పడుకునే ముందు దీన్ని తాగితే...

  బరువు పెరగడం ఎంత తేలికో... తగ్గడం అంత కష్టం. అందుకే ఒబెసిటీ ఇప్పుడు పెద్ద సమస్య అయ్యి కూర్చుంది. మారిపోయిన ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోడానికి కూడా సమయంలోని జీవనశైలి, అంతకంతకూ ఎక్కువవుతోన్న ఒత్తిడి స్థూలకాయానికి దారి తీస్తున్నాయి. పెరిగిన బరువుని తగ్గించుకోవడం తలకు మించిన పనైపోయింది. అలాంటివారికి ఓ చక్కని మార్గం చూపిస్తున్నారు నిపుణులు.   200 మి.లీ. నీటిని బాగా మరిగించాలి. ఇందులో అరచెంచా దాల్చినచెక్క పొడి కలిపి పక్కన పెట్టాలి. చల్లారిన తర్వాత చెంచాడు తేనె కలిపి ఫ్రిజ్ లో పెట్టేయాలి. ఈ పానీయాన్ని రోజూ పడుకోవడానికి అరగంట ముందు తాగితే మెల్లమెల్లగా బరువు తగ్గిపోతారు.   జిమ్ ల చుట్టూ తిరగడం, లైపోసక్షన్లంటూ రిస్కీ ఆపరేషన్లకు సిద్ధపడటం చేయకుండా... ఇంట్లోనే, అందుబాటులో ఉన్న వస్తువులతో చేసే ఈ డ్రింక్ ఒబెసిటీకి చెక్ పెట్టేస్తుంది. ఎందుకంటే దాల్చినచెక్క కొలెస్ట్రాల్ ను కరిగించేసి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనికి సహజసిద్ధమైన తేనె కలిస్తే మరింత మేలు జరుగుతుంది. ఈ రెండూ కలిసి బరువు తగ్గించకమే కాదు... రకరకాల బ్యాక్టీరియాలను మన దరిదాపుల్లోకి రాకుండా కూడా చేస్తాయి. కావాలంటే ట్రై చేసి చూడండి... మీకే తెలుస్తుంది. -Sameera  

read more
Relieving Back Pain

  Back pain is a serious trouble making us handicapped! With the onset of back ache you are most unlikely to sit or stand still. Back ache is one of the frequent complaints of this era! And statistics say that it is one the most common complaints bought to the notice of the physicians! The potential causes for back pain include: muscle dysfunction, osteoarthritis, malignancy of spine, stenosis or degenerative diseases of spine or it might be a simple case of over-stress! Here are some quick-fixes for the achy back pain: It is best to strengthen the back muscle instead, fearing the scary back ache. Experts say that non-drug remedies like strengthening exercises and movement therapies are best medicines for recurring back pains! It is important that you improve your posture and be aware of your movements. You make it a point to use all your body for the movement rather than straining some areas! Since back pain can be affected by the way you use your shoulders or the way you move out of the couch! Get a good and warm massage! Massaging the back muscles is a relaxing way to loosen the stiff muscles of the back and it also surges the blood flow. Massaging is a proven formula to vent out the discomfort and aids in speedy healing! Enhancing the muscle health is yet another alternative. For which the intake of Vitamin D and magnesium is to be elevated. Vitamin D found in fish and diary products, improves the absorption of calcium which empowers the spine, ligaments and the muscles! Gulp down leafy veggies and nuts for magnesium which improves overall health of the muscles! Back pain might look like an inevitable scare for the computer era, as we stick to our machines all-day long! And hardly bother about the posture we are in, so please make sure you take of your posture as well as your back!!

read more
ads
Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Does starch in food just makes you fat?

