పూరీ తిట్టాడా....అయితే ఓకే!
on Jul 9, 2015
పూరీజగన్నాథ్ తిట్టాడా అయితే హిట్టుకొట్టినట్టే అని ఫిల్మ్ నగర్ టాక్. ఎందుకంటే బయట తిడితే కోప్పడే జనాలు సినిమాల్లో తిడితే మాత్రం భలే ఎంజాయ్ చేస్తుంటారు. ముఖ్యంగా పూరీ సినిమా టైటిల్ లో తిట్టు ఉందంటే అది బ్లాక్ బస్టరే అని టాక్. గతంలో ఇడియట్, దేశముదురు, పోకిరి, టెంపర్ ఇవన్నీ విజయం సాధించినవే.
లేటెస్ట్ గా నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ తో తెరకెక్కించనున్న మూవీకి లోఫర్ అని టైటిల్ ఫిక్స్ చేశాడు. దీంతో ఇది కూడా తిట్టేగా....అయితే హిట్టే అని జనాలు ఫిక్సయ్యారు. మరోవైపు పూరీ సినిమాలో హీరో అంటే చెలరేగిపోతుంటాడు.
అసే ఒసే రాయె పోయె అని రెచ్చిపోతుంటాడు. అలాంటింది ముకుంద సినిమాలో సైలెంట్ గా కనిపించి.... మాటల కన్నా నటనపై ఎక్కువ దృష్టి పెట్టిన వరుణ్.... లోఫర్ గా సెట్టవుతాడా అనే డిస్కషన్స్ జరుగుతున్నాయి. మొత్తానికి ఆరంభంలో క్లాస్ గా కూల్ అనిపించుకున్న కుర్రాడు...మాస్ గా మెప్పిస్తాడేమో చూద్దాం.