వర్మ హాట్ కామెంట్స్ పై స్పందించిన లేడీ ఎమ్మెల్యే..!
on May 30, 2016
వర్మ గారి ట్విట్టర్ కు అడ్డూ ఆపూ ఎప్పుడూ ఉండదు. ఆయన నోటికి ఏదనిపిస్తే దానిని వెంటనే ట్వీట్ చేసేస్తుంటాడు. కొన్ని రోజుల క్రితం ఇలాగే ఒక లేడీ ఎమ్మెల్యే పై కామెంట్స్ చేశాడు. అసోంలో బిజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన నటి అంగూర్ లతాను ఉద్దేశిస్తూ, తనకు పాలిటిక్స్ అంటే ఇష్టం కలుగుతోందంటూ ట్వీట్ చేశాడు. అందమైన ఎమ్మెల్యేలు రాజకీయాల్లోకి వస్తే మనకు అచ్చే దిన్ వచ్చినట్టే. ఆవిడను చూస్తుంటే నాకు తొలిసారి పాలిటిక్స్ పై ప్రేమ పుడుతుంది. దీనికి ప్రధాని మోడీ, అంగూర్ లతాలకు థ్యాంక్స్ అంటూ ట్వీటాడు. ఇదే విషయాన్ని లతా వద్ద ప్రస్తావించారు విలేకర్లు. దానికి ఆమె వర్మ ఏం చెప్పారో అది ఆయన ఇష్టమని, తాను అలాంటివి పట్టించుకోనని, అసోం ప్రజలకు తానేంటో తెలుసు అని స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఏదైనా చెప్పే హక్కు ఉందని ఆమె చెప్పడం విశేషం. ఎంత ప్రజాస్వామ్యం అయినా, ఇలాంటి కామెంట్స్ ఏంటి వర్మ గారూ..!