పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..బ్యాడ్ న్యూస్
on Jul 31, 2015
పవన్ సినీ అభిమానులకు గుడ్ న్యూస్..రాజకీయ అభిమానులకైతే ఇది బ్యాడ్ న్యూసే. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రెండు పడవలపై ప్రయాణిస్తున్నాడు కాబట్టి. ప్రస్తుతం సర్దార్ సినిమా షూటింగ్ తో బిజీగా వున్న పవన్ కళ్యాణ్ ఓ షాకింగ్ డేసిజన్ తీసున్నాడట. అది ఏమిటంటే పవన్ కళ్యాణ్ కొన్ని నెలలు రాజకీయాలకు దూరంగా వుండాలని నిర్నయించుకున్నాడట. ఇది కూడా తన అభిమానుల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకే.
గత కొంతకాలంగా సినిమాలు చేయకుండా ఖాళీగా వున్న పవన్, తన ఫ్యాన్స్ ఒత్తిడి మేరకు సర్దార్ సినిమాను త్వరగా కంప్లీట్ చేసి వారికి అందించాలని నిర్నయించుకున్నాడట. దీని కోసం చిత్ర యూనిట్ కూడా డెడ్ లైన్ పాస్ చేశాడట. ఈ సినిమాను ఎట్టి పరిస్థితులో డీలే అవకుండా ఫినిష్ చేయాలని చెప్పాడట. ఇది సినిమా అభిమానులకు శుభవార్తే. కానీ రాజకీయాలలో ఇప్పటికే యాక్టివ్ గా లేకుండా విమర్శలు ఎదురుకుంటున్న పవన్ , ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం రాజకీయ అభిమానులకు బ్యాడ్ న్యూస్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
