LATEST NEWS
శివకాశి ఎమ్మెల్యేగా కీర్తన సంపత్ సంచలనం..
తమిళనాట తెలుగులో ప్రచారం..
శివకాశికి తొలి మహిళా ఎమ్మెల్యేగా రికార్డు..
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ, ఒక తెలుగు మహిళ సంచలన విజయాన్ని నమోదు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. కోలీవుడ్ స్టార్ విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ తరపున శివకాశి నియోజకవర్గం నుండి పోటీ చేసిన కీర్తన సంపత్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. రాజకీయ ఉద్దండులు తలపడిన ఈ ఎన్నికల్లో ఒక సామాన్య నేపథ్యం ఉన్న తెలుగు మహిళ విజయం సాధించడం ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్ గా మారింది.
కీర్తన సంపత్ తన ఎన్నికల ప్రచారంలో అనుసరించిన వ్యూహం ఆమెను విజయతీరాలకు చేర్చింది. శివకాశి ప్రాంతంలో గణనీయంగా ఉన్న తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆమె 'తెలుగు'నే ఆయుధంగా మలుచుకున్నారు. ఇంటింటికీ వెళ్లి స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతూ, స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా తెలుగు మూలాలున్న కుటుంబాలతో ఆమె పెంచుకున్న ఆత్మీయ బంధం ఓట్ల రూపంలో మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పార్టీ అధినేత విజయ్ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీర్తన సఫలమయ్యారు. విద్య, వైద్యం మరియు ఉపాధి అవకాశాలపై ఆమె ఇచ్చిన హామీలకు యువత మరియు మహిళా ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. శివకాశి లాంటి కీలకమైన పారిశ్రామిక నియోజకవర్గంలో పట్టు సాధించడం అంటే సామాన్యమైన విషయం కాదు, కానీ తనదైన శైలిలో ప్రచారాన్ని నిర్వహించి ప్రత్యర్థులను చిత్తు చేశారు.
ఈ విజయంపై కీర్తన సంపత్ స్పందిస్తూ.. ఇది తన గెలుపు మాత్రమే కాదని, తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్క తెలుగు మరియు తమిళ సోదర సోదరీమణుల విజయం అని పేర్కొన్నారు. శివకాశి అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని, ముఖ్యంగా కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తానని ఆమె హామీ ఇచ్చారు. విజయ్ నాయకత్వంలో తమిళనాడులో నవశకం ప్రారంభమైందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త పార్టీ అభ్యర్థికి, అదీ తెలుగు ప్రచారంతో ఇంతటి ఆదరణ లభించడం విశేషం. ఇది భవిష్యత్తులో తమిళ రాజకీయాల్లో భాషా పరమైన వైవిధ్యానికి మరియు ప్రాంతీయ బంధాలకు అద్దం పడుతోంది.
రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా కీర్తన సంపత్ శివకాశి ముఖచిత్రాన్ని ఎలా మారుస్తారో చూడాలి. స్థానికంగా పెండింగ్‌లో ఉన్న మౌలిక సదుపాయాల కల్పన మరియు బాణాసంచా పరిశ్రమ కార్మికుల భద్రత వంటి అంశాలపై ఆమె తక్షణమే దృష్టి సారిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. ఒక తెలుగు మహిళగా తమిళ అసెంబ్లీలో ఆమె గళం ఏ విధంగా వినపడనుందో వేచి చూడాలి.
పశ్చిమ బెంగాల్ సీఎం రేసులో ముందు వరుసలో కనిపిస్తున్న సువేందు అధికారి ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ఈ సందర్భంగా సువేందు స్పందిస్తూ.. తమ తదుపరి టార్గెట్ ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలేనని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. బీజేపీకి ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ అధినేతను ఉద్దేశించి.. మమతా బెనర్జీ, తేజస్వి యాదవ్, రాహుల్ గాంధీల పనైపోయిందని.. తర్వాతి వంతు అఖిలేశ్ యాదవేనని హెచ్చరించారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీతో పోల్చారు సువేందు. ఆప్‌లాగే టీఎంసీ కూడా అవినీతిమయమైందని, పతనం ఖరారైందని విమర్శించారు. ఆ పార్టీకి ఎలాంటి సిద్ధాంతాలు లేవని.. అందుకే నందిగ్రామ్ ప్రజలు మరోసారి తనను గెలిపించారన్నారు. దీదీ రాజకీయ బహిష్కరణ ఖాయమైందని పేర్కొన్నారు. త్వరలోనే టీఎంసీ ఎంపీలు బీజేపీలో చేరతారని జోస్యం చెప్పిన సువేందు అధికారి.. ఇక తమ దృష్టిపి సమాజ్‌వాదీ పార్టీపై కేంద్రీకరిస్తామని అఖిలేశ్ యాదవ్‌కు హెచ్చరిక జారీచేశారు.
