LATEST NEWS
వైసీపీ నాయకుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ ను విజయవాడ ఎస్సీఎస్టీ కోర్టు మరో రెండు వారాలు పొడిగించింది. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు దారుడు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో అరైస్టు విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ రింమాండ్ గడువు పూర్తి కావడంతో పోలీసులు వంశీని వర్చువల్ గా కోర్టులో హాజరు పరిచారు. జూమ్ కాల్ ద్వారా వంశీని విచారించిన మేజిస్ట్రేట్ వంశీ రిమాండ్ ను ఈ నెల 25 వరకూ పొడిగించారు.
వాస్తవానికి వల్లభనేని వంశీ అరెస్టు వంశీ స్వయంకృతాపరాధమే అని చెప్పవచ్చు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఆయన ముందస్తు బెయిలు పిటిషన్ పెండింగ్ లో ఉంది. తీర్పు వెలువడే వరకూ కోర్టు నుంచి ఆయన అరెస్టు కాకుండా రక్షణ కూడా ఉంది. ఆ పరిస్థితుల్లో కుట్రపూరితంగా కేసే లేకుండా చేసుకోవాలని వంశీ చేసిన ప్రయత్నమే ఆయన అరెస్టుకు దారి తీసింది. విషయంలోకి వెడితే..
తెలుగుదేశం టికెట్ పై 2019 ఎన్నికలలో గన్నవరం నుంచి విజయం సాధించి.. ఆ తరువాత వైసీపీలోకి జంప్ చేసిన వల్లభనేని వంశీ.. పార్టీ ఫిరాయించి ఊరుకోలేదు. తెలుగుదేశం నాయకులు, క్యాడర్ లక్ష్యంగా దాడులు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీనే గన్నవరం నియోజకవర్గంలో నామరూపాల్లేకుండా చేయాలన్న కుట్రలు చేశారు. తెలుగుదేశం అధినేతపైనే కాకుండా ఆయన కుటుంబ సభ్యులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యవహార శైలి కారణంగానే గన్నవరంలో 2024 ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. అసలు ఎన్నికల కంటే ముందే వంశీ తన ఓటమిని అంగీకరించేశారని చెప్పవచ్చు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని ప్రకటించి సానుభూతితో గెలిచేద్దామన్న ప్రయత్నాలూ చేశారు. అవేమీ ఫలితాన్నివ్వలేదు. జనం ఆయనను ఛీ కొట్టారు. సరే ఆ ఎన్నికలలో వంశీ పరాజయం పాలయ్యారు. వైసీపీ కూడా ఘోరంగా ఓడిపోయి..కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక చతికిల పడింది.
పార్టీ ఓటమి పాలైన క్షణం నుంచీ వంశీ దాదాపు అజ్ణాత వాసం చేస్తున్నారు. బయటకు వస్తే పోలీసులు ఎక్కడ అరెస్టు చేస్తారో అన్న భయంతో నక్కినక్కి గడుపుతున్నారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో వంశీపై కేసు నమోదైంది. ఆయనతో పాటు ఆయన అనుచరులపైనా కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన అనుచరులు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. వంశీ కూడా అరెస్టు భయంతో యాంటిసిపేటరీ బెయిలు కోసం కోర్టును ఆశ్రయించి, అరెస్టు భయం నుంచి తాత్కాలిక ఊరట పొందారు. ఆయనకు కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేయలేదు కానీ, ఆయన పిటిషన్ విచారణ పూర్తై తీర్పు వెలువడే వరకూ అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చింది. సరిగ్గా ఈ తరుణంలోనే వల్లభనేని వంశీ తన కుట్రలకు తెరతీశారు.
గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు దారుడిను కిడ్నాప్ చేసి, బెదరించి కేసు ఉపసంహరణకు అఫడివిట్ దాఖలు చేసేలా చేశారు. ఈ కేసులో ఫిర్యాదు దారుడే రివర్స్ అయ్యే సరికి అంతా వంశీపై కేసు వీగిపోయిందనే భావించారు. అయితే అధికారంలో ఉండగా ఇష్టారీతిగా వ్యవహరించినా సాగినట్లు.. అధికారం లేని సమయంలో కూడా సాగుతుందని వంశీ ఎలా భావించారో తెలియదు కానీ, ఇప్పుడు ఆయన కిడ్నాప్, బెదరింపు కేసులో అరెస్టయ్యారు. ఆ కేసులోనే ఇప్పుుడు ఆయన రిమాండ్ ను కోర్టు రెండు వారాలు పొడిగించింది.
రోజులు మారి పోతున్నాయి. మనుషులు మారి పోతున్నారు. విలువలు జారిపోతున్నాయి. ఆర్థిక, వ్యాపార కార్యకలాపాలు ఇంకా వేగంగా మారిపోతున్నాయి. మరి, ఆకాశం లో సగంగా ఉన్న మహిళలూ కాలంతో పాటే అన్నట్లు ఇంకో అడుగు ముందుకు వేస్తున్నారు. ఇంకా ఎంత కాలమని వంటింటికే పరిమితం అనుకుంటున్నారో ఏమో, పది మందికి ఆదర్శంగా నిలవాల్సిన ఏపీలో ప్రభుత్వ అధికారుల శ్రీమతులు కొందరు, అధికారం లో కి వచ్చిన నేతల ధర్మపత్నులు ఇంకొందరు అక్రమ వసూళ్ల కు నడుం బిగించారు. మాకు గోడలు లేవు అంటూ స్వయం ఉపాధి లాగ రంగంలో దూసుకు పోతున్నారు. భర్త హోదా, అధికారమే పెట్టుబడిగా కుటుంబ వ్యాపార సామ్రాజ్యాలను విస్తరిస్తున్నారు.
డబ్బు సంపాదించడం ముఖ్యం కానీ, ఎలా అన్నది కాదు కదా? అయినా, అవినీతి ఇప్పుడే పుట్టిందా ..ఏంటి? అన్నట్టు ఉంది వారి తీరు. అవును. అవినీతి ఎప్పుడు, ఎక్కడ. ఎలా పుట్టిందో ఏమో కానీ, ఇప్పడు అవినీతికి ఎల్లలు లేవు. హద్దులు,సరిహద్దులు అసలే లేవు. అవినీతి సర్వాంతరయామి. ఇక్కడ వుంది, అక్కడ లేదు అన్న సదేహం లేకుండా విశ్వం అంతటా వ్యాపించింది. భగవంతుడు ఎక్కడ లేడు అంతటా ఉన్నాడు,(ఇందుగలడందు లేడని/సందేహము వలదు చక్రి సర్వోపగతుండు) అంటాడు ప్రహ్లాదుడు. అందుకే వారు డబ్బు లోనే పరమాత్మ ను వెతుక్కుంటున్నారు.అవినీతి విషయంలో మాత్రం అలాంటి సందేహం అస్సలు అవసరం లేదు. అంతటా వుంది. అన్నిటా వుంది. సందేహం లేదు. నిజానికి, ఇప్పడు కాదు, ఎప్పుడోనే, స్వర్గీయ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ , Corruption is an international phenomenon, ‘విశ్వ లక్షణం’, విశ్వం అంతటా వుంది, మన దేశంలోనూ వుంది, ఉంటుంది, అంటూ’ అవినీతి విశ్వ రూపాన్ని వివరించారు. అంతేకాదు, అవినీతి గురించి, చొక్కాలు చింపుకోవద్దని, విపక్షాలకు జ్ఞాన బోధ కూడా చేశారు.
ఇందిరమ్మ ఇచ్చిన భరోసాతోనో ఏమో, ఆనాటి నుంచి మన దేశంలో అవినీతి, ఇంతింతై వటుడింతై అన్నట్లు పెరిగిపోతూనే వుంది. ఎసీబీలు, సిబిఐ,ఈడీ ఇంకా.. ఇతర అవినీతి నిరోధక శాఖలు, అవినీతి వ్యతిరేక చట్టాలు, ఆ చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేసే న్యాయ వ్యవస్థ, ఎన్నున్నా, ఏమి చేసినా, ఆకులు వేసే వారు వేస్తుంటే, తీసేవారు తీస్తున్నారు అన్నట్లు ఎవరి ‘పని’ వారు చేసుకు పోతున్నారు. అంతే కాదు, ఆరు నెలలు స్నేహం చేస్తే వారు వీరవుతారు అన్నట్లు న్యాయవ్యవస్థ సహా అవినీతి నిరోధక వ్యవస్థలు అన్నిటికీ కూడా అవినీతి సోకిందని,పాకిందని కథలు వింటున్నాం. అయ్య గారు చెయ్యక పోతే అమ్మ గారు చేస్తారు గా అన్నట్టుగా నడుస్తోంది వ్యవహారం. కావలసినదంతా ఒక్కటే, చేతిలో శాలువాలు, దేవుడి ప్రసాదం, ఆశీర్వచనాలు చెప్పే పంతులుగారు పక్కన ఉంటే , డబ్బు సంచి తేలిగ్గా చేతులు మారి పోతుంది. గత ప్రభుత్వం లో ఈ పద్ధతి బాగా పని చేసింది అంటున్నారు. కంచే చేను మేసిన కథలు అనేకం చూస్తూనే ఉన్నాం. వింటూనే ఉన్నాం.
