పతిని పూజించి అతనితో పాటు భద్రసనంలో కుర్చోన్నది.అప్పుడు పార్వతి నిర్మించిన గజముఖుడు తో౦డమునెట్టి ఘీంకరి౦పగా,శివుడు అతనిని ఎత్తుకొని నందితో ఇతడే నేనిదివరకు చెప్పిన నాపుత్రుడు అన్నాడు.
పార్వతిని సంభోదిస్తూ ‘నాయకుడగు నాయొక్క ప్రమేయము లేకనే జన్మించిన యితడు వినాయకుడుగ ప్రఖ్యాతుడగుగాక’అన్నాడు.దేవతలకు కలుగు సర్వ విఘ్నములను యితడు పరిహరించును గాన ఇతనిని దేవతలుకూడ పూజింతురు అన్నాడు.
కాలక్షేపానికై బొమ్మలతో ఆటలాడుకోంటున్న పార్వతి ఒకమారు సున్నిపిండితో ఏనుగు ముఖముగల పురుషాకృతి నొక దానిని చేసి కొంతసేపు దానితో ఆటలాడుకొని తరువాత గంగలోనికి విసిరివేసి౦ది. అచ్చట అది అద్భుతాకరంతో పెరగసాగింది . పార్వతి, గంగవానిని తమ కుమారునిగా భావించి అతనికి చెల్లించినట్లు పద్మపురాణంలో చెప్పబడింది .
అష్టాదశ పురాణాలలో కాని, ఉపపురాణాలలో కాని శివపారమ్యమును విస్తృతంగా వర్ణించు శివరహస్యంలో కూడ గజముఖుని జన్మవృత్తా౦తమున్నది. ఈ వృత్తాంత౦ మేరకు పార్వతి తన వివాహానికి ముందే గణపతిని సృష్టించింది.
శివుని ప్రసన్న మొనర్చుకొనుటకై అత్యుగ్ర తపస్సు నాచరించి గిరిజ అతని సమ్మతిని పొంది వివాహ సిద్ధత కోసం తండ్రి యింటికి వచ్చింది . అచ్చట పర్వత స్త్రీలు పార్వతికి అభ్య౦గన స్నానం చేయి౦చిరి.అప్పుడు పార్వతి తపశ్చర్యాకాలంలో ఆమె దేహనికంటుకొన్న మురికిని తీసి వుండగా చేసినారు .పార్వతి వారిని చూచి నవ్వుతూ ఆ ముద్దను గజముఖకారముగ మార్చింది.దానిని వివిధములైన ఆభరణములతో అలంకరించింది. జలధారతో ప్రోక్షించి ప్రాణప్రతిష్ట చేసింది. పర్వతస్త్రీలు చూస్తూ వుండగానే ప్రాణం పోసుకుని నిలబడిన గజముఖుని చూచి గిరిజ గజముఖా,నీవు నా పుత్రుడవై సకల విఘ్ననివారకుడవై సర్వపూ జ్యుడవగుము’
అని అన్నది పార్వతి .
|