ఒకప్పుడు మమతా బెనర్జీకి కుడిభుజంగా.. తూర్పు మిడ్నాపూర్ వంటి జిల్లాలలో టీఎంసీ ఎదుగుదలలో సువేందు కీలక పాత్ర పోషించారు. కానీ.. 2020లో మమతతో విబేధించి బీజేపీలో చేరారు. ఆపై ఆమె ఓటమిని శాసించారు. నందిగ్రామ్‌లో టీఎంసీకి చెందిన పవిత్ర కర్‌ను కూడా సువేందు ఓడించారు. ఇప్పుడు బీజేపీ సీఎం రేసులో ఆయన పేరు ముందు వరుసలో ఉంది.
అస్సాం మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అక్రమాలకు పాల్పడిందనీ, పద్ధతి ప్రకారం ఓట్ల చోరీని అమలు చేసిందనీ ధ్వజమెత్తారు. కేంద్రంలోని అధికార పార్టీ తన బలాన్ని ఉపయోగించి ఓటర్ల తీర్పును తారుమారుచేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు. ఈ మేరకు సోమవారం (మే 4) తన అధికారిక 'ఎక్స్' ఖాతాలో చేసిన ఓ పోస్టులో.. పశ్చిమ బెంగాల్‌లో వందకు పైగా సీట్లలో ఫలితాలను బీజేపీ తారుమారు చేసిందన్న తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపణలతో తాను ఏకీభవిస్తున్నానని పేర్కొన్నారు. ఇది బీజేపీకి తెలిసిన పాత వ్యూహమేనని, గతంలో మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర రాష్ట్రాలతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇదే తరహా పద్ధతిని చూశామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బీజేపీ ఎన్నికలనే కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలను పరిరక్షించే వ్యవస్థల విశ్వసనీయతను కూడా దెబ్బతీస్తోందని ఆయన ధ్వజమెత్తారు.
ALSO ON TELUGUONE N E W S
టాలీవుడ్ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న తాజా చిత్రం 'లెనిన్' (Lenin) నుండి ఒక ప్రత్యేక అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఆమె పోషిస్తున్న 'భారతి' పాత్రకు సంబంధించిన బర్త్‌డే పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేస్తూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపింది.
మెస్మరైజింగ్ లుక్‌లో భారతి
తాజాగా విడుదలైన ఈ పోస్టర్‌లో భాగ్యశ్రీ బోర్సే అత్యంత వైవిధ్యంగా కనిపిస్తోంది. నాటకంలోని రాజు పాత్రను తలపిస్తున్న ఆమె ఆహార్యం, గంభీరమైన రూపం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
భాగ్యశ్రీ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు 'లెనిన్' మూవీ టీమ్ హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేసింది. భారతి పాత్ర అందరినీ మంత్రముగ్ధులను చేస్తుందని చిత్ర యూనిట్ పేర్కొంది.
జూన్ 26న విడుదల
అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న 'లెనిన్' చిత్రానికి మురళి కిషోర్ అబ్బూరు దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జూన్ 26న 'లెనిన్' మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
అఖిల్, భాగ్యశ్రీ ఇద్దరూ కూడా ఒక మంచి కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. 'లెనిన్' రూపంలో వారు కోరుకుంటున్న విజయం దక్కుతుందేమో చూడాలి.