  Starchy foods such as white rice, bread and potatoes belong to the class of foods called carbohydrates. They provide the body with energy to function as part of macro nutrient group. Your diet should, therefore, have adequate carbohydrates to fulfill your body's needs. Carbohydrates however are of two types, simple and complex. Simple carbohydrates include sugars, while complex carbohydrates include starch. Your body assimilates both carbohydrates differently. Sugar is absorbed quickly, producing instant energy but inducing hunger immediately afterwards. Excess sugar is converted into fat. Sugar is thus not a good long-term source of energy. In contrast, starch burns slowly, providing energy over a much longer period and is the ideal source of energy for the body. John Vanderveen, of the FDA's Center for Food Safety and Applied Nutrition, estimates that 55 percent of the calories in our diet should come from these complex carbohydrates. Starchy foods such as vegetables and whole grains that are unpolished also contain fibre, which aids digestion by providing roughage. Medical studies have also linked fibre in food with the prevention of certain cancers. "While starch, by itself is not fattening, how you consume it is important," caution nutritionists. They recommend boiling or baking potatoes instead of frying them. "Deep-frying will make any vegetable, not just potatoes, fattening and unhealthy," they explain. Again, brown rice is healthier than white. "This is because the milling process robs the rice of essential B vitamins and fibre,". Verdict: Stock up on some starch -- your body needs it. However, guard against the fat you eat along with it. Tips: You can get complex carbohydrates from a range of healthy sources such as potatoes, rice, grains, beans, whole wheat bread and vegetables. Apart from complex carbohydrates research shows that regular intake of anti-oxidants, vitamins, protein, minerals and good fat is critical for protection from diseases and increasing lifespan. Include plenty of whole-grains, brightly coloured (red, yellow and green) fruits and vegetables. Choose fresh, seasonal and organic foods. Move to natural sources of fats such as seeds, nuts, coconut, fish and cold pressed oils. Protein sources are like fish, soya, eggs, peas and beans, seeds, nuts, fermented milk etc. While beans are often associated with the gastrointestinal disturbances that they may cause, they are also very good sources of protein, fibre and iron. Some of the best kinds of beans to eat are: - Navy beans - White beans - Kidney beans - Lima beans Get into functional foods like barley, oats, soya, garlic, onion, mushrooms, berries, yoghurt, etc. Also incorporate these lifestyle changes: • Ensure a deep and restful sleep through the night. • Have meals in pleasant surroundings and in enjoyable company. • Have confectionary and desserts only occasionally. • Do not ever skip breakfast, have smaller, frequent meals and early dinner. • Avoid junk foods that are loaded with sugars, salt and unhealthy fats. • Do not smoke and indulge in substance abuse. • Make sure you have some regular physical activity. courtesy Glow With Health Wellness Solutions

read more
ప్రపంచానికి పెనుభారమవుతున్న చిన్నారులు

  మీ పిల్లలు బొద్దుగా.. ముద్దుగా ఉన్నారని సంబరపడి అలాగే వదిలివేయకండి.. ఎందుకంటే ఆ బొద్దుతనమే భవిష్యత్తులో మీ చిన్నారిని ఇబ్బందుల పాలుజేస్తుంది. అవును.. ఊబకాయం ప్రపంచానికి పెనుముప్పుగా మారుతోంది. ముఖ్యంగా చిన్న పిల్లలు.. 19 ఏళ్లలోపు వయసు గల యువతి, యువకుల్లో ఇది తీవ్ర సమస్యగా మారింది. గత నాలుగు దశాబ్ధాల్లో మనుషులు విపరీతంగా బరువు పెరగడం పది రెట్లు పెరిగింది. గతంలో ఈ సమస్య కేవలం అభివృద్ధి చెందిన దేశాలకే పరిమితమనే అభిప్రాయం ఉండేది. కానీ నేడు అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల్లోనూ ఊబకాయుల సంఖ్య పెరిగిపోతున్నట్లు ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్- ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది.   దీని ప్రకారం ఐదు నుంచి 19 సంవత్సరాల వయస్సులోపు బాల, బాలికల్లో ఊబకాయంతో బాధపడుతున్న వారు 1975లో 1.10 కోట్ల మంది కాగా, 2016 నాటికి ఈ సంఖ్య 12.40 కోట్లకు పెరిగింది. వీరే కాకుండా అధిక బరువుతో ఉన్నవారు మరో 21.30 కోట్ల మంది ఉన్నారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఊబకాయానికి ప్రధాన కారణాలని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ప్రాసెస్ చేసిన హై కేలరీలు, పోషకాలు కల ఆహారం అధికంగా తీసుకోవడం దానికి తోడు తగినంత వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం సమస్యను మరింత తీవ్రం చేస్తోంది. అధిక బరువు కారణంగా పలు రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి.   చురుకుతనం తగ్గిపోవడం, నలుగురిలో కలవడానికి సిగ్గుపడటంతో పాటు మధుమేహం, రక్తపోటు, గుండెపోటు వంటి వ్యాధులు వస్తాయి. మార్కెట్లో అధిక కేలరీలు కలిగిన ప్రాసెస్డ్ ఫుడ్ చాలా తక్కువ ఖర్చుకే వచ్చేస్తుండటంతో ప్రజలు వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. పిల్లలు కూడా టీవీలు, కంప్యూటర్లు చూస్తూ పెరుగుతున్నారు. నేటి తరం చిన్నారుల్లో శారీరక శ్రమతో కూడిన ఆటలు ఆడేవారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. పిల్లలను ఇలాంటి వాతావరణం నుంచి దూరం చేసి వారికి శారీరక శ్రమ అలవాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే ఇది ప్రపంచం ముందు అతిపెద్ద సవాలుగా నిలుస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.

