అప్పుడే మహేష్ అసలు స్వరూపం తెలిసేది!
on Jul 26, 2016
మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ నటించబోయే సినిమాలో మనోడు ఏదో కొత్త లుక్ ట్రై చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం వినే ఉంటారు కదా. బాబు గెడ్డం పెంచి డిఫరెంట్ లుక్ ఏదో ట్రై చేస్తున్నాడట, ఇటీవలే ఒక ట్రైల్ ఫోటోషూట్ కూడా చేశారని వినికిడి. అవుట్ పుట్ తో యూనిట్ హ్యాపీగానే ఉన్నప్పటికీ.. మహేష్ కు మాత్రం ఎక్కడో కొడుతుందట. ఈ కొత్త లుక్ ను ఆడియన్స్ ముఖ్యంగా తన ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా? అని భయపడుతున్నాడట.
మహేష్ డౌట్ ను అర్ధం చేసుకున్న దర్శకుడు మురుగదాస్ వెంటనే ఒక ఐడియా ఇచ్చాడట. ఎలాగో ఆగస్ట్ 9న మహేష్ బాబు బర్త్ డే ఉంది కాబట్టి, ఆ సందర్భంగా ఫోటోషూట్ లో తీసిన ఏదో ఒక స్టిల్ ను వదిలితే అప్పుడు వచ్చిన రెస్పాన్స్ ను బట్టి ఆ లుక్ ను కంటిన్యూ చేయాలా? లేక మరో లుక్ ట్రై చేయాలా? అనే విషయాన్ని మహేష్ అండ్ టీం ఫిక్స్ అవుతారన్నమాట!