ఆహా ఇండియన్ ఐడల్ లో సింగర్స్ కి ఛాన్సెస్ ఇస్తున్న జడ్జెస్


ఆహా ఇండియన్ ఐడల్ సీజన్ 3 నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో కొన్ని ఇంటరెస్టింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ టు సీజన్స్ కంటే ఈ సీజన్ ఫుల్ ఇంటరెస్టింగ్ గా ఎంటర్టైనింగ్ గా ఉంది. అంటే జడ్జెస్ గీత మాధురి, థమన్, కార్తీక్, శ్రీరామచంద్ర అంటే ఆ జోష్ వేరేగా ఉంటుంది. ఈ నలుగురు కూడా బాగా అల్లరి చేసే గ్యాంగ్. కాబట్టి స్టేజి కూడా అలాగే అల్లరిగా ఉంటుంది. ఇక ఈ ప్రోమోలో చూస్తే రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చాడు. అలాగే సింగర్ స్కందాని తెగ మెచ్చేసుకున్నాడు విజయ్ . స్కందా వయసు 15 ఏళ్ళు అని తెలుసుకుని వావ్ అన్నాడు. ఇక స్కంద.. వాళ్ళ అమ్మను స్టేజి మీదకు పిలిచి పరిచయం చేసాడు.

ఆ కాంబినేషన్ చూసిన విజయ్ దేవరకొండ "దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. మన లైఫ్ లో ఇలాంటి అమ్మాలను ఇచ్చినందుకు. మా అమ్మ నవ్వుతూ హ్యాపీగా ఉంటే నేను అన్ని పనులు వదిలేసి అలా చూస్తూ ఉండిపోతా"అని వాళ్ళ అమ్మ గురించి చెప్పాడు విజయ్. తర్వాత కేశవ్ వచ్చి విజయ్ దేవరకొండ మూవీలోని సాంగ్ పాడాడు. అతని పెర్ఫార్మెన్స్ కి కార్తిక్ ఫిదా ఐపోయి తన బ్యాండ్ లో పాడే ఛాన్స్ ఇచ్చాడు. ఇక రాబోయే రోజుల్లో ఎవరు ఎలాంటి పెర్ఫార్మెన్సెస్ ఇస్తారు ఎన్ని ఛాన్సెస్ కొట్టేస్తారో  చూడాలి.