అంతే కాదు, ఒకప్పడు లంచం అంటే ఏదో చాటు మాటు వ్యవహారంగా సాగేది. కిందిస్థాయి ఉద్యోగులు, వేడి నీళ్ళకు చలి నీళ్ళు’ అన్నట్లు బల్ల కింద చేతులు పెట్టి పదీ పరక పుచ్చుకోవడం ఉండేది. అందులోనే, అంతో ఇంతో పై అధికారుల చేతులు తడపడం ఉంటే ఉండేదేమో. నిజంగానే, అప్పట్లో ఇందిరా గాంధీ అన్నట్లుగా, ఇప్పుడు అదో పెద్ద సమస్య కాదు. అందుకే, అప్పట్లో సినిమాల్లోనూ, లంచాలు ఇచ్చి పుచ్చుకోవడాలు కామెడీ ట్రాక్ కు మాత్రమే పరిమితంగా ఉండేది.అలా కామెడీ, ట్రాక్ కు మాత్రమే పరిమితం అయిన లంచావతారాలు తర్వాత తర్వాత టైటిల్’ రోల్ కి చేరుకున్నాయి. దాసరి నారయణ రావు, ఏకంగా ‘లంచాచాతరం’ టైటిల్ తో ఫుల్ లెంగ్త్ సినిమానే తీశారు. అలాగే, అవినీతిని ఎండగడుతూ, సమాజాన్ని చైతన్య పరిచే ప్రయత్నంలో భాగంగా ఠాగూర్ , భారతీయుడు , అపరిచితుడు వంటి సినిమాలు వచ్చాయి. సినిమాల దారి సినిమాలది అవినీతి దారి అవినీతిది అన్నట్లు రియల్ స్టోరీ నడుస్తోందనుకోండి అది వేరే విషయం.
అదెలా ఉన్నా ఇప్పడు అవినీతి కొత్త పుంతలు తొక్కుతోంది. మంత్రుల పేషీలు, ఐఎఎస్ చాంబర్లు దాటి, ఉన్నతాధికారుల వంటిటికీ చేరింది. అవును. ఆంధ్ర ప్రదేశ్ లో అందరూ కాదు కానీ,కొందరుసీనియర్ అధికారులు, నిండా మునిగినాక చలేమిటి,అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మొదలైన అవినీతి అరాచకత్వం,ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. గతంలో చేసిన తప్పులకు కొందరు ఐఎఎస్ అధికారులు కేసులు ఎదుర్కున్నారు. అందులో కొందరు జైలు ఊచలు లెక్క పెట్టారు. అయినా, ఆ ఐఎఎస్ ల తీరు మారలేదు. ఇప్పడు అధికారుల అవినీతికి సంబంధించి వస్తున్న చిత్ర విచిత్ర కథలు, కథనాలు విస్మయానికి గురిచేస్తున్నాయి.
అన్నిటినీ మించి కొందరు అధికారుల అవినీతిని ఫ్యామిలీ బిజినెస్ గా మార్చేశారు. ఇంకొందరు అధికారుల భార్యలు, తమ భర్త హోదా పెట్టుబడిగా, హోటళ్ల లో మీటింగ్‌లు పెట్టి , స్వయం ఉపాధి లాగా కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. ఏకంగా ఏ పనికి ఎంత రేటన్నది ఫిక్స్ చేసి, రేట్ కార్డు ప్రకారం, పనిచేస్తున్నట్లు జనం కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. నియంత్రించాల్సిన పాలకులే ఎన్నికల్లో పోయిన సొమ్ము రాబట్టు కునే పనిలో ఉంటే , దీనికి అడ్డు చెప్పేవారు ఎవరు? సీట్లు, ఓట్లు కోసం కోట్లు ఖర్చు పెట్టి చేతులు ముడుచుకుని కూర్చుంటే రేపటి పరిస్థితి ఏమిటి? అని ఓపెన్ గానే ప్రశ్నిస్తున్నారు. మంచి పోస్టులు కోసం అధికారుల దగ్గరే డబ్బులు వసూలు చేస్తున్న నేతలు మాత్రం ఏమి అదుపు చేస్తారు? ఎవరిని చేస్తారు? కంచే చేను మేస్తుంటే, మిగతా వారు దూడలు గా మారి పోరా? అవినీతి కొత్త కాదు కానీ , మార్గాలే కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రేపటి కోసం ఏం చేయగలం.
టిడిపి కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు వల్లభనేని వంశీ కి భారీ షాక్ తగిలింది. ఆయన రిమాండ్ ను ఎస్సి ఎస్టి కోర్టు మరోసారి పొడిగించింది. వంశీని వర్చువల్ గా జైలు అధికారులు జడ్జి ఎదుట హాజరుపర్చారు. ఈ నెల 25 వరకు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వంశీని ఎపి పోలీసులు గత నెలలో హైద్రాబాద్ లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ALSO ON TELUGUONE N E W S
శర్వానంద్(Sharwanand),ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి(Krithi Shetty)జంటగా శ్రీరామ్ ఆదిత్య(sriram Adithya)దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టి జె విశ్వప్రసాద్(TJ Viswaprasad)నిర్మించిన చిత్రం 'మనమే(Manamey.వెన్నెల కిషోర్,సీరత్ కపూర్, ముకేశ్ రుషి,రాహుల్ రామకృష్ణ, సచిన్ కెడ్కర్ కీలక పాత్రలు పోషించారు.గత ఏడాది జూన్ లో థియేటర్స్ లోకి అడుగుపెట్టగా,పెద్దగా ప్రేక్షకాదరణని పొందలేకపోయింది.
రీసెంట్ గా ఈ మూవీ మార్చి 7 నుంచి ఓటిటి వేదికగా అమెజాన్ ప్రైమ్(Amazon Prime)లో స్ట్రీమింగ్ అవుతుంది.రిలీజైన రెండో రోజు నుంచే వ్యూయర్స్ పరంగా టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నట్టుగా అమెజాన్ ప్రైమ్ అధికారకంగా వెల్లడి చేసింది.ఇప్పటికి నెంబర్ వన్ స్థానంలోనే కొనసాగుతునట్టుగా కూడా సదరు సంస్థ చెప్పుకొచ్చింది.
మూవీ మొత్తం కూడా 90 పర్సెంట్ ఫారిన్ లోనే జరుగుతుంది.విక్రమ్,సుభద్ర అనే క్యారెక్టర్స్ లో శర్వానంద్,కృతి శెట్టి నటించారనేకంటే జీవించారని చెప్పవచ్చు.విక్రమ్,సుభద్ర ఫ్రెండ్స్ ఒక యాక్సిడెంట్ లో చనిపోతారు.దీంతో వాళ్ళిద్దరి కొడుకు ఖుషికి తల్లి తండ్రులుగా విక్రమ్,సుభద్ర బాధ్యతలని తీసుకుంటారు.ఈ క్రమంలో ఏం జరిగిందనేదే మనమే చిత్ర కథ.
War 2 starring Hrithik Roshan, Jr. NTR has been one of the most awaited films in Indian Cinema with two massive stars coming together for the first time. Also, YRF are pioneering in bringing a multi-starrer with current Hindi Star acting alongside South Indian star in recent years, with this one.
After late 80's and early 90's, when Rajinikanth, Kamal Haasan and Akkineni Nagarjuna could act in leading roles in Hindi, Jr. NTR got that opportunity now. So, his fans are eager to watch him in this uncoventional avatar. But the recent reports have created a panic among them.
According to the reports, Hrithik Roshan sprained his ankle during rehearsals of a huge song which is set to be shot on Hrithik and NTR. Doctors advised him to take proper rest before continuing to the shoot. Hence, the makers have postponed the shoot from planned dates to another time.
Now, NTR fans are worried that due to this delay, the movie release could be postponed and this could result in delay in Prashant Neel's film, too. The media reports from Mumbai state that there is no need for panic and the song shoot will be finished in time for planned release date.
Also, the rumors about cameos of Shah Rukh Khan or Salman Khan along with NTR are being rubbished by the recent reports. YRF are holding information tight to their chests and all exiciting information will only be revealed in theatres, it seems. Kiara Advani is playing leading lady role and is directed by Ayan Mukherji.
