|
Swaganamulaku Nayakudu Vinayakudu | ganesha | mantram | sthuthi | bhashyam | pragnya | gana | rendu | indra | angirasa | sreshtam | adhika | rupamu.
|
స్వగణములకు నాయకుడు-వినాయకుడు |
గణపతి యొక్క వికాసాన్ని ప్రధానంగా మనం మూడు దశలో గమనించివచ్చు .ఋగ్వేద కాలంలో వినవచ్చే 'గణపతి 'అన్న పేరు 'బ్రాహ్మణస్పతి 'అన్న పేరు ఒకటిగానే వుంది .రెండవది ఐతిహాసిక,స్మృతులు కాలంనాటి విఘ్నకారియైన'వినాయకుడు'క్రూరదేవత .మూడవది ,చివరిదీ అయిన గౌరీ పుత్రుడు,గజముఖుడు అయిన గణపతి.ఋగ్వేదంలో గణపతి పేరున్న మంత్రాలు ఒకటి రెండు వున్నవి . వాటిలో ఎక్కువ వ్యాప్తిలో వున్నట్టి గణపతి పూజాకాలంలో చెప్పబడే మంత్రం . |
|
''గణనాం త్వా గణపతిం హవామహే కవీం కవీనాముపవశ్ర వస్తమం |
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అన:శృణ్వన్నూతిభి :సీద సాదనం ''
ఈ మంత్రానికి సాయణుల వ్యాఖ్య :ఓ బ్రహ్మణస్పతీ,ప్రవ్రుద్దమగు కర్మలకు ప్రభువైనట్టి వాడవూ ,దేవగణములకు చెందినవాడవూ,స్వగణములకు నాయకుడవూ ,క్రాంతదర్సులైన కవులలో శ్రేష్టడవు ,అపరిమితమైన ఆహారము కలవాడవూ,ప్రముఖులమధ్య ప్రకాశించువాడవూ,మంత్రాధిదేవతవూ అయిన నిన్ను యీ కర్మ నిమితముగా ఆహ్వానిస్తున్నాను.మా నుతులను వింటూ నీ రక్షణలతో యజ్ఞగృహమునకు వచ్చి కూర్చుండుము.'
యాస్కుడు ఈ మంత్రంలోని బ్రహ్మణస్పతి అను పదానికి అన్నం మరియూ ధనములకు అధిపతీ అని నిర్వచించినాడు.ఋగ్వేదంలో గణపతి గణ పదములు గల మరొక మంత్రం :
''నిషుసీద గణపతే గణేషుత్వా మాహు ర్విప్రతమం కవినాం నఋతే
త్వత్ క్రియతే కించనారే మహామర్కం మఘవం జ్చిత్ర మర్చ''
మరద్గుణాలకు ప్రభువైన ఓ ఇంద్ర |నీ స్తుతికర్తల మధ్య శ్రేష్ఠమగు విధముగా అసీనుడవు కమ్ము .మేధావులైన ప్రాజ్ఞు లలోనీవు అధిక ప్రజ్ఞవంతుడవని విజ్ఞులు అంటున్నారు .నిన్ను వదలి సమిపములోగాని,దూరమునగాని ఎట్టి కర్మయూ నెరవేరదు .ధనవంతుడైన ఓ ఇంద్రా | మహాత్స్వరూపము గల పూజనీయమైన మస్తోమమును ,నానా రూపముల గౌరవించుము-అన్నది పైన పేర్కొన్న మంత్రం పై సాయణుల భాష్యానికి భావార్ధం .
ఈ రెండు మంత్రాలే కాక 'గణేన'అను పదం మాత్రమే గల మంత్రంమొకటి వున్నది .ఇచ్చట 'గణ' దాన్ని ఆంగీరసగణా|అనగా సంగీతజ్ఞలు అని నిర్వచించినారు .
ఇదివరకే పేర్కొన్న మంత్రంలోని 'గణేషు 'అను శబ్ధములోగల 'గణ 'పదానికి 'స్తుతికర్తలు 'అనీ అర్ధం . |
|
|