అనిల్‌ కుమార్‌కి ఏమైంది? బుల్లెట్ దిగిందా?

నెల్లూరు సెంట్రల్ జైల్లో వున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం, ఆ తర్వాత మీడియా మైకుల ముందు మాట్లాడుతూ అవాకులూ చవాకులూ పేలడం, చివర్లో మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే పారిపోవడం.. ఇవన్నీ అందరూ గమనించారు. అయితే ఈ ఇష్యూలో ఒక హైలైట్ పాయింట్‌ని కొంతమంది మాత్రమే గమనించారు. ఆ పాయింట్ మరోదో కాదు.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. 

నెల్లూరు సెంట్రల్ జైలు బయట జగన్ మీడియా మైకుల ముందు అవాకులూ, చవాకులూ పేలుతున్న సమయంలో సరిగ్గా ఆయన వెనకే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నిల్చుని వున్నారు. జగన్ మాట్లాడినంతసేపూ అనిల్ కుమార్ యాదవ్ చాలా ఇబ్బందిగా ముఖం పెట్టుకుని కనిపించారు. మొదటి నుంచి చివరి వరకు రకరకాల ఎక్స్.ప్రెషన్లు ఇస్తూ కనిపించారు. ఏదో బాధపడిపోయినట్టు.. ఎక్కడో బుల్లెట్టు దిగినట్టు.. అనవసరంగా ఈ పార్టీలో వున్నాన్రా దేవుడా అన్నట్టుగా ముఖం పెట్టుకుని వున్నారు. మనిషి నిల్చున్నాడే గానీ, ఏదో బాధపడిపోతున్నారు. ఎలా వుండేవాడిని ఎలా అయిపోయాను అన్నట్టుగా, వికారంగా, విచిత్రంగా, తంటాలు పడుతున్నట్టుగా నిల్చుని వున్నారు. అసలు ఆయన సమస్యేంటో అర్థం కావడం లేదు. అలాగే జగన్‌కి మరోపక్కన నల్లకళ్లద్దాలతో నిల్చుని వున్న అంబటి రాంబాబు సినిమాల్లో కనిపించే గూండాల అసిస్టెంట్ లాగా ఎక్స్.ప్రెషన్ పెట్టుకుని నిల్చున్నారు. మొత్తానికి జగన్ మాట్లాడిందంతా చెత్తా చెదారమేగానీ, ఒకవైపు అనిల్ కుమార్ యాదవ్, మరోవైపు అంబటి రాంబాబు భలే కామెడీగా వున్నారు.