'ఏజెంట్' డిజాస్టర్ తో దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకున్న అక్కినేని అఖిల్ (Akkineni AKhil).. ఎట్టకేలకు తన నెక్స్ట్ మూవీని పట్టాలెక్కించబోతున్నాడు. అఖిల్ కొత్త సినిమా మార్చి 14 నుంచి మొదలు కానుందని తెలుస్తోంది.
'ఏజెంట్' తర్వాత అఖిల్ రెండు సినిమాలు కమిట్ అయ్యాడు. అందులో ఒకటి యు.వి. క్రియేషన్స్ బ్యానర్ లో 'ధీర' అనే భారీ బడ్జెట్ ఫిల్మ్. ఈ సినిమాతో అనిల్ కుమార్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. అలాగే, 'వినరో భాగ్యము విష్ణుకథ' ఫేమ్ మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో కూడా అఖిల్ ఒక సినిమా కమిట్ అయ్యాడు. నాగార్జున నిర్మించనున్న ఈ చిత్రానికి 'లెనిన్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఈ రెండు సినిమాల్లో ముందుగా 'లెనిన్' సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న 'లెనిన్' మూవీ మార్చి 14న ప్రారంభం కానుందట. ఎక్కువ భాగం షూటింగ్ చిత్తూరు జిల్లాలో జరగనుందని అంటున్నారు. ఈ చిత్రంలో చిత్తూరు ప్రాంతానికి చెందిన పల్లెటూరి యువకుడిగా అఖిల్ సరికొత్తగా కనిపించనున్నాడట.
2015 లో హీరోగా పరిచయమైన అఖిల్, ఇప్పటిదాకా ఐదు సినిమాలు చేయగా.. అందులో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' తప్ప మిగతా సినిమాలు పరాజయం పాలయ్యాయి. అక్కినేని వారసుడిగా ఎన్నో అంచనాల నడుమ హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్.. ఆ అంచనాలకు అందుకోలేకపోతున్నాడు. అందుకే అఖిల్ కొత్త సినిమాల విషయంలో నాగార్జున ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడట. ఈ క్రమంలోనే విలేజ్ బ్యాక్ డ్రాప్ లోని 'లెనిన్' కథ ఎంతో నచ్చి నాగార్జున ఓకే చేసినట్లు వినికిడి.
నటుడిగా స్వర్ణ ఉత్సవం జరుపుకుంటున్న డైలాగ్ కింగ్ సాయి కుమార్ 'అగ్ని' సాయి కుమార్ కి 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారానికీ ఎంపికచేసినట్లు సెలక్షన్ చైర్మన్ సి.పార్ధ సారధి IAS, కో-చైర్మన్ నాగబాల డి.సురేష్ కుమార్, కన్వీనర్ కొమరం సోనే రావు, శిడాం అర్జు మాస్టారు, అధికారిక ప్రకటనలో తెలియచేసారు.
గత 12 సంవత్సరాలుగా 'భారత కల్చరల్ అకాడమి, ఓం సాయి తేజ ఆర్ట్స్, ఆదివాసి సాంస్కృతిక పరిషత్' సంయుక్త నిర్వహణలో ఈ అవార్డ్ ను అందిస్తున్నామని, గతంలో ఈ కొమరం భీమ్ అవార్డును సుద్దాల అశోక్ తేజ, అల్లాణి శ్రీధర్, లెజెండరీ ఆర్టిస్ట్ రాజేంద్ర ప్రసాద్, గూడ అంజయ్య వంటి దిగ్గజాలకు ఈ పురస్కారం తో సన్మానించమని, అవార్డు తో పాటు జ్ఞాపిక ను, యాబై ఒక వెయ్యి రూపాయల నగదు అందిస్తామని, కమిటి సభ్యులు తెలియచేసారు.
మార్చ్ 23 వ తేది నాడు ఈ పురస్కరోత్సవం కొమరం భీమ్ జిల్లా, ఆసిఫాబాద్ కేంద్రం లోని ప్రమీల గార్డెన్స్ లో స్తానిక శాసనసభ్యులు శ్రీమతి కోవా లక్ష్మి, ప్రముఖ బి జే పి నాయకులు శ్రీ అరిగెల నాగేశ్వర రావు గారి పర్యవేక్షణలో జరుపుతున్నామని, రాజకీయ, సినీ, వ్యాపార, గిరిజన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారని వారు తెలియ చేసారు. ఈ సందర్భంగా గిరిజన కళాకారులతో పలు గిరిజన సాంప్రదాయ నృత్యాల ప్రదర్శన ఆకర్షణ కాబోతుందని తెలిపారు.
పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)హిట్ మూవీస్ లో 'గబ్బర్ సింగ్'(Gabbar SIngh)కూడా ఒకటి.హిట్ మూవీ అనే కంటే పవన్ వరుస పరంపరకి ముగింపు పలుకుతు సరికొత్త సినీ అధ్యాయానికి అంకురార్పణ చేసిన చిత్రమని కూడా చెప్పవచ్చు.పవన్ అభిమానులకి కూడా గబ్బర్ సింగ్ ఒక స్పెషల్ మూవీ.
ఈ మూవీలో ఇంటర్వెల్ తర్వాత వచ్చే అంత్యాక్షరి ఎపిసోడ్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది.ఎంతలా అంటే ఈ ఎపిసోడ్ లో నటించిన వాళ్ళు ఓవర్ నైట్ స్టార్ డమ్ ని సంపాదించి,ఆ తర్వాత చాలా సినిమాల్లో అవకాశాలు సంపాదించి,తమదైన హవాని కొనసాగిస్తూ వస్తున్నారు.అలాంటి వాళ్ళల్లో సాయి కూడా ఒకడు.పవన్ తో కలిసి 'అంత్యాక్షరి'లో నన్ను కొట్టకురో,తిట్టకురో మావా సుబ్బులుమావా సాంగ్ కి డాన్స్ చేసి థియేటర్ లో పవన్ అభిమానుల చేత, ప్రేక్షకుల చేత డాన్సులు చేయించి గబ్బర్ సింగ్ సాయి గా గుర్తింపుని పొందాడు.
రీసెంట్ గా గబ్బర్ సింగ్ సాయి(Gabbar Singh Sai)కూతురు పెళ్లి హైదరాబాద్ లో అత్యంత వైభవంగా జరిగింది.ఈ వివాహ వేడుకకి మెగా బ్రదర్ నాగబాబు(Nagababu)హాజరయ్యి వధూవరులని ఆశీర్వదించాడు.ఈ సందర్భంగా పెళ్ళికి వచ్చిన అతిదులతో పాటు సాయి బంధువులు నాగబాబు తో ఫోటోలు దిగడానికి పెద్ద ఎత్తున పోటెత్తారు.తన కూతురు పెళ్ళికి నాగబాబు రావడంపై గబ్బర్ సింగ్ సాయి మాట్లాడుతు నాగబాబు రావడం అంటే చిరంజీవి,పవన్ కళ్యాణ్ వచ్చినట్టే అని చెప్పడం విశేషం.గబ్బర్ సింగ్ సాయి పవన్ కళ్యాణ్ కి వీరాభిమానిని తో పాటు జనసేన పార్టీ తరుపున ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం కూడా చేసాడనే విషయం తెలిసిందే.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు.
టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.
జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్‌లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్‌డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్‌స్టర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు.
చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్ విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది.
ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.
అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి 15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్ పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు ఒకే సారి ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.
రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .
దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.
ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు. వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .
ఛత్రపతి శివాజీ.. ఈ పేరు చెబితే దేశ పౌరుల గుండెల్లో గర్వం, దేశ భక్తి ఉప్పొంగుతాయి. మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి ఈ దేశాన్ని ముస్లిం పాలకుల చేతిలో పడకుండా అడ్డుకోవడంలో శివాజీ మహారాజ్ పాత్ర చాలా ఉంది. శివాజీ మహారాజ్ కు తల్లి జిజియాబాయి చాలా గొప్ప మాటలతోనూ, దేశభక్తి, దైవభక్తి, వీరత్వం కలగలిపి పెంచింది. అలాంటి జిజియా బాయి చేతిలో పెరిగినవాడు శంభాజీ మహారాజ్.. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ గురించి ఈ దేశానికి తెలిసినంత శంభాజీ మహారాజ్ గురించి మొన్నటి దాకా తెలియదు. శంభాజీ మహారాజ్ చరిత్రను చరిత్రకారులు కాలగర్భంలో కలిపేశారు. ఇంకా చెప్పాలంటే.. శంభాజీ మహారాజ్ త్యాగానికి గుర్తింపు కూడా లేకుండా మరుగున ఉంచారు. కానీ చావా సినిమాతో ఛత్రపతి శంభాజీ మహారాజ్ గురించి దేశానికి తెలిసింది. అప్పటి నుండి శంభాజీ మహారాజ్ పట్ల గౌరవం, ఆయన పట్ల భక్తిభావం పెరుగుతున్నాయి. మార్చి 11వ తేదీన ఆయన మరణించారు. ఆయన వర్థంతి సందర్బంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటే..
