'బాహుబలి'పై నెగిటివ్ టాక్ మొదలైంది
on Jun 29, 2015
ఇప్పటి వరకూ Bahubali పై బీభత్సమైన పాజిటీవ్ టాక్ నడిచింది. ఈ సినిమా ఓ క్లాసిక్ అని, ఇండియన్ అవతార్ అని చెప్పుకొన్నారు. ఇటీవల బాహుబలి సెన్సార్ జరిగినప్పటి నుంచీ... మెల్లగా నెగిటీవ్ టాక్ కూడా ఊపందుకొంటోంది. ఈసినిమా అంచనాలకు తగ్గట్టుగా లేదని, భారీ ఆశలతో థియేటర్లకు వెళితే నిరుత్సాహపడడం ఖాయమనే టాక్ బయటకు వచ్చింది.
ఇంట్రవెల్ బ్యాంగ్, వార్ ఎపిసోడ్ మినహా `బాహుబలి`లో ఏమీ లేదని కేవలం ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్‌తోనే నడుస్తుందని, సెంటిమెంట్ గోల ఎక్కువైందని.. ఇలా రకరకాల వార్తలొస్తున్నాయి. ఈ వార్తలు చిత్రబృందంలో కలవరం రేపుతున్నాయి. సడన్ గా వచ్చిన ఈనెగిటీవ్ టాక్ ని ఎలా తిప్పుకొట్టాలో రాజమౌళికి సైతం అర్థం కావడం లేదు. అయితే ఒకరకంగా ఈ నెటిటీవ్ ప్రచారం కూడా మంచిదే అని రాజమౌళి భావిస్తున్నాడట.
ఇప్పటికే ఈసినిమాపై అంచనాలు పెరిగిపోయాయని, నెగిటీవ్ టాక్ వల్ల అవి కాస్త తగ్గి సినిమాని సినిమాలా చూస్తారని రాజమౌళి ఓ అంచనాకు వస్తున్నాడట. మరి ఈ నెగిటీవ్ టాక్ సినిమాపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో..?