read more
బీపీ తగ్గేందుకు సులువైన మార్గం

  రక్తపోటు! ఈ జబ్బు గురించి ఇప్పుడు ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. ఇంటికొకరు ఇప్పుడు రక్తపోటుతో బాధపడుతున్నారు. కానీ మన పూర్వీకులలో ఈ సమస్య ఇంతగా ఉండేది కాదు కదా! మరి ఇప్పుడు రక్తపోటు ఇంతగా ఎందుకని వేధిస్తోంది? ఇది రాకుండా చూసేందుకు, వచ్చినా చటుక్కున తగ్గించుకునేందుకు వేరే మార్గమేదీ లేదా? అంటే అబ్బో చాలా సులువైన మార్గమే ఉందంటున్నారు కాలిఫోర్నియాకు చెందిన Alicia McDonough అనే ఆహార నిపుణులు...   పూర్వీకుల తిండిలో... మన పూర్వీకుల ఆహారంలో దుంపలు, కూరగాయలు, పళ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు, పప్పులు... అన్నీ సమృద్ధిగా ఉండేవి. వీటిలో పొటాషియం ఎక్కువగానూ, సోడియం (ఉప్పు) శాతం చాలా తక్కువగానూ ఉండేది. దాంతో మన నాలుకలు మరింత ఉప్పు కోసం తపించిపోవడం మొదలుపెట్టాయి. ఈ జిహ్వచాపల్యాన్ని తీర్చేందుకు రోజువారీ ఆహారంలో ఎక్కువ ఉప్పుని చేర్చడం మొదలుపెట్టాము. ఆహారసంస్థలు కూడా వినియోగదారులని ఆకట్టుకునేందుకు తమ ఉత్పత్తులలో ఎక్కువ ఉప్పుని చేర్చసాగాయి. చివరికి విపరీతంగా ఉప్పు తినే అలవాటుని చేసుకున్నాము. కానీ ఆ కారణంగా మన శరీరం పడుతున్న ఇబ్బందిని గ్రహించలేకపోయాము. శరీరంలో సోడియం నిల్వలు పెరిగిపోయి అవి రక్తపోటుకి దారితీస్తున్నాయి.   కిం కర్తవ్యం! ప్రపంచంలో దాదాపు నూరుకోట్ల మంది రక్తపోటుతో బాధపడుతున్నారంటే అందుకు ముఖ్య కారణం మన ఆహారంలో వచ్చిన మార్పులే! గుండెజబ్బుతో చనిపోయేవారిలో సగం కేసులు అధిక రక్తపోటువే! ప్రస్తుతానికి రక్తపోటు తగ్గించడానికి వాడే మందులు మన శరీరంలోని సోడియం స్థాయిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందుకు బదులుగా పొటాషియం అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే సరిపోతుందంటున్నారు Alicia McDonough. శరీరంలో పొటాషియం ఎక్కువైతే అధికంగా ఉన్న పొటాషియం నిల్వలను మూత్రం ద్వారా బయటకి పంపే ప్రయత్నం జరుగుతుంది. దాంతో పాటుగా అధిక సోడియం కూడా బయటకు వెళ్లిపోతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే రక్తపోటు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు వాడే ‘లాసిక్స్’ వంటి మందులు ఎంత ప్రభావం చూపుతాయో.... పొటాషియం అధికంగా ఉండే ఆహారం వల్ల అంతే ఉపయోగం ఉంటుంది.   ఆహారంలో చిన్నపాటి మార్పులు పొటాషియం అధికంగా ఉండే అరటిపళ్లు, చిలగడదుంపలు, చేపలు, ఖర్జూరాలు, బీన్స్ వంటి పదార్థాలు తరచూ తినడం వల్ల శరీరంలోని సోడియం, పొటాషియం నిష్పత్తి సరిగ్గా ఉంటుంది. మరింత ఉప్పు తినాలన్న తపనా క్రమేపీ తగ్గుతుంది. బీపీమందులు వేసుకుంటే ఎంత లాభం ఉంటుందో, పొటాషియం అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల అంతే లాభం ఉంటుందని బల్లగుద్ది మరీ చెబుతున్నారు Alicia McDonough. ఈ మాట మన ప్రకృతి వైద్యులు ఎప్పుడోనే చెప్పారుగా! మనం వింటేనా!!! - నిర్జర.  