మరాఠా యోధులు వీరత్వానికి పెట్టింది పేరు. ఈ మరాఠా సామ్రాజ్యానికి రెండవ ఛత్రపతి రాజు, ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు సంభాజీరాజ్ భోస్లే. ఈయనను అందరూ శంభాజీ అనే పిలుస్తున్నారు. దక్షిణ భారతదేశంలో మొఘల్ దండయాత్రలను ఆపడం, మొఘల్ సైన్యాలను ఎదుర్కోవడం ద్వారా దక్షిణ భారతదేశం మొఘలుల చేతిలో పడకుండా చేయడంలో శంభాజీ మహారాజ్ కీలకపాత్ర పోషించాడు. కేవలం 33 సంవత్సరాలు జీవించిన శంభాజీ మహారాజ్ వీరత్వం ఎన్ని శతాబ్దాలు గడిచినా చెప్పుకోదగినది.
1657 సంవత్సలం మే 14న పురందర్ కోటలో శంభాజీ మహారాజ్ జన్మించాడు. ఛత్రపతి శంభాజీ మహారాజ్ తల్లి సాయిబాయి శంభాజీ చిన్నతనంలోనే మరణించింది. దీంతో రాజమాత జిజాబాయి శంభాజీ సంరక్షణ చూసుకుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ను ఎలా పెంచిందో అదే విధంగా శంభాజీని కూడా పెంచింది ఆవిడ. ఒక దశలో శంభాజీ మహారాజ్ కు ప్రాణాపాయం పొంచి ఉందని గ్రహించి శంభాజీ చనిపోయాడని శివాజీ మహారాజ్ పుకారు వ్యాప్తి చేశాడు.
శంభాజీ గొప్ప వీరుడు, మంచి శరీర సౌష్టవం కలవాడు, అన్నింటి కంటే ఎక్కువగా భాష ప్రావీణ్యం కలవాడు. ఆయన మరాఠా, హిందీ, ఇంగ్లీషు, మలయాళం తో సహా చాలా భాషలు అనర్గళంగా మాట్లాడేవాడట. ఇక శంభాజీ మహారాజ్ వీరత్వం, ధైర్యం, తెగువను చావా సినిమాలో చూపించారు. అయితే ఇది ఆయన వీరత్వం, ధైర్యం, తెగువ ముందు ఇంకా తక్కువే.. ఆయన శత్రువుకు భయపడేవాడు కాదు. చివరకు మోసపూరితంగా ఔరంగజేబు శంభాజీని బంధించి చిత్రవధకు గురి చేసినా సరే.. హిందూ మతం పట్ల కించిత్తు కూడా అభిప్రాయం మార్చుకోలేదు. శంభాజీని చిత్ర హింసలకు గురి చేస్తున్న సన్నివేశాలు సినిమాలో చూస్తుంటేనే కళ్లలో నీళ్లు వస్తాయి. అలాంటిది ఆయనను వాస్తవంగా ఎంత నరకానికి గురి చేసి ఉంటారో తలచుకుంటే ప్రతి దేశ పౌరుడి గుండె బరువెక్కుతుంది. తను అధికారంలోకి వచ్చిన 9 సంవత్సరాలలో జాజారు 120 యుద్దాలు చేసి ఒక్క యుద్దం కూడా ఓడిపోని వీరుడు శంభాజీ. అలాంటి శంభాజీ మహారాజ్ త్యాగాన్ని, ఆయన చరిత్రను, ఆయన పోరాటపటిమను అందరూ తెలుసుకోవాలి.
*రూపశ్రీ.
మనందరిలోను ఒక ప్రవృత్తి వుంది అదేంటంటే…. అన్నిటితోనూ సర్దుకుపోవడం అని. దాన్నే అలవాటుపడిపోవడం అంటారు. పరిస్థితులను నిందిస్తూ కాలం గడపడం, పరిస్థితులు వేరుగా వున్నట్లయితే, నేనూ మరో విధంగానే రూపొందేవాడిని అనో, నాకో అవకాశం ఇవ్వండి, యేం చేస్తానో చూడండి అనో, అందరూ కలిసి నాకు అన్యాయం చేశారు అనో, ఇలా ఒకటి అని కాదు బోలెడు రకాల మన ఇబ్బందులను ఇతరులకు, పరిస్థితులకు, మన చుట్టూ ఉండే వాతావరణానికి, ఆర్థిక ఒత్తిడులకు ఇలా ఏదో ఒకదానికి అంటగట్టడానికి ప్రయత్నిస్తాము.
ఈ చికాకులకు అలవాటు పడిపోయాడంటే వ్యక్తి మనసు బద్ధకంగా తయారయిపోయిందన్నమాట. మన చుట్టూ వున్న సౌందర్యానికి అలవాటు పడిపోయి దాని అస్తిత్వాన్నే గమనించకుండా వుండిపోతాము గదా! అలవాటు పడిపోకపోతే, దాన్నుంచి పరుగులు తీద్దామనుకుంటాము, ఏ మందో మాకో తీసుకుని, రాజకీయ ముఠాలలో చేరి, అరుస్తూ, వ్రాసుకుంటూ, ఆటలకు వెడుతూ గుడి గోపురానికో దర్శనానికి నడుస్తూ పారిపోదామనుకుంటాం. ఏదో మరో రకం వినోదం కల్పించుకుంటూ వాస్తవ విషయాల నుంచి ఎందుకని పరుగెత్తుకుపోదాం అనుకుంటాం?
మనకు మృత్యువు అంటే భయం. ఇది అందరికీ తెలిసిన విషయమే…. ఎవరూ మృత్యువుని ప్రేమించరు. దీనికోసం ఎన్నో రకాల సిద్ధాంతాలు, ఆశలు, విశ్వాసాలు కనిపెడతారు. మృత్యువుకు ముసుగు వేయటానికి, అయినా వాస్తవం అలా ఇంకా నిలిచే వుంది. వాస్తవాన్ని అవగాహన చేసుకోవాలంటే మనం దానివంక చూడగలగాలి, దాని నుంచి పారిపోవడం మార్గం కాదు.
మనలో చాలమందికి బ్రతకాలన్నా భయమే, మృత్యువన్నా భయమే. మనకు కుటుంబం అంటే భయం, పదిమంది మాట అంటే భయం, ఉద్యోగం పోతుందేమోనని భయం, మన భద్రత గురించి భయం, ఇంకా ఇలాంటివే వందలాది విషయాలను గురించి భయం. అసలు వాస్తవం ఏమిటంటే మనకు భయం, దీన్ని చూసి దాన్ని చూసి కాదు. వాస్తవాన్ని చూడలేక కలుగుతున్న భయం అది. మనం ఎందుకని ముఖాముఖి ఆ వాస్తవాన్ని చూడలేకపోతున్నాం?? వాస్తవాన్ని సందర్శించడం అనేది వర్తమానంలోనే సాధ్యం. కానీ ఎప్పుడూ పారిపోవడానికి ప్రయత్నిస్తూ దాన్ని ముందుకు రానివ్వడమే లేదు. పలాయన ప్రక్రియకు అనుగుణంగా మనమొక చక్కని వల తయారు చేసుకున్నాం కాబట్టి ఈ అలవాటులోనే చిక్కుబడి పోతున్నాం.
మనుషులు అందరూ సునిశితులు, తీవ్రంగా ఆలోచించేవాళ్ళు అయితే, వారి నిబద్ధత వారికి తెలిసి రావడమే కాకుండా, అది తీసుకువచ్చే తదుపరి ప్రమాదాలు కూడా గమనించగలుగుతారు. అది ఎంత క్రౌర్యం, హింస, దుస్సహసస్థితి తీసుకు వస్తుందో తెలుసుకోగలుగుతారు. మీ నిబద్ధతలో వున్న ఈ ప్రమాదాలనన్నిటినీ గమనించినప్పుడు, పని చేయటానికి ఎందుకు పూనుకోరు? సోమరిపోతులు కాబట్టినా ?
సోమరితనం ఎలా కలుగుతుంది??
