బన్నీ కత్తిపట్టి... నరుకుడే నరుకుడు
on Apr 28, 2015
సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో స్టైల్ గా, హోమ్లీ మ్యాన్‌గా కనిపించాడు అల్లు అర్జున్. అయితే ఇప్పుడు కత్తిపట్టి రక్తపాతం సృష్టించడానికి రెడీ అంటున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించడానికి బన్నీ పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. బోయపాటి సినిమా అంటేనే..యాక్షన్ ఓ రేంజులో ఉంటుంది. ఈ సినిమాలోనూ ఆయన యాక్షన్ బాగా దట్టించారట. అందుకోసం బన్నీ కండలు పెంచే పనిలో ఉన్నాడట. ఈసినిమాలో బన్నీ చేత కత్తిపట్టిస్తున్నాడట బోయపాటి. ఇక నరుకుడే..నరుకుడన్నమాట. దేశముదురు సినిమాలో బన్నీ సిక్స్ ప్యాక్ చేశాడు. టాలీవుడ్‌లో ఆ సంప్రదాయానికి తెరలేపింది బన్నీనే. ఇప్పుడు ఈ సినిమా కోసం మరింత గా కండలు పెంచుతున్నాడని టాక్. ''8 ప్యాక్ కాదుగానీ... అలా కనిపించేలా బన్నీ కండలు పెంచుతున్నాడు. ఈ కథకు అది చాలా అవసరం'' అని దర్శకుడు బోయపాటి శ్రీను సెలవిచ్చారు. అంటే... ఈ సినిమాలో మరోసారి చొక్కా విప్పుతాడన్నమాట. బన్నీ ఫ్యాన్స్.. కాచుకోండిక.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
