బాహుబలి ఫ్లాప్ అట.. నిప్పులుగక్కిన జర్నలిస్ట్
on Jul 9, 2015
యు ఏ ఈ సెన్సార్ బోర్డు సభ్యురాలిగా ఉంటూ, ఎన్నో సినిమాలకు రివ్యూలు రాసి, నికార్సయిన ఫలితాల్ని ముందే బయటపెట్టిన కైర సంధు అనే ఓ మహిళా జర్నలిస్టు బాహుబలికి అప్పుడే రివ్యూ, రేటింగ్ రెండూ ఇచ్చేసింది. ఐదు స్టార్లకు రెండే స్టార్లు ఇచ్చిన కైరా... ఈ సినిమాని చీల్చిచండాడింది. రానా, ప్రభాస్‌లకు చరణ్, మహేష్, పవన్‌లకు ఉన్నంత స్టామినా లేదని, బాహుబలి ఇండియన్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ అంటూ బిల్డప్పులిచ్చారని, ఆడియన్స్‌కి ఫూల్స్ చేశారని, ఈ సినిమాలో కంటెంట్ లేదని, ఇది బంగారం కాదని, కేవలం రోల్డ్ గోల్డని.. తన ట్విట్టర్ ఖాతాలో చెడామడా చివాట్లు వేశారు. యు ఏ ఈలో ఈ సినిమా కొన్న బయ్యర్లు తలలు పట్టుకొన్నారని, ఈ సినిమా చూసి టైమ్, టికెట్స్ రెండూ వేస్ట్ చేసుకోవద్దని ట్విట్టారు. కాని ... ఈ విశ్లేషణలు అబద్దం కావాలని, బాహుబలి నిజంగానే ఇండియన్ రికార్డులన్నీ బద్దలుకొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకొందాం. ఎందుకంటే.. మన తెలుగు సినిమా. మనమంతా గర్వించే గొప్ప సినిమా. నిజమైన తీర్పు కోసం రేపటి వరకూ ఎదురుచూద్దాం. జై.. బాహుబలి.