కూతురు కాపురంలో చిచ్చుపెడుతున్న వర్మ
on May 8, 2015
సినిమాకు మంచి కథ దొరకాలంటే సఖంగా సంసారం చేసుకుంటున్న వాళ్లని విడిపొమ్మని కోరుకుంటారా? కూతురు-అల్లుడు మధ్య విభేదాలు రావాలని అనుకుంటారా?....కానీ పైత్యానికి పరాకాష్ట అయిన రామ్ గోపాల్ వర్మ ఇలాగే ఆలోచిస్తున్నాడు. కుదిరితే సినిమాలు లేదంటే వివాదాలతో నిత్యం మీడియాలో హల్ చల్ చేసే వర్మ ఈ మధ్య భిన్న విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసి సంచలనం సృష్టిస్తున్నాడు. నాకు మంచి భార్య దొరికింది-కానీ ఆమెకు మంచి భర్త దొరకలేదని కామెంట్ చేసి షాకిచ్చాడు. బయటివారితో పాటూ సొంత వ్యక్తులనూ వదలడం లేదే అని అంతా అవాక్కయ్యారు. ఈసారి తన కూతుర్నే టార్గెట్ చేసుకున్నాడు. ఆమె వైవాహిక జీవితం బాగుందన్నాడు. పోనీలో ఇన్నాళ్లకు చక్కగా స్పందించాడు అనుకునే లోగా.....పంచవర్ష ప్రణాళికల్లా జీవితాన్ని ప్లాన్ చేసుకుని హాయిగా ఉన్నారని...అలాఉంటే నచ్చలేదన్నాడు. వాళ్లిద్దరి మధ్యా తగాదాలు వస్తే తనకో మంచి కథ దొరుకుతుందన్నాడు. వర్మ వ్యాఖ్యలు విన్న జనం షాక్ తిన్నారు. కథ కావాలంటే రాసుకోవచ్చుగా...హాయిగా ఉన్న కూతురు కాపురం కూల్చడం ఎందుకో అని కామెంట్ చేస్తున్నారు. మరి తండ్రి కామెంట్స్ ని కూతురు ఎలా రిసీవ్ చేసుకుంటుందో ఏమో?