తగినంత శక్తి - జీవసత్వం లేకపోవడం వల్ల కలుగుతుంది. మీ కళ్లకు ఎదురుగా ఏదో పామో, మంటో, గుంటో వుంటే ఆ స్థూల ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు అవసరమయ్యే శక్తి మీకు తక్షణమే వాటిని చూసిన వెంటనే సమకూరుతుంది కదా! మరి కొన్ని జీవితకాల విషయాల పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటారు. మాటమాత్రంగానే చూసినందువల్ల మాటకు, ఆచరణకు వైరుధ్యం వస్తుంది. ఆ వైరుధ్యం శక్తి సంపదనంతా కొల్లగొట్టుకుపోతుంది. నిబద్ధతతో స్పష్టంగా చూసి దానిపల్ల వచ్చే ప్రమాదాలను తక్షణమే గమనించగలిగితే అప్పుడే మీరు కార్యాసక్తులవుతారు. కాబట్టి చూడడమే కార్యాచరణ.
మనలో చాలమందిమి జీవితాన్ని అశ్రద్ధగా తీసుకుంటాము. మనం పెరిగిన వాతావరణానికి అనుగుణంగా స్పందనలు, ప్రతిస్పందనలు చేస్తూ వుంటాము. ఇవన్నీ మరింత కట్టుబాటును, బంధనాన్ని తీసుకువస్తాయి. అలా వచ్చినప్పుడే మనిషికి తనమీద తనకు ఒక స్పష్టత చేకూరుతుంది.
◆నిశ్శబ్ద.
చట్టం సమాజంలో, దేశంలో ప్రతి పౌరుడికి కొండంత భరోసా ఇస్తుంది. పౌరులందరికి సమన్యాయం చేసేది చట్టమే. అయితే ఆ చట్టం సరైన విధంగా ఉంటేనే ఆ సమన్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. భారతదేశంలో సమన్యాయం అనే మాట కాసింత చర్చలకు దారి తీస్తుంది. ముఖ్యంగా లింగ సమానత్వం అనే విషయం మీద ఎప్పుడూ సమాజంలో ఏదో ఒక చర్చ, అభిప్రాయం పుట్టుకొస్తూనే ఉంటుంది. పదుగురికి న్యాయం అందించే న్యాయ సేవ విభాగంలో మహిళలు కూడా ప్రవేశించి, న్యాయ దేవతలకు ప్రతి రూపంగా నిలుస్తున్నారు. న్యాయ సేవలో మహిళల పాత్రను, ఆవశ్యకతను గుర్తు చేస్తూ.. మహిళలను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మార్చి 10 వ తేదీన అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవం జరుపుకుంటారు.
చట్టం గురించి అద్భుతమైన విషయం ఏమిటంటే అది న్యాయంగా ఉండాలి. న్యాయం గుడ్డిది, పక్షపాతంతో లేనిది, అందరికీ సమానంగా ఇవ్వబడుతుంది. ఇది చాలా మంచి ఆలోచన. అయినప్పటికీ భారతదేశ న్యాయవ్యవస్థను పరిశీలిస్తే ఒక విచిత్రమైన విషయాన్ని గమనించవచ్చు. న్యాయం గుడ్డిది కావచ్చు, కానీ అది చాలా స్పష్టంగా ఒక రూపంలో న్యాయాన్ని వ్యక్తం చేస్తుంది. న్యాయం అనగానే చాలా మందికి నల్లకోటు, టై ధరించిన లాయర్ ఏ గుర్తుకువస్తాడు. ప్రతి సంవత్సరం మార్చి 10న ప్రపంచం అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మహిళలు చట్టాన్ని అర్థం చేసుకోగలరని న్యాయ సేవలో భాగం కాగలరని స్పష్టంగా తెలియజేస్తుంది.
ఈ దినోత్సవాన్ని 2021లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ స్థాపించింది. మొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా 2022లో జరుపుకున్నారు. న్యాయవ్యవస్థలో మహిళల సహకారాన్ని గుర్తు చేసుకోవడానికి, న్యాయపరమైన పాత్రలను కొనసాగించడానికి ఎక్కువ మంది మహిళలను ప్రోత్సహించడానికి దీనిని ప్రవేశపెట్టారు. ఖతార్ రాష్ట్రంలో సాంప్రదాయకంగా లింగ సమానత్వం లేదు. కానీ చరిత్రలో నిలిచిపోవాలనే ఉద్దేశ్యంతో దినోత్సవాన్ని ఖతార్ రాష్ట్రం రూపొందించిందని అంటున్నారు.
సమన్యాయం ?
భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలలో ఒకటి. అపారమైన న్యాయ వ్యవస్థను కలిగి ఉంది. అయినప్పటికీ భారతదేశ హైకోర్టులలో సిట్టింగ్ జడ్జిలలో కేవలం 14% మాత్రమే మహిళలు ఉన్నారు . ఇది గత సంవత్సరాలతో పోలిస్తే (2023లో 13%, 2022లో 11%) మెరుగుదల. కానీ, సూటిగా చెప్పాలంటే, ఇది కొద్ది శాతం మాత్రమే మెరుగైనది. ప్రస్తుతం భారతదేశంలోని 754 హైకోర్టు న్యాయమూర్తులలో, కేవలం 106 మంది మహిళలు మాత్రమే ఉన్నారు . ఒక మహిళా న్యాయమూర్తి సగటు పదవీకాలం 4.5 సంవత్సరాలు . అంటే అన్ని న్యాయమూర్తుల మొత్తం సగటు కంటే ఒక సంవత్సరం తక్కువ. ఇది ఆందోళ కలిగించే అంశం . ఎందుకిలా అనే ఆలోచన వస్తే.. మహిళలకు న్యాయ విభాగంలో సరైన చోటు ఎవరూ ఇవ్వలేకపోతున్నారు.
కొన్ని హైకోర్టులు బాగానే పనిచేస్తున్నాయి. ఉదాహరణకు పంజాబ్ & హర్యానాలో 14 మంది మహిళా న్యాయమూర్తులు , మద్రాసులో 12 మంది, బొంబాయిలో 10 మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. ఢిల్లీలో 9 మంది ఉన్నారు, దేశ రాజధానితో పోలిస్తే ఇది తక్కువే. ఇతర ప్రాంతాలలో అయితే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి.
మేఘాలయ మరియు త్రిపుర రాష్ట్రాలలో మహిళా న్యాయమూర్తులు లేరు. సిక్కిం, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఒరిస్సా, ఇతరు రాష్ట్రాలలో కేవలం ఒకరే ఉన్నారు. . జమ్మూ & కాశ్మీర్, లడఖ్ లలో ఇద్దరు.. ఇది కేవలం నెంబర్స్ లెక్కపెట్టడంలో తమాషా చూడటం లా చాలా మందికి అనిపిస్తుందేమో.. కానీ న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థాయిలలో మహిళలు లేరని చెప్పడానికి నిదర్శనం. చట్టపరమైన నిర్ణయాలకు పురుషులు ఎక్కువగా బాధ్యత వహించడంలో సమస్య ఏమిటంటే, వారు ఎక్కువగా పురుషాధిక్య తీర్పులను తీసుకుంటారు. ఇది దురుద్దేశంతో కాదు కానీ అలవాటు, పక్షపాతం, చట్టపరమైన చరిత్ర అనే ఒక వాక్యాన్ని చూపి మహిళలను చిన్న సహాయక పాత్రలుగా మలిచేస్తున్నారు.
మహిళా న్యాయమూర్తులు ఎందుకు చాలా తక్కువ మంది ఉన్నారని అడిగితే అనేక రకాల నమ్మశక్యం కాని సమాధానాలు లభిస్తాయి..
మహిళలు తగినంత అర్హత కలిగి ఉండరని చాలా మంది అంటారు. కానీ చాలా లా స్కూల్స్‌లో మహిళలు ఆధిపత్యం చెలాయిస్తున్నారు, తరచుగా వారి తరగతిలో అగ్రస్థానంలో పట్టభద్రులవుతారు. సమస్య సామర్థ్యం కాదు అవకాశం లేకపోవడం. మహిళలకు న్యాయ విభాగంలో తగినంత అవకాశాలు ఇవ్వరు.
న్యాయమూర్తి పదవికి మహిళలు దరఖాస్తు చేయరని కొందరు అంటారు. కానీ.. మహిళలు దరఖాస్తు చేయకపోవడం నిజమేనట.. ఎందుకంటే అవి లభించవని మహిళలకు తెలుసట. న్యాయ నియామకాలను కొలీజియంలు (ముఖ్యంగా, కొత్త నియామకాలను సిఫార్సు చేసే సీనియర్ న్యాయమూర్తుల చిన్న సమూహాలు) నిర్ణయిస్తాయి. ఈ సమూహాలు చారిత్రాత్మకంగా పూర్తిగా పురుషులతో కూడుకున్నవి, అంటే వారు సహజంగానే ఎక్కువ మంది పురుషులను ప్రోత్సహించడం వైపు మొగ్గు చూపుతారు.
