అనసూయ ఆంటీని కన్నెపిల్లను చేశారు

 

కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్  ప్రోమోలో అనసూయ చాలా హాట్ గా ఉంది.  
ఈ షో శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారమవుతోంది.  నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ‘కాలేజ్ థీమ్’తో కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ పోటీ పడ్డారు. కాలేజ్ రోజుల్ని గుర్తు చేసుకుంటూ వీళ్ళు చేసిన పెర్ఫామెన్స్‌లు మామూలుగా లేవు. ‘‘కనులు తెరిచిన కన్నెపిల్ల.. కవిత రాసిన కన్నెపిల్ల..  కాలేజీ స్టైలే’’ అంటూ అనసూయ ఆంటీని కన్నెపిల్లను చేసి మరీ చూపించారు. ఇక హాట్ రెడ్ మిర్చి సరీలో చేతిలో పుస్తకాలు  పట్టుకుని కిక్కెక్కించేదిలా ఉంది అనసూయ. ఇక బిగ్ బాస్ గ్యాంగ్ , సీరియల్ యాక్టర్స్ గ్యాంగ్ అనసూయను చూసి ఆమె చీర కొంగు తిప్పిన స్టైల్ చూసి  నెత్తిన చేతులు పెట్టున్నారు బాయ్స్. "నాకు కాలేజ్‌లో స్టూడెంట్స్ అన్నారు.. పేరెంట్స్ కూడా ఉన్నారా ?" అంటూ అంబటి అర్జున్‌పై పంచ్ వేసింది హోస్ట్  శ్రీముఖి. ఇక ఈ షోలో అంతా సీనియర్స్ ముదిరిపోయి పెళ్ళిళ్ళై, పిల్లలున్న బ్యాచ్. ఎవరూ యంగ్ గ్యాంగ్ ఐతే లేదు.  

"మాలాంటి అందమైన అమ్మాయిలు" అని విష్ణుప్రియ అనడంతో బాయ్స్ బ్యాచ్ అంటా హడావిడి చేసి ఆమెను డైలాగ్ చెప్పనివ్వకుండా చేశారు. "బొత్తిగా మీ కాలేజ్ వాళ్లకు డిసిప్లిన్ లేదు" అని అనసూయ కౌంటర్ వేసేసరికి  ‘మేడమ్ సార్ మేడమ్ అంతే’ అని కుర్రాళ్లంతా టీజ్ చేసేసారు. ఇక ఈ డైలాగ్ కి పాపా ఫుల్ ఫిదా ఐపోయి ముసిముసిగా నవ్వేసుకుంది. ఇక అంబటి అర్జున్, ప్రియాంకను ఎగరేసి మరీ ఎత్తుకున్నాడు. ప్రియాంక అంబటి అర్జున్ తలపై గుద్దిపడేసింది.

ఇక శేఖర్ మాష్టర్ వచ్చి "ఏ కాలేజీ కాంపిటీషన్ లో ఐనా అబ్బాయిలు ఓడిపోయినట్లు చరిత్రలో లేదు" అని భారీ డైలాగ్ వేశారు. "ఈ చరిత్రలు, చెత్తబుట్టల గురించి నాకు తెలీదు కానీ విన్నర్స్ మాత్రం మా గర్ల్స్ " అంటూ  చివర్లో అనసూయ చీర చెంగును బొడ్లో దోపి బాస్కెట్ బాల్ ఆడేసింది. బాస్కెట్ లోకి బాల్ వేసి కెవ్వు అంటూ కూత పెట్టించింది. ఏదేమైనా ఈ ఎపిసోడ్ లో అందరి దృష్టిని అనసూయ లాగేసుకుంది అని చెప్పొచ్చు.