ఆ ప్రశ్న విని.. రెచ్చిపోయిన రాజమౌళి
on Jul 6, 2015
రాజమౌళిని ఎప్పుడు చూసినా ప్రశాంతంగా కనిపిస్తాడు. మీడియా ముందు... ఆయనెప్పుడూ కంట్రోల్ తప్పలేదు. ఏ ప్రశ్న అడిగినా ఓర్పుతో సమాధానం చెబుతాడు. అయితే ఓ ఇంటర్వ్యూలో ఓ ప్రశ్నవిని రాజమౌళి రెచ్చిపోయాడట. `నాన్సెన్స్...ఇలాంటి ప్రశ్నలు నా దగ్గర అడుగుతారా?` అంటూ మైకు విసిరికొట్టి.. అక్కడి నుంచి వెళ్లిపోయాడట.
`బాహుబలి` ప్రమోషన్లు మహా జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. టీవీ ఛానళ్లకు రికార్డెడ్ ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు రాజమౌళి. ఓ టీవీ ఛానల్ రాజమౌళిని ఇంటర్వ్యూ చేస్తూ చేస్తూ... ఓ అభ్యంతరకరమైన ప్రశ్న అడిగినట్టు సమాచారం. ఆ ప్రశ్న కూడా ప్రభాస్‌ని ఉద్దేశించే. ఆమధ్య ప్రభాస్ వ్యవహారంలో ఓ రాజకీయ నాయకురాలితో ముడిపెట్టి వేడి వేడి కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన ప్రశ్న రాజమౌళిని అడిగారట. దాంతో రాజమౌళికి కోపం వచ్చేసిందట.
`ఇలాంటి ప్రశ్నలు నన్ను అడగుతారా` అంటూ అలిగి.. ఆ ఇంటర్వ్యూని అక్కడితో ముగించి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఇలాంటి సున్నితమైన విషయాల్లో స్పందించడం ఎవరికైనా.. ఇబ్బందే మరి! మొత్తానికి రాజమౌళి కోపం ఎలా ఉంటుందో సరదు మీడియా వారికి ప్రత్యక్షంగా తెలిసొచ్చినట్టైంది.