆన్సర్ ఇచ్చాడు. ఐతే ఆ పాప ఎవరో కాదు అంజలి వాళ్ళ అమ్మాయి ధన్విక సాషా. వాళ్ళ అమ్మాయిని ప్రొమోషన్స్ లో భాగంగా ఆ పిక్ ని అంజలి తీయించింది. దాన్ని ఆ ఆటో మీద చూసేసరికి అంజలి ఫుల్ హ్యాపీ ఐపోయి ఆ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకుంది. ఈ అంజలి పవన్ నీతోనే డాన్స్ షోలో కూడా పార్టిసిపేట్ చేశారు. కానీ లాస్ట్ లో పవన్ కాలికి కొంత ఇబ్బంది అయ్యేసరికి షో నుంచి వెళ్లిపోయారు.