read more
చలికాలం ఓ తలనొప్పి

  చలికాలం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. హాయిగా కాస్త చల్లగాలికి అటూఇటూ తిరిగిరావాలనో... ఎటూ పోలేనంత చలి ఉంటే వెచ్చగా పడుకోవాలనో ఎవరికి మాత్రం తోచదు. కానీ చలికాలంతో పాటుగా వచ్చే అనారోగ్యాలు మనకి నిలకడ లేకుండా చేస్తాయి. జలుబు దగ్గర్నుంచీ పొడిబారిపోయే చర్మాల వరకూ రకరకాల సమస్యలు చిరాకు పెట్టేస్తాయి. వాటిలో ఒకటి తలనొప్పి...   ఎందుకు వస్తుంది విపరీతమైన చలిగాలిలో తిరిగినప్పుడు తలనొప్పి రావడం సహజమే! దీని స్పష్టమైన కారణాలు తెలియనప్పటికీ, మన మెదడులో ఉండే కొన్ని రక్తనాళాలు చలికి కుంచించుకుపోవడం వల్ల ఈ తలనొప్పి వస్తుందని ఊహిస్తున్నారు. చాలా సందర్భాలలో ఈ తలనొప్పి ఇలా వచ్చి అలా మాయమైపోతుంది. కానీ అప్పటికే జలుబు, జ్వరం వంటి సమస్యలు ఉన్నవారిలో ఇది రోజంతా వేధించే ప్రమాదం ఉంది. ఇక మైగ్రేన్, సైనస్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు ఈ కాలంలో మరింత తరచుగా తలనొప్పి బారిన పడే అవకాశం ఉంటుంది.   జాగ్రత్తలు చలిగాలి బయట తిరగాల్సి వచ్చినప్పుడు తల, గొంతు భాగాలకు గాలి తగలకుండా ఏదన్నా చుట్టుకోవడం తొలి జాగ్రత్త. ఇదే కాకుండా ఈ కింది చర్యలు తీసుకోవడం వల్ల కూడా చలికాలపు తలనొప్పులను నివారించవచ్చు. - చలికాలపు తలనొప్పి వచ్చిన వెంటనే కాసేపు విశ్రాంతి తీసుకోవడం వల్ల చాలా సందర్భాలలో వెంటనే ఉపశమనం లభిస్తుంది. వెచ్చని గదిలో, ప్రశాంతమైన మనసుతో తీసుకునే విశ్రాంతితో తలనొప్పి చిటికెలో దూరం అవుతుంది. - చలికాలపు సూర్యరశ్మిలో తగినంత తీక్షణత ఉండదు. ఫలితంగా మన జీవగడియారంలో అనేక మార్పులు వస్తుంటాయి. దీని వలన మనం నిద్రపోయే వేళలలోనూ మార్పులు సహజం. ఇలా చలికాలంలో సరైన నిద్ర లేకపోయినా, అవసరానికి మించి నిద్రపోయినా తలనొప్పులు ఖాయమంటున్నారు. - సాధారణంగా చలికాలంలో తక్కువ దాహం వేస్తుంది. పైగా ఏదన్నా పనిలో పడితే ఆ కాస్త దాహాన్నీ మనం పట్టించుకోం. దీని వలన మెదడులో కనుక ఉండాల్సినంత నీటిశాతంలో ఏమాత్రం తక్కువైనా వెంటనే మెదడు హిస్టామిన్లు అనే రసాయనాన్ని విడుదల చేయడం ద్వారా మనకు తగిన హెచ్చరికలు పంపుతుంది. ఈ హిస్టామిన్ల వలన తలనొప్పి తథ్యం. కాబట్టి ఏ పనిలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా... చెంతనే ఒక నీళ్ల బాటిల్ ఉంచుకోవడం తప్పనిసరి! నీళ్లు పక్కనే ఉంటే దాహాన్ని విస్మరించం కదా! - చలికాలంలో ఆకలి కూడా పెద్దగా కలగదు. దాంతో సమయానికి ఆహారం తీసుకోవడంలో కూడా నిర్లక్ష్యంగా ఉంటాము. ఫలితంగా శరీరంలో చక్కెర స్థాయిలు పడిపోవడం వల్ల కూడా తలనొప్పి కలిగే ప్రమాదం ఉంటుంది. - సూర్యరశ్మిలో కాసేపు నిలబడటం వల్ల శరీరం కాస్త వెచ్చదనాన్ని పొందుతుంది. పైగా సూర్యరశ్మి నుంచి లభించే డి విటమిన్లో ఎలాంటి లోటు రాదు. ఒకోసారి విటమిన్ డి శరీరానికి తగినంత లభించకపోవడం వల్ల కూడా తలనొప్పులు వస్తాయని తేలింది. రోజూ తగిన వ్యాయామం చేయడం, ఐస్ క్రీమ్ వంటి అతి చల్లటి పదార్థాలకు దూరంగా ఉండటం, చీటికీ మాటికీ మందులు వాడకపోవడం వంటి ఇతరత్రా జాగ్రత్తలు పాటించడం వల్ల కూడా చలికాలపు చిరుగాలులను ఎలాంటి తలనొప్పులూ లేకుండా హాయిగా ఆస్వాదించవచ్చు.   - నిర్జర.

