|
Gapathi | vinayaka | gowri | shivudu | brama | parvathi | prokshimchi | telugu | bhakthi | vishnuvu | lakshmi
|
వినాయక సృష్టి |
పార్వతికి జయా, విజయా అను వారు చెలికత్తెలు. వారితో మాట్లాడుతూ వుండగా వారు ‘శివుని వద్ద అసంఖ్యాక గణాలున్నా’ మనవడు అనదగిన వ్యక్తి ఒకడు కూడా లేడు. వారందరూ శివుని అజ్ఞాపాలకులలే మన మాటలు వినువారుకారు . కాన మానవాడు, మనకు విధేయుడు అగువానిని ఒకనిని నీవే సృష్టించు అని ప్రేరేపించినారు. కొన్నిదినములు తరువాత పార్వతి నందిని ద్వార పాలన చేయుటకు నియోగించి అభ్యంగనార్ధము లోపలికి వెళ్ళినది. ఆసమయమున
శివుడు వచ్చి నందిని గద్దించి లోపలికి ప్రవేశించేను.సాన్నము చేస్తున్న వేళలో వచ్చిన శివుని చూచి పార్వతి సిగ్గుతో తలవంచుకు౦ది.ఇది వరకు తన చెలికత్తెలు పల్కిన మాటలు పార్వతికి జ్ఞప్తికి వచ్చినవి. |
|
తన వాడగు సేవకుడొకడు౦టే శివుడు అక్రమ౦గా లోపలికి రాను వీలుండేది కాడు అని కొద్ది కాలం తరువాత తన మాటను తు.చ. తప్పకుండునట్టి శుభకరుడగు సేవకుడు కావాలనే కోరికతో తనదేహంపై నున్న మురికితో సర్వలక్షణ సంపన్నుడగు వానిని సృష్టించినది. సర్వాంగా సుందరుడు, అమితబలశాలీ, మహా తెజస్సంపన్నుడు అయిన అతనిని నానావస్త్రభూషణాదులతో అలంకరించినది.
‘నీవు నా కుమారుడవు, నాకు వేరే సంతానము లేదు’ – ఓయీ సత్ప్రుత్రుడా, యీ గృహమున నా వారైనవారెవ్వరు లేరు. నా అనుజ్ఞ లేకుండా ఎవరినీ ఏ పరిస్థితులలోనూ లోనికి రానీయకు’ అంటూ అతనికి చేతికొక దుడ్డు కర్రను యిచ్చింది. సుందరమగు అతని ఆకారమునకు ముగ్ధురాలై వాత్సల్యంతో ముద్దు పెట్టికొని ఆశీర్వదించి౦ది. అతనిని స్నానాగార ద్వారంలో కాపలా వుండునట్లు ఆదేశించి అభ్య౦జనానికి వెళ్లిపోయింది.
అంతలోనే శివుడు వచ్చినాడు. ద్వారం వద్ద నిలుచున్న కొత్త కపలాదారుని చూచి ఆశ్చర్య చకితుడైనాడు. ద్వారపాలకుడు అతనిని లోపలికి వెళ్ళ నివ్వలేదు.కోపావిష్టుడైన శివుడు తన గణముల రావించి క్రొత్త కపలావానిని గెంటి వేయమని అజ్ఞాపించాడు. తత్పర్యవసానంగా దేవాధిదేవతల౦దరూ వచ్చి ఆ ద్వారపాలకునితో యుద్దం చేయవలసి వచ్చింది. కుమారస్వామితో సహా శివగణాలన్నీ ఎదుర్కొన్నాయి. పార్వతి తన కుమారునికి సహాయపడటానికి
యిరువురు శక్తిదేవతలను సృష్టించింది. మహావిష్ణువు మొదలుకొని దేవతలందరూ ఏకంకాగా పార్వతీ తనయుడోక్కడే ఒక వైపున వుండి పోరు సాగించాడు. తుదకు శివుడే తన త్రిశూలంతో ఆ వీరిని శిరస్సు త్రుంచి వేసినాడు.
పుత్రుని చావుతో రెచ్చిపోయిన పార్వతి వేలకొలది శక్తులను సృస్టించి దేవతలందరినీ కబళించి వేయవలసినదని అజ్ఞాపించింది. తల్లడిల్లి పోయిన దేవతల బృందం తమను రక్షింపవలసిందిగా దేవిని అర్ధించారు. తన పుత్రుని
బ్రతికించి యిచ్చినచో శక్తులను వెనుదీసుకోదుడునన్నది. దేవతలు వెంటనే శివుని ఆనతి మేరకు ఉత్తర దిక్కుకు ప్రయాణమై మొట్టమొదట లభించిన ఎనుగు
యొక్క తలను ఖండించి తీసుకొని వచ్చారు. ఆ తలకు ఒకే దంతమున్నది. ఆ తలను పార్వతీ పుత్రుని మొండెమునకు అతికించినారు.శివుడు తన అభిమంత్రిత
జలాన్ని ప్రోక్షించి, గౌరీ పుత్రుని బ్రతికించారు |
|
|