పిన్నెల్లి పరామర్శ ఖర్చు పాతిక లక్షలు!

మంచివాడు, ఏదో సరదాగా హత్యాయత్నం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైల్లో వుంటే, శాంతిదూత, సుద్దపూస జగన్ వెళ్ళి పరామర్శించారు. దీనికి అయిన ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాలా పాతిక లక్షలు. గన్నవరం నుంచి నెల్లూరు వరకు హెలికాప్టర్ రానూ పోనూ ఖర్చులు.. హెలిపాడ్ నుంచి జైలు వరకు రాను పోనూ ఖర్చులు, ప్రైవేట్ సెక్యూరిటీ... వీటన్నిటికీ అయిన ఖర్చుతో ఒక పేద కుటుంబం జీవితాంతం చీకూ చింతా లేకుండా బతకొచ్చు. ఏపీ ప్రజల టైమ్ బాగుండి జగన్ అధికారంలో లేదు. అధికారంలో వుంటే ఖర్చు ఇంకా భారీగా వుండేది. చెట్లు కొట్టడం, పరదాలు వేయడం, ఇంకా భారీ సెక్యూరిటీ.. ఎంత లేదన్నా రెండు మూడు కోట్లు స్వాహా అయిపోయేవి.  

నిజానికి జగన్ వెళ్ళింది పిన్నెల్లిని పరామర్శించి, ఓదార్చడానికి కాదు.. పరామర్శ పేరుతో పనికిమాలిన రాజకీయాలు చేయడానికి... తన సైకోయిజాన్ని ప్రదర్శించడానికి.. ఘర్షణ వాతావరణం క్రియేట్ చేయడానికి! వాస్తవానికి నెల్లూరు సెంట్రల్ జైలులో పిన్నెల్లిని కలిసే ములాఖత్‌ల కోటా అయిపోయింది. అయినప్పటికీ, జగన్ వెళ్తానన్నాడు కదా అని ప్రభుత్వం అవకాశం కల్పించింది. మొన్న అసెంబ్లీలో పోనీలే అని మొదటగా ప్రమాణ స్వీకారం చేయిస్తే, ఆ తర్వాత జగన్ ఎంత కంపు చేశారో తెలిసిందే. ఇప్పుడు కూడా అంతే, పోనీలే కదా పిన్నెల్లిని కలిసే అవకాశం ఇస్తే అక్కడ కూడా రచ్చ చేసి వదిలిపెట్టాడు.