గణపతి విఘ్నాదిపతియే కాదు, ఆరోగ్య ప్రదాత కూడా. ఈ విషయం కొంచెం విపులంగా తెలుసుకుందాం.
సకల జీవరాశులకు ఆహారాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చేది సూర్యభగవానుడు. మనం పుట్టిన సమయాన్ని బట్టి ఒక్కోసారి గ్రహ దోషాలు చోటుచేసుకుంటాయి. అలాంటి గ్రహ దోషాలవల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఇలాంటి గ్రహదోషాలను నివారించుకోవాలంటే సన్ సితార గణపతిని పూజించుకోవాలి.
సన్ సితార గణపతి గ్రహ దోషాలను తొలగిస్తాడు. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఆయుష్షును పెంపొందిస్తాడు. సన్ సితార గణపతి ఇంట్లో ఉంటే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. శీఘ్ర అభివృద్ధి సాధిస్తారు.
సన్ సితార గణపతికి, సూర్యునికి అవినాభావ సంబంధం ఉంది. కనుక సన్ సితార గణపతిని సూర్యుడికి ఇష్టమైన రోజుగా భావించే ఆదివారంనాడు పూజించాలి. ఆదివారం పొద్దున్నే స్నానం చేసి సూర్య నమస్కారాలు చేయాలి.
సూర్యనమస్కారాలు పూర్తయ్యాక పూజా మందిరంలో పసుపు ముద్దతో గణపతిని చేసి తమలపాకు మీద ఉంచాలి. ఆనక చిన్న పీటను కడిగి, పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, దానిపై కొన్ని అక్షింతలు జల్లి, సన్ సితార గణపతిని ఉంచాలి. ఈ సన్ సితార గణపతిని ధ్యాన, ఆవాహనాదులతో భక్తిగా పూజించాలి. గణపతి అష్టోత్తర శతనామావళి పఠిస్తూ ప్రార్ధించాలి. లేదా 'గ'కార గణపతి అష్టోత్తర శత నామావళితో కూడా అర్చించవచ్చు. తర్వాత ధూప, దీప, నైవేద్యాలు సమర్పించాలి. సన్ సితార గణపతి పూజ నిర్విఘ్నంగా జరగడంలో పసుపుతో చేసిన గణపతి దోహదపడుతుంది.
సన్ సితార గణపతికి నీరాజనం సమర్పించిన తర్వాత -
"సూర్య గ్రహ దోష పరిహారార్ధం, ఆయురారోగ్య అభివ్రుద్ధ్యర్ధం, ఇష్ట కామ్యార్ధ ఫలసిద్ధ్యర్ధం, సూర్య గ్రహ దేవతా స్వరూప మహా గణపతి మంత్రజపం కరిష్యే''
-అంటూ ప్రార్థన చేయాలి.
ఆపైన
''ఓం రౌక్ష్మ్యా ఊం గ్లౌం గం చింత్యామణయే
రత్నగర్భాయ మహా గణేశాయ స్వాహా''
అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ జపమంత్రం పూర్తయిన తర్వాత పూజలో ఉంచిన అక్షింతలు కొన్ని తలపై జల్లుకుని గణపతికి ఉద్వాసన చెప్పాలి. తర్వాత సన్ సితార గణపతిని పూజామందిరంలో ఉంచాలి.
సన్ సితార గణపతి ఇంట్లో ఉందంటే, ఆయురారోగ్యాలు మన సొంతం అయినట్లే.
|