శ్రీమంతుడిని ఇలా వాడుతున్నారు
on Jul 31, 2015
ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలి.. ఈ విషయం వ్యాపారస్తులకు, కంపెనీలకు తెలిసినట్లుగా ఎవరికీ తెలీదు. ప్రచారం కోసం నటులను ఉపయోగించుకోవడం, ఒప్పందాలు చేసుకోవడం సాధారణంగా జరిగేదే. లేటెస్ట్ జనరేషన్‌లో మార్కెటింగ్ కోసం నయా టెక్నిక్స్ పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు ఓ క్యాబ్ ఆపరేటర్ కంపెనీ కొత్త స్కెచ్ వేసింది ప్రచారం కోసం.
ఇప్పుడు తెలుగు జనాలు ఎక్కువ మాట్లాడుకుంటున్నది శ్రీమంతుడి గురించే. అందుకే మహేష్ బాబు క్రేజ్ వాడుకుని అటు సినిమాకి, ఇటు తమ కంపెనీకి పబ్లిసిటీ చేస్తోంది యుబెర్ క్యాబ్స్. ఈ రోజు ఓ రెండు గంటల పాటు యుబెర్ యాప్‌లో శ్రీమంతుడు ఆప్షన్ పై రిజిస్టర్ చేసుకోవాలని చెప్పింది. ఇలా రిజిస్టర్ చేసుకున్నవాళ్లకి శ్రీమంతుడి టీంతో స్పెషల్ చిట్ చాట్ ఏర్పాటు చేస్తారట. అది కూడా సీక్రెట్ ప్లేస్ లో. ఈ కార్యక్రమంలో మహేష్ తో పాటు.. శృతి కూడా పాల్గొననుంది. దీని కోసం రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదని చెప్పడం హైలైట్.
అయితే.. మహేష్ తో కలిసే ఛాన్స్ అంటే.. లక్షల కొద్దీ రిజిస్ట్రేషన్స్ రావడం ఖాయం. కానీ ఇందులో 15మందికే లక్కీ ఛాన్స్ దక్కేది. మొత్తం మీద మహేష్ బాబును అడ్డం పెట్టుకుని, ఒకేసారి రెండు రకాల ప్రమోషన్స్.. ఐడియా అదుర్స్ కదూ.