ఎందుకో తెలియదు గాని జాన్వీ కపూర్(Janhvi Kapoor)తన స్నేహితుడు శిఖర్ పహారియాతో కలిసి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందనే న్యూస్ గత కొన్ని రోజుల నుంచి చాలా కాన్ఫిడెన్స్ గానే చక్కర్లు కొడుతుంది. కొంత ముందైతే తమకి పెళ్లి ఇన్విటేషన్ వచ్చిన వాళ్లల్లా ఆ ఇద్దరి వివాహం తిరుపతిలో జరగబోతుందనే వార్తలని కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో జాన్వీ తండ్రి బోనీకపూర్ చెప్పిన మాటలతో వాళ్ళు జాన్వీ పెళ్లి భోజనం తినాలని ఆశపడే వాళ్ళకి టైం పట్టేలా ఉంది.
బోనీ కపూర్ కపూర్ మాట్లాడుతు జాన్వీ పెళ్లి వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే. జాన్వీ తన కెరీర్‌పైనే పూర్తి దృష్టి సారించింది. పెళ్లి గురించి ఇప్పుడే ఎటువంటి ప్రణాళికలు లేవని చెప్పుకొచ్చాడు. దీంతో పెళ్లి రూమర్స్ సృషించ వాళ్ళకి 'బాగా చెప్పాడు కదా, అర్థమైందా, సరిపోయిందా అనే డైలాగ్స్ తో కూడిన మీమ్స్ ఎదురవుతున్నాయి.
Also read: Peddi: పెద్ది అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్.. 8 PM EST,7 PM CST, 5 PM PST
బోనీ కపూర్(Boney kapoor)చెప్పినట్టుగానే జాన్వీ పెద్ది(Peddi)తో బిజీగా ఉంది. దేవర తో అదరగొట్టిన జాన్వీ పెద్ది తో తన తల్లి అతిలోక సుందరి శ్రీదేవి స్థానంలో కూర్చోవాలని ఆశపడుతోంది. ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాలు చూస్తుంటే అచ్చాయమ్మా గా పెద్దిని తన అందంతో, చేష్టలతో మూడు చెరువుల నీళ్లు తాగించేలా ఉంది. దీంతో ఆటోమేటిక్ గా ప్రేక్షకులు తన అధీనంలో ఉండటం పక్కా. తన కోరిక నెరవేరడం పక్కా . పెద్ది జూన్ 4 న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. 7 thనుంచి ఓవర్ సీస్ బుకింగ్ స్టార్ట్ కానున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న 'స్పిరిట్' (Spirit) సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి వచ్చే ప్రతి న్యూస్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది.
భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం సన్నాహాలు
తాజా సమాచారం ప్రకారం, చిత్ర బృందం ఇప్పుడు ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించడానికి సిద్ధమవుతోంది. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం మే 7 నుండి రిహార్సల్స్ ప్రారంభం కానున్నాయి. ప్రభాస్ స్వయంగా ఈ ప్రిపరేషన్‌లో పాల్గొని, ఫైట్ మాస్టర్ల పర్యవేక్షణలో శిక్షణ తీసుకోనున్నారు. ఈ భారీ సీక్వెన్స్ షూటింగ్ మే మధ్యలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
సందీప్ రెడ్డి మార్క్ యాక్షన్
'అర్జున్ రెడ్డి', 'యానిమల్' చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని క్రియేట్ చేసుకున్న సందీప్ వంగా, 'స్పిరిట్' సినిమాలో ప్రభాస్‌ను మునుపెన్నడూ చూడని పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించబోతున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సీన్లు చాలా 'రా'గా, 'ఇంటెన్స్'గా ఉంటాయని సమాచారం. అందుకే ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రత్యేకంగా రిహార్సల్స్ ప్లాన్ చేశారట.
ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, 'స్పిరిట్' కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నారు. అందులో భాగంగానే రిహార్సల్స్ లో కూడా పాల్గొంటున్నారు. ప్రభాస్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న ఈ 'స్పిరిట్' మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
రైరైరా.. రైరారా అని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)అనడమే కాదు అభిమానులు కూడా రైరైరా.. రైరారా అని అంటున్నారు. ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది.పెద్ది నుంచి అదిరిపోయే అప్ డేట్ ని మేకర్స్ వెల్లడి చేశారు.