read more
Types of Olive Oil and its various uses

    Olive oil is oil that is pressed from olives, the fruits of the olive tree. The many variables that go into the production of olive oil yield dramatic differences in color, aroma, and flavor. And several names are used to differentiate all of these versions, here are a few of them:     Extra virgin olive oil is the highest quality of olive oil.Extra virgin olive oil is fairly nutritious. It contains modest amounts of Vitamins E and K and plenty of beneficial fatty acids. Extra virgin olive oil’s acidity level is less than 1 % and is rich in antioxidants. That’s what distinguish it from all the other oils and makes it the queen of oils. High heat cooking inhibits it of nutritional value, flavor and aroma. Extra virgin olive oil is best used in salads.     Virgin olive oil is slightly inferior to extra virgin olive oil. The main difference between the two oils is; virgin olive oil has an acidity level around 2.0%. Virgin olive is good for cooking purpose, mainly for sauté and baking and it can be used in salads as well.  Virgin olive oil is good for body and hair massage too.     Refined oil is treated to remove flaws from the oil, making it more usable. Refined olive oil is obtained by refining virgin olive oil. Refining virgin olive oil eliminates the acidity level. Refined olive oil is made for bulk consumption and is cheaper when compared to the rest of the olive oils. Refined olive oil is considered much inferior to the other varieties of olive oil and it does not have the characteristic flavor, taste or aroma of pure olive oil. Refined olive oil suitable for cooking purposes, but not for salads.       Pure olive oil is simple olive oil. It is a blend of refined olive oil and extra virgin olive oil. Pure olive oil has the acidity level around 2.0%, but it is very low in nutritional value in comparison to extra virgin olive oil. Pure olive oil is good for heavy duty cooking but it’s not suitable for salads, as it lacks in taste and aroma.   This is the main cooking grade oil variety. It is a light oil with neutral taste and flavour and is the most suitable oil for Indian cuisine as it does not change the flavour or taste of any preparation.This oil extracted from olive pomace carries none of the nutrition’s, taste and aroma of extra virgin olive oil. This olive pomace oil is then blended with virgin olive oil to impart some of the benefits of olive oil. Olive pomace oil is good for high heat cooking.     Extra Light Olive Oil is extra light in olive flavor, not in calories - all olive oil has the same calorie count and like Pure Olive Oil, it offers those healthy monounsaturated fats. Light olive oil is actually a very low grade of olive oil. It has the same amount of calories in it, but is low in nutrition’s, taste and aroma of olive oil.  Light or Lite olive oil is suitable for cooking or baking, where the fruity olive flavor would be objectionable. ..Divya  

read more
ఆరోగ్యకర నూనెలు ఎంత వాడాలి?

