సల్లూభాయ్‌కి రిలీఫ్..
on Jul 25, 2016

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌కు రాజస్థాన్ హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. కృష్ణజింకలను వేటాడిన కేసులో ఆయన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ రాజస్థాన్ హైకోర్టు తీర్పునిచ్చింది. "హమ్ సాథ్ సాథ్ హై" సినిమా షూటింగ్ కోసం 1998 అక్టోబర్ 1,2 తేదీల మధ్య అర్ధరాత్రి సమయంలో సల్మాన్‌ఖాన్, సైఫ్ అలీఖాన్, టబూ, సోనాలీ బింద్రే రాజస్థాన్ వెళ్లారు. ఆ సమయంలో షూటింగ్ స్పాట్‌కి సమీపంలో ఓ జింక తుపాకీ తూటాలకు బలైంది. దీనికి కారణం సల్మాన్ అండ్ కో అనే ఆరోపణలు వచ్చాయి. నిందితులపై ఐపీసీ సెక్షన్ 149తో పాటు..సెక్షన్ 51 వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో అక్రమంగా ఆయుధాలను కూడా సల్మాన్ ఖాన్ కలిగి ఉన్నారన్న అభియోగంతో కేసు నమోదయింది.
దీనిపై 18 సంవత్సరాల పాటు సుధీర్ఘ విచారణ జరిపిన జోధ్‌పూర్ కోర్టు..రెండు కేసుల్లోనూ ఏడాది, ఐదేళ్లపాటు జైలు శిక్ష విధించింది. అయితే స్థానిక కోర్టు తీర్పును సవాల్ చేస్తూ...రాజస్థాన్ హైకోర్టులో సల్మాన్ పిటిషన్ దాఖలు చేశారు. మే చివరి వారంలో దీనిపై వాదనలు విన్న హైకోర్టు తీర్పును వాయిదా వేసి ఇవాళ వెలువరించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