న్యాయవాద వృత్తికి సమయం ఎక్కువ కేటాయించాలని చెబుతారు. కానీ అది నిజం కాదు.. మహిళలు వంటగదిలో ఉండటమే మంచిది అనే ఒక మూర్ఖత్వపు ఆలోచన చాలామందిలో ఉండిపోయింది. ఇలా మహిళలకు చాలా విధాలుగా న్యాయ విభాగంలో అడ్డుగోడలు ఉన్నాయి. మహిళలు ఈ విభాగంలో రాణించాలంటే అందరి తోడ్పాటు, ప్రోత్సాహం తప్పకుండా లభించాలి. అప్పుడే న్యాయ దేవతలాగా, మహిళా న్యాయ మూర్తులు న్యాయాన్ని త్రాసులో సమంగా తూచగలుగుతారు.
*రూపశ్రీ.
వైసీపీ నాయకుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ ను విజయవాడ ఎస్సీఎస్టీ కోర్టు మరో రెండు వారాలు పొడిగించింది. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు దారుడు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో అరైస్టు విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ రింమాండ్ గడువు పూర్తి కావడంతో పోలీసులు వంశీని వర్చువల్ గా కోర్టులో హాజరు పరిచారు. జూమ్ కాల్ ద్వారా వంశీని విచారించిన మేజిస్ట్రేట్ వంశీ రిమాండ్ ను ఈ నెల 25 వరకూ పొడిగించారు.
వాస్తవానికి వల్లభనేని వంశీ అరెస్టు వంశీ స్వయంకృతాపరాధమే అని చెప్పవచ్చు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఆయన ముందస్తు బెయిలు పిటిషన్ పెండింగ్ లో ఉంది. తీర్పు వెలువడే వరకూ కోర్టు నుంచి ఆయన అరెస్టు కాకుండా రక్షణ కూడా ఉంది. ఆ పరిస్థితుల్లో కుట్రపూరితంగా కేసే లేకుండా చేసుకోవాలని వంశీ చేసిన ప్రయత్నమే ఆయన అరెస్టుకు దారి తీసింది. విషయంలోకి వెడితే..
తెలుగుదేశం టికెట్ పై 2019 ఎన్నికలలో గన్నవరం నుంచి విజయం సాధించి.. ఆ తరువాత వైసీపీలోకి జంప్ చేసిన వల్లభనేని వంశీ.. పార్టీ ఫిరాయించి ఊరుకోలేదు. తెలుగుదేశం నాయకులు, క్యాడర్ లక్ష్యంగా దాడులు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీనే గన్నవరం నియోజకవర్గంలో నామరూపాల్లేకుండా చేయాలన్న కుట్రలు చేశారు. తెలుగుదేశం అధినేతపైనే కాకుండా ఆయన కుటుంబ సభ్యులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యవహార శైలి కారణంగానే గన్నవరంలో 2024 ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. అసలు ఎన్నికల కంటే ముందే వంశీ తన ఓటమిని అంగీకరించేశారని చెప్పవచ్చు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని ప్రకటించి సానుభూతితో గెలిచేద్దామన్న ప్రయత్నాలూ చేశారు. అవేమీ ఫలితాన్నివ్వలేదు. జనం ఆయనను ఛీ కొట్టారు. సరే ఆ ఎన్నికలలో వంశీ పరాజయం పాలయ్యారు. వైసీపీ కూడా ఘోరంగా ఓడిపోయి..కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక చతికిల పడింది.
పార్టీ ఓటమి పాలైన క్షణం నుంచీ వంశీ దాదాపు అజ్ణాత వాసం చేస్తున్నారు. బయటకు వస్తే పోలీసులు ఎక్కడ అరెస్టు చేస్తారో అన్న భయంతో నక్కినక్కి గడుపుతున్నారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో వంశీపై కేసు నమోదైంది. ఆయనతో పాటు ఆయన అనుచరులపైనా కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన అనుచరులు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. వంశీ కూడా అరెస్టు భయంతో యాంటిసిపేటరీ బెయిలు కోసం కోర్టును ఆశ్రయించి, అరెస్టు భయం నుంచి తాత్కాలిక ఊరట పొందారు. ఆయనకు కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేయలేదు కానీ, ఆయన పిటిషన్ విచారణ పూర్తై తీర్పు వెలువడే వరకూ అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చింది. సరిగ్గా ఈ తరుణంలోనే వల్లభనేని వంశీ తన కుట్రలకు తెరతీశారు.
గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు దారుడిను కిడ్నాప్ చేసి, బెదరించి కేసు ఉపసంహరణకు అఫడివిట్ దాఖలు చేసేలా చేశారు. ఈ కేసులో ఫిర్యాదు దారుడే రివర్స్ అయ్యే సరికి అంతా వంశీపై కేసు వీగిపోయిందనే భావించారు. అయితే అధికారంలో ఉండగా ఇష్టారీతిగా వ్యవహరించినా సాగినట్లు.. అధికారం లేని సమయంలో కూడా సాగుతుందని వంశీ ఎలా భావించారో తెలియదు కానీ, ఇప్పుడు ఆయన కిడ్నాప్, బెదరింపు కేసులో అరెస్టయ్యారు. ఆ కేసులోనే ఇప్పుుడు ఆయన రిమాండ్ ను కోర్టు రెండు వారాలు పొడిగించింది.
రోజులు మారి పోతున్నాయి. మనుషులు మారి పోతున్నారు. విలువలు జారిపోతున్నాయి. ఆర్థిక, వ్యాపార కార్యకలాపాలు ఇంకా వేగంగా మారిపోతున్నాయి. మరి, ఆకాశం లో సగంగా ఉన్న మహిళలూ కాలంతో పాటే అన్నట్లు ఇంకో అడుగు ముందుకు వేస్తున్నారు. ఇంకా ఎంత కాలమని వంటింటికే పరిమితం అనుకుంటున్నారో ఏమో, పది మందికి ఆదర్శంగా నిలవాల్సిన ఏపీలో ప్రభుత్వ అధికారుల శ్రీమతులు కొందరు, అధికారం లో కి వచ్చిన నేతల ధర్మపత్నులు ఇంకొందరు అక్రమ వసూళ్ల కు నడుం బిగించారు. మాకు గోడలు లేవు అంటూ స్వయం ఉపాధి లాగ రంగంలో దూసుకు పోతున్నారు. భర్త హోదా, అధికారమే పెట్టుబడిగా కుటుంబ వ్యాపార సామ్రాజ్యాలను విస్తరిస్తున్నారు.
డబ్బు సంపాదించడం ముఖ్యం కానీ, ఎలా అన్నది కాదు కదా? అయినా, అవినీతి ఇప్పుడే పుట్టిందా ..ఏంటి? అన్నట్టు ఉంది వారి తీరు. అవును. అవినీతి ఎప్పుడు, ఎక్కడ. ఎలా పుట్టిందో ఏమో కానీ, ఇప్పడు అవినీతికి ఎల్లలు లేవు. హద్దులు,సరిహద్దులు అసలే లేవు. అవినీతి సర్వాంతరయామి. ఇక్కడ వుంది, అక్కడ లేదు అన్న సదేహం లేకుండా విశ్వం అంతటా వ్యాపించింది. భగవంతుడు ఎక్కడ లేడు అంతటా ఉన్నాడు,(ఇందుగలడందు లేడని/సందేహము వలదు చక్రి సర్వోపగతుండు) అంటాడు ప్రహ్లాదుడు. అందుకే వారు డబ్బు లోనే పరమాత్మ ను వెతుక్కుంటున్నారు.అవినీతి విషయంలో మాత్రం అలాంటి సందేహం అస్సలు అవసరం లేదు. అంతటా వుంది. అన్నిటా వుంది. సందేహం లేదు. నిజానికి, ఇప్పడు కాదు, ఎప్పుడోనే, స్వర్గీయ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ , Corruption is an international phenomenon, ‘విశ్వ లక్షణం’, విశ్వం అంతటా వుంది, మన దేశంలోనూ వుంది, ఉంటుంది, అంటూ’ అవినీతి విశ్వ రూపాన్ని వివరించారు. అంతేకాదు, అవినీతి గురించి, చొక్కాలు చింపుకోవద్దని, విపక్షాలకు జ్ఞాన బోధ కూడా చేశారు.