  నూనె లేకుండా కూరలు, వినడానికి బాగానే వుంటాయి... తినడానికే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అస్సలు నూనె లేకుండా ఎలా తినలేమో నూనె ఎక్కవయినా తినలేం. వంటలలో ఎంత నూనె వాడాలి అన్నదానికి ఇప్పటి వరకూ కచ్చితమైన కొలమానం ఏదీ లేదు. ఎవరి అలవాట్లను బట్టి వాళ్ళు కూరుల్లో నూనె వేస్తుంటారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా నూనె ఎంత తక్కువ వాడితే అంత మంచిది. ప్రధానంగా ఆహార తయారీలో వాడే నూనెలు మీ శరీరంలోని కొల్లెస్టరాల్ స్ధాయిలను నియంత్రించేవిగా ఉండాలి. అసలు పూర్తిగా కొవ్వు, నూనెలు లేని ఆహారాలు రుచి పచి లేకుండా అసంపూర్ణంగా ఉంటాయి. ఆరోగ్యకర నూనెలు, కొవ్వులు వాడేందుకు కొన్ని చిట్కాలు తెలుసుకోండి. https://www.youtube.com/watch?v=uKdp171Qksw    

read more
PAIN - `KILLERS`

  We seem to know too much about the medicines now a day! We diagnose our health problems without any professional help and we even take medicines on our own. We experiment a lot with the pain killers that are available over the counter. But we often forget or don’t care to be vigilant of a lot of factors that are associated with the pain killers. The following might be a few of them…   The types: Pain killers (analgesics) that are available over the counter might be classified into three kinds. * Paracetamol. * Non steroidal anti-inflammatory drugs (NSAIDs) such as Aspirin and Ibuprofen. * Opioids such as Codeine. These three kinds of drugs work in three different ways. Paracetamol works as a general analgesic. It might be helpful in minor aches like headache. But in cases of inflammation like in the case of a sprain, NSAIDs work better than Paracetamol. Unlike Paracetamol, NSAIDs even work on specific nerves in the body that is the cause of pain. Opioids work on the brain to decrease the sensation of the pain. These are administered in case of severe pain. Apart from these there are `COX-2 inhibitors` that were derived from NSAIDs.       Risks of Self-medication:     * The drugs available over the counter might be a sort of combination.  For example Combiflam is a combination of `Ibuprofen and paracetamol`. We often forget that some of the ingredients in the tablet should be administered under professional advice. * Some analgesics might react with other daily medicines that we are taking in. * Some drugs might prove disastrous if we are suffering with ailments such as `gastrointestinal disorders`. * Some drugs like `Aspirin` might prove allergic to certain individuals. * When things don’t seem good… any drug can prove disastrous. Even the most common drug like paracetamol might prove injurious.   Precautions:   *  Prolonged usage of a pain killer is not desirable. Even a headache if persists for days together… should be diagnosed by a physician. * Over dosage of any drug might be harmful. Even Paracetamol which is considered to be the safest drug,  gets injurious to liver when taken in huge quantities. * Recurring pain might be a symptom of a long term ailment. They might even hint at a severe condition in our body. An expert should always be consulted in such cases. * Professionals would help us in finding a pain killer that suits our condition and health. They knew the drug to be administered as per the case. For example ` diclofenac` might suit better for the joint pain. It’s better to reveal them, our medicinal history; drugs we are using; allergies etc. so that they can pin point the best and safest drug for us. * Taking a pain killer should never be out of habit. Coping with pain is a natural process of our nervous system. Common ailments such as headache, stomach pain might get relieved within an hour. * Consuming pain killers… particularly those in the class of `Opioids` might be associated with guaranteed side effects. So it’s always a better choice to be aware of what you are taking in. - nirjara

read more
వ్యాయామంతో ఎముకలు విరిగిపోతాయా!

