Guppedantha Manasu : ఆమె కోసం కొత్త డ్రెస్.. కుళ్ళుకున్న మరదలు!

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1117 లో....రంగా బట్టలు సర్దుతుంటే వసుధార వచ్చి.. అవి మీ బట్టలా అని అడుగగా.. అవునని రంగా అంటాడు. ఎందుకు సర్ ఇలా చేస్తున్నారు.. అసలు ఎవరి గురించి ఇలా అయ్యారు.. మీరు ఎలా ఉండే వారని వసుధార అంటుంది. ఎలా ఉండేవాన్ని అని రంగా అనగానే.. వసు రిషి స్టైల్ ని ఉహించుకొని మిమ్మల్ని చుస్తే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించేదని వసుధార రిషి గురించి గొప్పగా చెప్తూ ఉంటుంది. మీరు నా రిషి సర్ కాదంటున్నారు.. బట్టలు తీసుకొని రమ్మని చెప్పగానే కలర్, మెజర్ మెంట్స్ ఏం అడగకుండా వెళ్లారని వసుధార అంటుంది.

నేను వెళ్లి మంచి డిజైన్ బట్టలు చూపించమని అడిగాను.. వాళ్లే చూపించారని రంగా అంటాడు. ఆ తర్వాత మీరు నాకు ఏదైనా జాబ్ ఇప్పించండి.. మీ డబ్బులు మీకు ఇస్తానని వసుధార అనగానే.. మీకు నేను ఏం జాబ్ ఇప్పించగలనని రంగా అంటాడు.ఆ తర్వాత వసుధార, పెద్దావిడ మాట్లాడుకుంటుంటే.. అప్పుడే రంగా వచ్చి మేడమ్ గారు మీరు జాబ్ అన్నారు కదా చూసానని రంగా అంటాడు. ఏంటి బట్టల షాప్ లో సేల్స్ గర్ల్స్ గా చూసారా అని వసుధార అంటుంది. లేదు మేడమ్ మీరు బాగా చదువుకున్న వారు కదా.. అందుకే పిల్లలకు పాఠాలు నేర్పే టీచర్ జాబ్ అని రంగా అనగానే.. వసుధార హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది చేస్తారా మేడమ్ అని రంగా అడుగగా.. చేస్తాను మీరేం అంటారు బామ్మ అని పెద్దావిడని అడుగుతుంది. పిల్లలకి పాఠాలు నేర్పడం అంటే ఒక వరం లాంటిది వేళ్ళు అని అంటుంది. మనం ఇప్పుడే స్కూల్ కి వెళ్ళాలి రెడీ అయి రండి అని వసు కి రంగా చెప్తాడు.

వసుధార కోసం రంగా వెయిట్ చేస్తుంటే.. అప్పుడే సరోజ టిఫిన్ తీసుకొని వస్తుంది. టిఫిన్ చెయ్ బావ అనగానే రంగా టిఫిన్ చేయడానికి రెడీ అవుతుంటాడు. అప్పుడే వసు రెడీ అయి వస్తుంది. తనని రంగా అలా చూస్తూ ఉండిపోతాడు. తను రాగానే టిఫిన్ చేయకుండా అలాగే వెళ్ళిపోతాడు. దాంతో సరోజ కోపంగా ఉంటుంది. ఆ తర్వాత ఆటోలో వెళ్తు వసుధారని అద్దంలో చూస్తూ ఉంటాడు రంగా. ఏమైందని వసుధార అడుగుతుంది. నాకు తెలిసినా ఆవిడ ఇలాంటి డ్రెస్ లో చూసానని రంగా అనగానే.. సరోజనా అని వసుధార అడుగుతుంది. లేదని రంగా అంటడు. మరి ఎవరని వసుధార అడుగుగా.. మా అమ్మా అంటూ తన అమ్మ గురించి గొప్పగా చెప్తూ.. తను ఇప్పుడు లేదంటూ బాధపడుతాడు. వసుధార మాత్రం జగతిని గుర్తుకుచేసుకుంటుంది. ఆ తర్వాత వసుధారని స్కూల్ కి తీసుకొని వెళ్తాడు. అక్కడ సర్ వసు సర్టిఫికెట్స్ కావాలని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.