ఇందిరమ్మ ఇచ్చిన భరోసాతోనో ఏమో, ఆనాటి నుంచి మన దేశంలో అవినీతి, ఇంతింతై వటుడింతై అన్నట్లు పెరిగిపోతూనే వుంది. ఎసీబీలు, సిబిఐ,ఈడీ ఇంకా.. ఇతర అవినీతి నిరోధక శాఖలు, అవినీతి వ్యతిరేక చట్టాలు, ఆ చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేసే న్యాయ వ్యవస్థ, ఎన్నున్నా, ఏమి చేసినా, ఆకులు వేసే వారు వేస్తుంటే, తీసేవారు తీస్తున్నారు అన్నట్లు ఎవరి ‘పని’ వారు చేసుకు పోతున్నారు. అంతే కాదు, ఆరు నెలలు స్నేహం చేస్తే వారు వీరవుతారు అన్నట్లు న్యాయవ్యవస్థ సహా అవినీతి నిరోధక వ్యవస్థలు అన్నిటికీ కూడా అవినీతి సోకిందని,పాకిందని కథలు వింటున్నాం. అయ్య గారు చెయ్యక పోతే అమ్మ గారు చేస్తారు గా అన్నట్టుగా నడుస్తోంది వ్యవహారం. కావలసినదంతా ఒక్కటే, చేతిలో శాలువాలు, దేవుడి ప్రసాదం, ఆశీర్వచనాలు చెప్పే పంతులుగారు పక్కన ఉంటే , డబ్బు సంచి తేలిగ్గా చేతులు మారి పోతుంది. గత ప్రభుత్వం లో ఈ పద్ధతి బాగా పని చేసింది అంటున్నారు. కంచే చేను మేసిన కథలు అనేకం చూస్తూనే ఉన్నాం. వింటూనే ఉన్నాం.
అంతే కాదు, ఒకప్పడు లంచం అంటే ఏదో చాటు మాటు వ్యవహారంగా సాగేది. కిందిస్థాయి ఉద్యోగులు, వేడి నీళ్ళకు చలి నీళ్ళు’ అన్నట్లు బల్ల కింద చేతులు పెట్టి పదీ పరక పుచ్చుకోవడం ఉండేది. అందులోనే, అంతో ఇంతో పై అధికారుల చేతులు తడపడం ఉంటే ఉండేదేమో. నిజంగానే, అప్పట్లో ఇందిరా గాంధీ అన్నట్లుగా, ఇప్పుడు అదో పెద్ద సమస్య కాదు. అందుకే, అప్పట్లో సినిమాల్లోనూ, లంచాలు ఇచ్చి పుచ్చుకోవడాలు కామెడీ ట్రాక్ కు మాత్రమే పరిమితంగా ఉండేది.అలా కామెడీ, ట్రాక్ కు మాత్రమే పరిమితం అయిన లంచావతారాలు తర్వాత తర్వాత టైటిల్’ రోల్ కి చేరుకున్నాయి. దాసరి నారయణ రావు, ఏకంగా ‘లంచాచాతరం’ టైటిల్ తో ఫుల్ లెంగ్త్ సినిమానే తీశారు. అలాగే, అవినీతిని ఎండగడుతూ, సమాజాన్ని చైతన్య పరిచే ప్రయత్నంలో భాగంగా ఠాగూర్ , భారతీయుడు , అపరిచితుడు వంటి సినిమాలు వచ్చాయి. సినిమాల దారి సినిమాలది అవినీతి దారి అవినీతిది అన్నట్లు రియల్ స్టోరీ నడుస్తోందనుకోండి అది వేరే విషయం.
అదెలా ఉన్నా ఇప్పడు అవినీతి కొత్త పుంతలు తొక్కుతోంది. మంత్రుల పేషీలు, ఐఎఎస్ చాంబర్లు దాటి, ఉన్నతాధికారుల వంటిటికీ చేరింది. అవును. ఆంధ్ర ప్రదేశ్ లో అందరూ కాదు కానీ,కొందరుసీనియర్ అధికారులు, నిండా మునిగినాక చలేమిటి,అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మొదలైన అవినీతి అరాచకత్వం,ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. గతంలో చేసిన తప్పులకు కొందరు ఐఎఎస్ అధికారులు కేసులు ఎదుర్కున్నారు. అందులో కొందరు జైలు ఊచలు లెక్క పెట్టారు. అయినా, ఆ ఐఎఎస్ ల తీరు మారలేదు. ఇప్పడు అధికారుల అవినీతికి సంబంధించి వస్తున్న చిత్ర విచిత్ర కథలు, కథనాలు విస్మయానికి గురిచేస్తున్నాయి.
అన్నిటినీ మించి కొందరు అధికారుల అవినీతిని ఫ్యామిలీ బిజినెస్ గా మార్చేశారు. ఇంకొందరు అధికారుల భార్యలు, తమ భర్త హోదా పెట్టుబడిగా, హోటళ్ల లో మీటింగ్‌లు పెట్టి , స్వయం ఉపాధి లాగా కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. ఏకంగా ఏ పనికి ఎంత రేటన్నది ఫిక్స్ చేసి, రేట్ కార్డు ప్రకారం, పనిచేస్తున్నట్లు జనం కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. నియంత్రించాల్సిన పాలకులే ఎన్నికల్లో పోయిన సొమ్ము రాబట్టు కునే పనిలో ఉంటే , దీనికి అడ్డు చెప్పేవారు ఎవరు? సీట్లు, ఓట్లు కోసం కోట్లు ఖర్చు పెట్టి చేతులు ముడుచుకుని కూర్చుంటే రేపటి పరిస్థితి ఏమిటి? అని ఓపెన్ గానే ప్రశ్నిస్తున్నారు. మంచి పోస్టులు కోసం అధికారుల దగ్గరే డబ్బులు వసూలు చేస్తున్న నేతలు మాత్రం ఏమి అదుపు చేస్తారు? ఎవరిని చేస్తారు? కంచే చేను మేస్తుంటే, మిగతా వారు దూడలు గా మారి పోరా? అవినీతి కొత్త కాదు కానీ , మార్గాలే కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రేపటి కోసం ఏం చేయగలం.
టిడిపి కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు వల్లభనేని వంశీ కి భారీ షాక్ తగిలింది. ఆయన రిమాండ్ ను ఎస్సి ఎస్టి కోర్టు మరోసారి పొడిగించింది. వంశీని వర్చువల్ గా జైలు అధికారులు జడ్జి ఎదుట హాజరుపర్చారు. ఈ నెల 25 వరకు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వంశీని ఎపి పోలీసులు గత నెలలో హైద్రాబాద్ లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇయర్ ఫోన్స్ ఇప్పటి ప్రజల జీవనశైలిలో భాగం అయిపోయాయి. ఉదయాన్నే వాకింగ్, జాకింగ్ చేస్తున్నా, ప్రయాణాలు చేస్తున్నా, ఎవరితో అయినా ఫోన్ మాట్లాడుతున్నా.. ఇలా చాలా సందర్భాలలో ఇయర్ ఫోన్స్ వాడకం ఎక్కువగా ఉంటుంది. ఇక నిరంతరం ఫోన్ లు మాట్లాడే వృత్తి లేదా వాతావరణంలో ఉండే వారు రోజులో చాలా గంటల సేపు ఇయర్ ఫోన్స్ వాడుతుంటారు. ఇక డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ లు రిసీవ్ చేసుకుని మాట్లాడటానికి వీలు లేని వారు కనీసం ఒక చెవికి అయినా ఇయర్ ఫోన్ లేదా ఇయర్ బడ్ పెట్టుకుని మాట్లాడుతూ డ్రైవ్ చేస్తారు. చాలా మంది రోజులో 10-12 గంటలు ఇయర్ ఫోన్స్ మాట్లాడుతూ గడిపేస్తారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే పెద్ద సౌండ్స్ తో ఇయర్ ఫోన్స్ వాడేవారు కొన్ని నిజాలు తెలుసుకోవాలి. అవేంటంటే..
ఇయర్‌ఫోన్ వాడకం వల్ల వినికిడి ఆరోగ్యంపై ప్రభావం పెరుగుతోంది. "70 డెసిబెల్స్ (dB) కంటే ఎక్కువ శబ్ద స్థాయిలకు ఎక్కువ కాలం గురికావడం శాశ్వత వినికిడి లోపానికి దారితీస్తుంది. అయితే 100 dB కంటే ఎక్కువ శబ్దాలకు అకస్మాత్తుగా గురికావడం తక్షణ చెవుడుకు కారణమవుతుంది." రద్దీగా ఉండే వీధులు, 80-100 dB ట్రాఫిక్, 120 dB కంటే ఎక్కువ బిగ్గరగా ఉండే కచేరీలు లేదా పటాకులు మోత మొదలైన వాటి కారణంగా శబ్ద స్థాయిలు పెరుగుతాయి. ఇది వినికిడి లోపానికి కారణమవుతుంది. వీటికి తోడు ఇయర్ ఫోన్ ల వాడకం పెరిగితే తీవ్రమైన సమస్యలు వస్తాయి.
