అనుష్కకు అండగా... మహేష్ బాబు
on Jun 30, 2015
బాహుబలికి పోటీగా కాదుగానీ, ధీదటుగా మొదలైన చిత్రం `రుద్రమదేవి`. ఈ సినిమాపైనే గుణశేఖర్ తన ప్రాణాలన్నీ పెట్టుకొన్నాడు. అయితే బాహుబలికి వచ్చిన హైప్‌లో, మీడియా ఇచ్చిన ప్రచారంలో రుద్రమదేవికి 10 శాతం కూడా దక్కలేదు. అది చాలదన్నట్టు... విడుదలకు ఎన్నో అడ్డంకులు. వీటి నుంచి ఎలా బయటపడాలో గుణశేఖర్‌కు అర్థం కావడం లేదు. గుణశేఖర్ ఇబ్బందులన్ని తెలుసుకొన్న చిరు... ఈ సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చి... కాస్త క్రేజ్ తెచ్చే ప్రయత్నం చేశాడు.
ఇప్పుడు మహేష్ బాబు కూడా ముందుకొచ్చాడు. `మీ సినిమాకి అండగా ఉంటా... నా మద్దతు ఇస్తా. కావాలంటే ప్రమోషన్లకు కూడా వస్తా.` అని గుణశేఖర్‌కు మాటిచ్చాడట మహేష్. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు మహేష్ కెరీర్‌కి బూస్టప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తరవాత అర్జున్, సైనికుడు చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చాయి. అల్లు అర్జున్ పోషించిన గోనగన్నారెడ్డి పాత్ర మహేష్‌తో చేయించాలని గుణశేఖర్ కూడా భావించాడు. కానీ.. కొన్ని కారణాల వల్ల అది వర్కువుట్ కాలేదు.
కనీసం ఈ సినిమాకి ఈ రూపంలో అయినా హెల్ప్ చేయాలని మహేష్ భావించాడు. దాంతో గుణకు కొండంత ధైర్యం వచ్చింది. ఇక మీదట రుద్రమదేవి ప్రచారంలో మహేష్ కనిపించే అవకాశం ఉంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
