Karthika Deepam2 : నా బావతో పెళ్లి ఆ దీపకి ఇష్టం లేదు..కళ్ళు తిరిగి పడిపోయిన శౌర్య!

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -87 లో....ఆ దీపకి బావతో నా పెళ్లి జరగడం ఇష్టం లేదని పారిజాతానికి జ్యోత్స్న చెప్తుంది. ఈ రోజు రెస్టారెంట్ లో దీప ప్రవర్తన ఎందుకో కొంచెం తేడాగా ఉంది. అందరం వెళ్ళాం.. మావయ్య ఇప్పుడే వస్తానంటూ వెళ్ళాడు అప్పుడే బావ ఫ్రెండ్ స్వప్న ఇంకా వాళ్ళ మదర్ వచ్చారు. కాసేపటికి దీప మావయ్య దగ్గరికి వెళ్లి ఏదో మాట్లాడి వచ్చింది. స్వప్న వాళ్ళు వెళ్తానంటే వెళ్ళమని దీప అంది. ఆ తర్వాత మావయ్య వచ్చాడు. నాకు ఏం అర్ధం కాలేదు.. ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను.. నేను బావని పెళ్లి చేసుకోవడం మాత్రం దీపకి ఇష్టం లేదని జ్యోత్స్న అంటుంది.

నీకు ఇప్పుడే తెలిసింది.. నాకు ఎప్పుడో తెలుసని పారిజాతం అనుకుంటుంది. ఇప్పుడేం చేయాలని జ్యోత్స్న అడుగగా.. అర్జెంటుగా మీ బావతో ఎంగేజ్మెంట్ జరగాలని పారిజాతం అంటుంది. అంతే అంటావా.. ముందు ఆ దీపని పంపించాలని జ్యోత్స్న అంటుంది.. మరొకవైపు దీప వెళ్ళమని చెప్పినందుకు కావేరి, స్వప్నలు తనపైన కోపంగా ఉంటారు. అసలు బాస్ పై ఆ దీప పెత్తనమేంటో అక్కడున్నంతసేపు బాస్ వాళ్ళ నాన్న రాలేదు.. కాంచన గారు టెన్షన్ పడుతున్నారు.. జ్యోత్స్న కోపంగా చూస్తున్నారని స్వప్న అనగానే.. వాళ్ళ గురించి మనకెందుకని కావేరి అంటుంది.ఆ తర్వాత శౌర్యని దీప పడుకోపెడుతూ రెస్టారెంట్ లో జరిగింది గుర్తుకుచేసుకుంటుంది.

కాసేపటికి దీప కిచెన్ లోకి వెళ్తుంది. అప్పుడే శౌర్య దగ్గరికి చాటుగా వస్తాడు నరసింహా. నువ్వు నా కూతురిని ఇవ్వమంటే ఇవ్వట్లేదు కదా.. నేనే తీసుకొని వెళ్తానంటూ శౌర్యని ఎత్తుకొని.. పక్కన దాక్కుంటాడు. దీప వచ్చేసరికి శౌర్య కన్పించదు.. ఎక్కడ అని వెతుకుతుంటే అప్పుడే నర్సింహా ఎత్తుకొని కన్పిస్తాడు. బలవంతంగా శౌర్యని దీప లాక్కుంటుంది. శౌర్యా నిద్ర నుండి లేచి బూచోడు అంటుంది. నర్సింహా పారిపోతాడు. శౌర్య భయంతో కళ్ళుతిరిగి పడిపోతుంది. వెంటనే దీప హాస్పిటల్ కి తీసుకొని వెళ్తుంది. కార్తీక్ అంటు శౌర్య కలవరిస్తుంది. అప్పుడే డాక్టర్ వచ్చి అతన్ని పిలిపించండి అంటాడు. కార్తీక్ కి దీప ఫోన్ చేసి.. హాస్పిటల్ కి రమ్మని చెప్తుంది. కాసేపటికి కార్తీక్ హాస్పిటల్ కి వచ్చి.. శౌర్యని చూస్తాడు. బూచోడు వస్తాడు నువ్వు ఎక్కడికి వెళ్ళకు ఇక్కడే ఉండమని కార్తీక్ తో శౌర్య అనగానే.. కార్తీక్ సరే అంటడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.