ఇయర్ ఫోన్స్ నేరుగా చెవి లోకి ధ్వనిని పంపుతాయి, దీని వలన వినికిడి లోపం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. చాలా మంది తెలియకుండానే తీవ్రమైన శబ్దానికి గురవుతారు. తరచుగా ఎక్కువసేపు సంగీతం లేదా కాల్‌లను ఎక్కువసేపు వింటారు. మరికొందరికి సంగీతం అనేది ఎక్కువ శబ్దం పెట్టుకుని ఆస్వాదించడం అనే అలవాటు కూడా ఉంటుంది. " 60% కంటే ఎక్కువ వాల్యూమ్లలో ఇయర్ఫోన్లను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల దీర్ఘకాలిక నష్టం జరుగుతుంది".
రూల్ ఆఫ్ 60 అంటే..
"60 నియమం" అంటే శబ్దాన్ని 60% కంటే తక్కువగా ఉంచడం. ఇయర్‌ఫోన్ వినియోగాన్ని రోజుకు 60 నిమిషాలకు మించకుండా పరిమితం చేయడం. అదనంగా ఓవర్-ఇయర్ హెడ్ఫోన్లు సురక్షితమైన ప్రత్యామ్నాయం, ఎందుకంటే అవి ఇన్-ఇయర్ పరికరాలు చేసే విధంగా చెవి లోకి ధ్వనిని లోతుగా ప్రసారం చేయవు.
అధిక వాల్యూమ్ నష్టం..
ఎక్కువసేపు 85dm కంటే ఎక్కువ వాల్యూమ్‌లో సంగీతాన్ని వింటే, అది శాశ్వత వినికిడి లోపానికి కారణమవుతుంది.
ఇయర్ఫోన్లను విరామం లేకుండా నిరంతరం ఉపయోగించడం వల్ల చెవికి ఒత్తిడి వస్తుంది, దీని వలన అసౌకర్యం, తాత్కాలిక వినికిడి లోపం సంభవించవచ్చు.
హెడ్ఫోన్లను ఉపయోగిస్తున్నప్పుడు, ఇయర్‌బడ్‌లు కర్ణభేరికి దగ్గరగా ఉంటాయి. ఇది ధ్వని ఒత్తిడిని తీవ్రతరం చేస్తుంది. దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతుంది.
బిగ్గరగా సంగీతం వినడమే కాకుండా, ఇయర్ఫోన్లను ఇతరులకు ఇవ్వడం, ఇతరులవి తీసుకుని వాడటం వంటివి లేదా ఎక్కువసేపు వాడటం వల్ల కూడా చెవిలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.
*రూపశ్రీ.
వేసవి కాలం ప్రారంభం కావడంతోనే చెరకు రసం కోసం డిమాండ్ కూడా పెరుగుతుంది. చెరకు రసం సహజమైన, ఆరోగ్యకరమైన పానీయంగా పరిగణించబడుతుంది. ఇది వేసవిలో శరీరాన్ని చల్లబరుస్తుంది. శక్తిని అందిస్తుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, సహజ చక్కెరలు ఉంటాయి, ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అయితే, చెరకు రసం అందరికీ ప్రయోజనకరంగా ఉండదు కొంతమంది దీనిని తాగకుండా ఉండటమే మంచిదని ఆహార నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇది వారి ఆరోగ్యానికి హానికరం కావచ్చు. చెరకు రసం ఎవరు తాగకూడదో.. ఎందుకు తాగకూడదో.. తెలుసుకుంటే..
డయాబెటిస్ రోగులు..
చెరకు రసంలో అధిక మొత్తంలో సహజ చక్కెర ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది . డయాబెటిస్ ఉన్న రోగులు తమ రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవాలని వైద్యులు చెబుతారు. అటువంటి పరిస్థితిలో చెరకు రసం తాగడం వల్ల వారి చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి హానికరం. అయితే.. డయాబెటిస్ ఉన్న రోగులు చెరకు రసం తాగాలనుకుంటే వైద్యుడిని సంప్రదించి చాలా తక్కువ పరిమాణంలో తాగాలి.
ఊబకాయం..
చెరకు రసంలో కేలరీలు, చక్కెర పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నా లేదా ఊబకాయంతో ఉన్నా, చెరకు రసం తాగడం సరైనది కాదు. దీన్ని ఎక్కువగా తాగడం వల్ల బరువు పెరగవచ్చు. అధిక రక్తపోటు, గుండె జబ్బులు, మధుమేహం వంటి ఊబకాయం సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది .
దంత సమస్యలు..
చెరకు రసంలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది, ఇది దంతాలకు హానికరం. బలహీనమైన దంతాలు లేదా కుహరం సమస్యలు ఉంటే చెరకు రసం తాగడం మానుకోవాలి. చక్కెర దంతాలలో బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, ఇది దంత సమస్యలను మరింత పెంచుతుంది.
జీర్ణ సమస్యలు..
చెరకు రసం చల్లగా ఉంటుంది. ఇది కొంతమంది జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. గ్యాస్, అసిడిటీ లేదా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) వంటి కడుపు సమస్యలు ఉంటే, చెరకు రసం తాగడం మానుకోవాలి. ఇది కడుపులో చల్లదనాన్ని కలిగిస్తుంది, జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, ఇది సమస్యలను పెంచుతుంది.
మూత్రపిండ వ్యాధి..
చెరకు రసంలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. మూత్రపిండాల వ్యాధి ఉన్న రోగులు పొటాషియంను పరిమిత పరిమాణంలో తీసుకోవాలి, ఎందుకంటే మూత్రపిండాలు శరీరం నుండి అదనపు పొటాషియంను తొలగించలేవు. అటువంటి పరిస్థితిలో చెరకు రసం తాగడం వల్ల వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది.
*రూపశ్రీ.
విటమిన్ సి మన శరీరానికి అవసరమైన పోషకం. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, శరీరంలోని యాంటీఆక్సిడెంట్ల లోపాన్ని తీర్చడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చాలామంది ప్రజలు నారింజ పండ్లను విటమిన్ సి కి ఉత్తమ వనరుగా భావిస్తారు. కానీ కొన్ని పండ్లు నారింజ కంటే ఎక్కువ విటమిన్ సి ని అందిస్తాయి. విటమిన్ సి స్థాయిలో నారింజను కూడా అధిగమించే ఆ 4 పండ్లు అయిన సహజ విటమిన్ సి ఆహారాల గురించి తెలుసుకుంటే..
ఉసిరి..
ఉసిరి విటమిన్ సి ఉత్తమ వనరుగా పరిగణించబడుతుంది. ఒక నారింజ పండు కంటే ఒక ఉసిరిలో దాదాపు 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. 100 గ్రాముల ఉసిరికాయలో దాదాపు 600-700 మి.గ్రా విటమిన్ సి లభిస్తుంది. అయితే నారింజలో ఈ పరిమాణం 50-60 మి.గ్రా మాత్రమే. ఉసిరిలో విటమిన్ సి మాత్రమే కాకుండా, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఉసిరిని పచ్చిగా, జ్యూస్, చట్నీ లేదా పొడి రూపంలో తినవచ్చు.
కెవి..
కివి ఒక చిన్న పండు. కానీ దాని పోషక విలువలు చాలా ఎక్కువ. ఒక కివిలో నారింజ పండులో ఉండే విటమిన్ సి దాదాపు రెండు రెట్లు ఎక్కువ. 100 గ్రాముల కివిలో దాదాపు 90-100 మి.గ్రా. విటమిన్ సి లభిస్తుంది. కివిలో ఫైబర్, పొటాషియం, ఇతర యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి . కివిని నేరుగా తినవచ్చు లేదా ఫ్రూట్ సలాడ్‌లో కలపవచ్చు.
స్ట్రాబెర్రీ..
స్ట్రాబెర్రీలు రుచికరమైనవి మాత్రమే కాదు, అవి విటమిన్ సి కి గొప్ప మూలం కూడా. 100 గ్రాముల స్ట్రాబెర్రీలో 60-70 మి.గ్రా విటమిన్ సి ఉంటుంది. ఇది నారింజ కంటే కొంచెం ఎక్కువ. స్ట్రాబెర్రీలలో మాంగనీస్, ఫోలేట్, పొటాషియం కూడా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడానికి, ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి . స్ట్రాబెర్రీలను తాజా పండ్లు, స్మూతీలు లేదా డెజర్ట్‌గా తినవచ్చు.
బొప్పాయి..
బొప్పాయి జీర్ణవ్యవస్థకు మేలు చేయడమే కాకుండా విటమిన్ సి అధికంగా ఉండే పండు. 100 గ్రాముల బొప్పాయిలో దాదాపు 60-70 మి.గ్రా విటమిన్ సి లభిస్తుంది. ఇది నారింజ కంటే ఎక్కువ. బొప్పాయిలో విటమిన్ ఎ, ఫైబర్, ఎంజైమ్‌లు కూడా ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. బొప్పాయిని పచ్చిగా, పండిన తరువాత రెండు విధాలుగా కూడా తినవచ్చు.
*రూపశ్రీ.