వ్యాయామం వల్ల ఎముకలకి పెద్దగా లాభం ఏమీ ఉండదని ఇన్నాళ్లుగా ఓ అపోహ ఉంది. పైగా ఆస్టియోపొరోసిస్‌లాంటి వ్యాధులు ఉన్నవారు వ్యాయామాలు చేయడం వల్ల ఎముకల విరిగిపోయే ప్రమాదం ఉందన్న హెచ్చరికలూ వినిపిస్తుంటాయి. కానీ వ్యాయామంతో ఎముకలలో అసాధారణమైన మార్పులు చోటు చేసుకుంటున్నట్లు ఓ పరిశోధన నిరూపిస్తోంది. మన శరీరంలో bone marrow (మూలగ) పాత్ర అంతా ఇంతా కాదు. ఎముక ఎదగడానికీ, ఎర్ర రక్తకణాల ఉత్పత్తికీ, రోగనిరోధక శక్తికీ, హానికారక కణాలను నిర్మూలించడానికీ...  బోన్‌మేరోనే కీలకం. శరీరంలో మిగతా చోట్ల ఉన్నట్లుగానే ఈ బోన్‌మేరోలో కూడా కొవ్వు పేరుకుంటూ ఉంటుంది. అయితే ఈ కొవ్వు ఒక్కసారి పేరుకున్న తర్వాత కరగడం అసాధ్యమనీ, ఎవరెంత వ్యాయామం చేసినా దీని మీద పెద్దగా ప్రయోజనం ఉండదని... ఇన్నాళ్లూ భావించేవారు. బోన్‌మేరో మీద వ్యాయామం ప్రభావం తెలుసుకునేందుకు కాలిఫోర్నియాలోని శాస్త్రవేత్తలు ఓ పరిశోధన చేపట్టారు. దీని కోసం కొన్ని ఎలుకలకి, పుట్టిన నెల రోజుల దగ్గర్నుంచే విపరీతంగా కొవ్వు పదార్థాలని పెట్టడం మొదలుపెట్టారు. దీంతో కొన్నాళ్లకి వాటి బోన్‌మేరో కూడా కొవ్వుతో నిండిపోయింది. ఆ తర్వాత వీటి బోనులో ఓ రన్నింగ్‌ వీల్ ఉంచారు. ఈ రన్నింగ్‌ వీల్‌ మీద తిరగడం అంటే ఎలుకలకి మహా సరదా పడతాయట. సరదా సంగతి పక్కన పెడితే వాటికి మంచి వ్యాయామంగా కూడా ఉంటుంది. ఇలా ఆరు వారాలు గడిచిన తర్వాత TMRI అనే ఆధునిక పరికరం ద్వారా వీటి బోన్‌మేరోని గమనించిన పరిశోధకులు ఆశ్చర్యపోయారు. వ్యాయామంతో, ఎలుకల బోన్‌మేరోలోని కొవ్వు కణాల సంఖ్య సగానికి సగం తగ్గిపోయాయి. అంతేకాదు! వాటి ఎముకలు మరింత దృఢపడినట్లు తేలింది. బోన్‌మేరోలో పేరుకునే కొవ్వు, ఎముకల పనితీరు మీద ప్రభావం చూపుతుంది. ఇలాంటి ఎముకలు త్వరగా విరిగిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇక ఒంట్లో డయాబెటిస్, ఆర్థయిటిస్‌ వంటి సమస్యలు ఉంటే ఎముకలు మరింత సున్నితంగా మారిపోతాయి. ఎముకలు ఎప్పుడైతే సున్నితంగా ఉన్నాయన్న భయం మొదలైందో అసలు వ్యాయామం జోలికే పోకుండా ఉండిపోతుంటారు. కానీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే.... వ్యాయామం చేస్తూ ఉంటే, ఎముకలు కోలుకుని బలపడేందుకే ఎక్కువ అవకాశం ఉందని చెబుతున్నారు. కాకపోతే ఎలాంటి వ్యాయామాలు చేయాలో ఒక్కసారి వైద్యుని సంప్రదిస్తే సరి. అంతేకానీ ఊబయాకమో, కీళ్లవ్యాధో ఉంది కదా అని స్తబ్దుగా ఉండిపోతే... మరిన్ని సమస్యలు తప్పవు.   - నిర్జర.

read more
పెద్దవారిలో గాయలు ఎందుకు మానవు?

