కీరవాణి చేసిన మాయ.. నిప్పులే శ్వాసగా..!
on Jun 27, 2015
బాహుబలిలో పాటలెలాఉన్నాయ్..?? ఈ విషయం ఎవరినడిగినా 'ఫర్లేదు... ఓకే' అనేస్తారు. 'బాహుబలి'కొచ్చిన హైప్, ఆ స్టాండర్డ్స్ 'బాహుబలి' పాటల్లో కనిపించడం లేదని కొంతమంది నిరాశ పడ్డారు కూడా. అయితే గియితే ఈ సినిమాకి ఆడియోనే మైనస్ అవుతుందని అని కూడా చెప్పుకొన్నారు. అయితే కీరవాణి , రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఆడియోలన్నీ థియేటర్లో సూపర్ హిట్టన్న సంగతి జనం మర్చిపోలేదు. పాటలు వినడానికి ఓ మాదిరిగా ఉన్నా.. సినిమాతో పాటు చూస్తే అదిరిపోవడం ఖాయమని వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన గత చిత్రాలు నిరూపించాయి.
అంతెందుకు.. 'ధీర ధీర ధీర మనసాగలేదురా' పాట ఆడియోలో అంత క్లిక్ అవ్వలేదు. అయితే దాన్ని వెండి తెరపై చూసి అబ్బుపడ్డారంతా. ఇప్పుడు అదే అదే మ్యాజిక్ 'బాహుబలి' తెరపైనా కనిపించనున్నదనడానికి ఇటీవల విడుదలైన 'నిప్పులే శ్వాసగా', 'మమతల కోవెల' వీడియో గీతాలే సాక్ష్యాలు. కథలోని భావోద్వేగాల్ని చక్కగా ఒడిసిపట్టుకొన్న కీరవాణి... తన అద్భుతమైన స్వర కల్పనతో రాగయుక్తంగా ఆవిష్కరించగలిగారు. అందుకే నిప్పులే శ్వాసగా, మమతల కోవెల పాటలు జనాల్లోకి ఇప్పుడు చొచ్చుకు వెళ్లిపోతున్నాయి.
వీడియో రూపంలో పాటల్ని విడుదల చేయాలన్న ఆలోచన.... 'బాహుబలి'కి మరింత కలిసొచ్చే అవకాశం ఉంది. రాజమౌళి విజువల్స్‌తో పాటు కీరవాణి పాటలూ.. ఆ పాటల్లోని ఆర్థ్రత మ్యాచ్ అవ్వడంతో ఎమోషన్ పీక్స్‌లోకి వెళ్లి.. ఆయా సీన్స్ పండే ఛాన్సుంది. ప్రస్తుతం యూ ట్యూబ్‌లో ఈ పాటలు రెండూ హిట్స్‌మీద హిట్స్ కొట్టుకొంటూ వెళ్తున్నాయి. ఈపాటలు బాహుబలి సూపర్ హిట్ అవ్వడానికి బాటలు వేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read