శ్రీమంతుడి సినిమాలో బిచ్చగాడి తల్లి!
on Jul 25, 2016
మహేష్ బాబు "బ్రహ్మోత్సవం" సినిమా ఆడుతున్న థియేటర్లు జనాల్లేక ఈగలు తోలుకొంటుంటే.. "బిచ్చగాడు" అనే తమిళ అనువాద చిత్రం మాత్రం హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో కోట్లు కొల్లగొట్టింది. దాంతో ప్రతి ఒక్కరూ "బ్రహ్మోత్సవం" కంటే "బిచ్చగాడే" బెటర్ అంటూ కాస్త వేటాకరంగా మహేష్ బాబుపై విరుచుకుపడ్డారు. "బిచ్చగాడు" సినిమా మొత్తం మదర్ సెంటిమెంట్ తో నిండిపోవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా కనెక్ట్ అయిపోయారు. ఆ సినిమాలో "బిచ్చగాడు" తల్లిగా నటించిన దీపా రామానుజంకు కూడా తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది.
ఆ పాపులారిటీని క్యాష్ చేసుకొనేందుకు దర్శకుడు మురుగదాస్ ముందుకొచ్చాడు. అందుకే మహేష్ బాబు హీరోగా తాను తెరకెక్కిస్తున్న సినిమాలో మహేష్ మదర్ గా దీపాను ఎన్నుకొన్నాడు. ఈ వారంలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ కథానాయికగా నటిస్తుండగా.. ఎస్.జె.సూర్య ప్రతినాయకుడీగా నటిస్తున్నాడు!