వయసు గడిచేకొద్దీ మనలో శక్తి కూడా తగ్గిపోతుందన్న విషయం కొత్తగా చెప్పక్కర్లేదు. అది అందరి అనుభంలోనూ గమనించే వాస్తవమే! కానీ ముసలివారికి ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు, అది అంత త్వరగా ఎందుకు మానదు? దీని వెనుక ఏదన్నా కారణం ఉందా? ఉంటే ఆ లోపాన్ని సవరించే అవకాశం ఉందా?... ఇలాంటి ఆలోచనలే వచ్చాయి రాక్‌ఫెల్లర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులకు. ఫలితం! మున్ముందు వృద్ధులకు చేసే చికిత్సలో సమూలమైన మార్పులు తేగల ఒక విషయాన్ని కనుగొన్నారు.   ఇప్పటివరకూ వృద్ధులలో గాయాలు త్వరగా మానకపోవడానికి కారణం వారిలో షుగర్‌ వంటి వ్యాధులో, రోగనిరోధకశక్తిలో మార్పులో అనుకునేవారు. ఇందులో వాస్తవాన్ని గ్రహించేందుకు పరిశోధకులు రెండు నెలల నుంచి రెండేళ్ల వయసున్న ఎలుకలలో గాయం మానే తీరు గమనించారు. ఈ వయసు మనలో 20 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయసుతో సమానం అన్నమాట. వీటికి ఏదన్నా గాయం అయినప్పుడు అక్కడి చర్మంలో జరుగుతున్న పరిణామాలను గమనించారు. సాధారణంగా గాయం అయిన మరుసటి సెకను నుంచే మన శరీరం దానిని బాగుచేసుకునేందుకు తగిన చర్యలను చేపడుతుంది.   చర్మానికి ఏదన్నా గాయం అయినప్పుడు ఆ చర్మం అడుగుభాగంలో ‘కెరటినోసైట్స్‌’ (keratinocytes) అనే కణాలు చేరుకుని కొత్త చర్మం ఏర్పడేందుకు సహకరిస్తాయట. ఈ కెరటినోసైట్స్ గాయం ఏర్పడిన భాగంలోకి చేరుకోగానే, స్కింట్స్ (Skints) అనే ప్రొటీన్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ స్కింట్స్ వెంటనే అక్కడి రోగనిరోధకశక్తికి సాయపడుతున్న కణాలకు కొత్త చర్మం ఏర్పడేలా సాయం చేయమంటూ సూచనలు అందిస్తాయి. అయితే ఎలుకల వయసుమళ్లే కొద్దీ ఈ స్కింట్స్‌ ఉత్పత్తి తగ్గిపోయిందట. దాంతో గాయం మాన్పడంలో కెరటినోసైట్స్‌ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది. ఫలితం! గాయం చాలా నిదానంగా మానడాన్ని గమనించారు.   పెద్దవారిలో గాయాలు నిదానంగా మానడం వెనుక ఉన్న కారణం తెలిసింది సరే! మరి ఈ ఫలితం ఆధారంగా గాయాన్ని మాన్పే ప్రక్రియను గాడిలో పెట్టే అవకాశం ఉందేమో అని మరిన్ని పరిశోధనలు చేశారు. అందుకోసం వయసు మళ్లిన ఎలుకలలో గాయాన్ని మాన్పమంటూ సూచనలు అందించే ప్రొటీన్‌ ఉత్పత్తిని పెంచినప్పుడు, వాటిలోని కెరటినోసైట్స్‌ వేగంగా స్పందించడాన్ని గమనించారు. ఈ సూత్రాన్ని ఆధారం చేసుకుని మున్ముందు మన కణాల మధ్య ఉన్న సమాచార వ్యవస్థని మరింత వేగవంతం చేసే మందులను ఉత్పత్తి చేయవచ్చునని అంటున్నారు. అదే కనుక జరిగితే కేవలం గాయాలను మాన్పడంలోనే కాదు, వృద్ధాప్యం కారణంగా వచ్చే మరెన్నో సమస్యలకు పరిష్కారం దొరకవచ్చు.   - నిర్జర.

read more