సొనారిక మంత్రం జపిస్తున్న బన్నీ
on Apr 14, 2015
అల్లు అర్జున్ టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఫామ్ లో ఉన్నవారిపై కన్నా కొత్త కొత్త ముద్దుగుమ్మలపై మోజు పడుతుంటాడు బన్నీ. గంగోంత్రిలో అదితి అగర్వాల్, ఆర్యలో అనుమెహతా, బన్నీలో గౌరీ ముంజల్, వరుడు లో భానుశ్రీ మెహ్రా తో రొమాన్స్ చేశాడు. మిగిలిన సినిమాల్లో జస్ట్ ఎంట్రీ ఇచ్చి అప్పటికి పెద్దగా పాపులారిటీ లేని అమ్మాయిల్ని ఎంచుకున్నాడు. అమలాపాల్,. కేథరిన్, షీలా, ఆదాశర్మ ఈ కోవకే చెందుతారు. అయితే తన నెక్ట్స్ మూవీకోసం సీరియల్ బ్యూటీపై కన్నేశాడట అల్లువారి హీరో. హరహరమహాదేవ సీరియల్‌తో పాపులర్ అయిన సొనారికని అల్లు అర్జున్ తన తర్వాతి సినిమాకు రికమెండ్ చేసినట్లు టాక్ . సొనారిక ఇప్పటికే నాగశౌర్య 'జాదుగాడు'తో వెండితెరపై అడుగుపెట్టింది. అయితే రెండో సినిమా ఆఫర్ బన్నీతో రావడం లక్కు అనుకుంటే......కెరీర్ ఇక మసే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే బన్నీతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ కానీ, రెండో సినిమా బన్నీ సరసన ఛాన్స్ దక్కించుకున్న హీరోయిన్ కానీ ఇండస్ట్రీలో కొనసాగిన దాఖలాలులేవు. దీంతో బన్నీ సరసన ఛాన్స్ వచ్చినందుకు ఎగిరి గంతేయాలో-ఏడవాలో అర్థంకాని పరిస్థితిలో ఉందట సొనారిక. ఇంతకీ ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.