డీజే ఆడియో లాంఛ్ హైలెట్స్
on Jun 11, 2017
* తొలి సాంగ్‌ను జొన్నవిత్తుల చేతుల మీదుగా రిలీజ్ చేయించారు.
* స్టార్ యాంకర్ సుమకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె చేతుల మీదుగా "మెచ్చుకో" అంటూ సాగే రెండో పాటను రిలీజ్ చేయించారు.
* సిటీ అనే పాటను అభిమానుల చేత లాంఛ్ చేయించారు అల్లు అర్జున్.
* పర్ఫెక్షన్ కోసం మాంసాహారాన్ని పక్కనబెట్టిన అల్లు అర్జున్‌ని ప్రశంసలతో ముంచెత్తారు రచయిత సాహితీ
* ఆదిత్యా మ్యూజిక్‌తో తన ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు నిర్మాత దిల్‌రాజు.
* తన తండ్రిని ప్రతి క్షణం గుర్తు చేసే రొయ్యల నాయుడు పాత్రను తనకు ఇచ్చిన హరీష్ శంకర్ కి కృతజ్ఞతలు తెలిపారు రావు రమేశ్.
* డీజే పాటల వల్ల ఎవరైనా హర్ట్ అయితే తనను తిట్టాలని..పొగిడితే తన రచయితలను పొగడాలన్నారు డైరెక్టర్ హరీశ్ శంకర్
* దిల్ సినిమా నుంచి ప్రారంభమైన తన ప్రయాణం 25 సినిమాలకు చేరుకుందని ఈ ప్రయాణంలో తనతో పాటు నడిచిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు దిల్‌రాజు.
* దివంగత దర్శకుడు దాసరి నారాయణరావుగారికి నివాళులర్పించారు అల్లు అర్జున్.
* దిల్‌రాజు భార్య అనిత గురించి మాట్లాడుతూ బన్నీ కంటతడి పెట్టారు.
* అల్లు అర్జున్ తెలుగు మైకేల్ జాక్సన్ అని చెప్పింది హీరోయిన్ పూజా హెగ్డే
* అల్లు అర్జున్ తనయుడు అయాన్, దిల్‌రాజు మనవడు అయాంశ్ డీజే ఆడియోని ఆవిష్కరించారు.
* అల్లు అయాన్ అభిమానులకు నమస్కరించడం షోకి హైలెట్.
Also Read