నార్త్ అమెరికాలో మే 7రాత్రి 8 గంటలకి ESTనుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి ఆ తర్వాత 7 PM CST , 5 PM PST కి షోస్ స్టార్ట్ కానున్నాయి. EST , CST ,PST అంటే ఓవర్ సీస్ లో ఉన్న ఏరియాస్. ఈ మేరకు అధికారకంగా మేకర్స్ పోస్టర్ రిలీజ్ తో ప్రకటించారు అంటే రిలీజ్ కి దాదాపు నెల రోజుల ముందే టికెట్ కౌంటర్లు ఓపెన్ అవుతుండటం విశేషం. దీన్ని బట్టి పెద్ది కోసం ఫ్యాన్స్ ఎంత వెయిటింగ్ తో ఉన్నారో అర్ధమవుతుంది. ఎన్నో హిట్ చిత్రాలని ఓవర్ సీస్ లో డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రముఖ పంపిణీ సంస్థ ప్రత్యంగిర సినిమాస్ పెద్దిని రిలీజ్ చేస్తుంది.
Also read: Palash Muchhal: ప్రముఖ సంగీత దర్శకుడిపై ఎస్ సి, ఎస్ టి కేసు.. ఫిర్యాదు చేరిన ప్రముఖ నటుడు
వరల్డ్ వైడ్ గా జూన్ 4న థియేటర్లలోకి రానున్న పెద్ది, జూన్ 3న గ్రాండ్ ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా తన రచ్చ స్టార్ట్ చేయనుంది. 1980ల నాటి ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో సాగే పెద్ది లో చరణ్ కి ముక్కు తాడు వేసే అచ్చాయమ్మా గా జాన్వీ కపూర్ చేస్తుండగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గౌరీ నాయుడు గా నెగిటివ్ రోల్ లో కనిపించనున్నాడు.జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక రోల్స్. ఏఆర్ రెహమాన్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన అన్ని సాంగ్స్ సూపర్ హిట్స్ గా నిలవడంతో మిగతా సాంగ్స్ కోసం అందరు వెయిటింగ్. మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ తో కలుపుకొని వృద్ధి సినిమాస్ నిర్మిస్తుండగా బుచ్చిబాబు(Buchibabu)దర్శకుడు అనే విషయం తెలిసిందే.
టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో అగ్ర నిర్మాతగా పేరుగాంచిన, సూపర్‌గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్‌బీ చౌదరి (RB Choudary) మంగళవారం(మే 5) జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే.
భారతీయ చిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా దక్షిణాదిలో 'సూపర్ గుడ్ ఫిలిమ్స్' బ్యానర్‌కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ సంస్థ అధినేత ఆర్.బి. చౌదరి కుటుంబ కథా చిత్రాలకు, అభిరుచి గల సినిమాలకు పెట్టింది పేరు. దశాబ్దాల కాలంగా తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను అందించిన ఆయన.. ఎందరో దర్శకులను, నటీనటులను పరిశ్రమకు పరిచయం చేశారు.
తెలుగులో సూపర్ గుడ్ ఫిలిమ్స్ ప్రయాణం
ఆర్.బి. చౌదరి తెలుగులో కేవలం డబ్బింగ్ సినిమాలే కాకుండా, నేరుగా భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించి ఘనవిజయాలను అందుకున్నారు. ఆయన నిర్మించిన సినిమాల్లోని భావోద్వేగాలు సగటు ప్రేక్షకుడిని బాగా ఆకట్టుకుంటాయి.
ఆయన నిర్మించిన కొన్ని ముఖ్యమైన తెలుగు సినిమాలు:
సుస్వాగతం (1998): పవన్ కళ్యాణ్ కెరీర్‌లో నిలిచిపోయే ప్రేమకథా చిత్రం.
సూర్యవంశం (1998): వెంకటేష్ ద్విపాత్రాభినయంలో వచ్చిన ఈ సినిమా ఒక క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.
రాజా (1999): వెంకటేష్ హీరోగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. దీనికి ఉత్తమ చిత్రంగా ఫిలింఫేర్ అవార్డు కూడా దక్కింది.
నువ్వు వస్తావని (2000): నాగార్జున హీరోగా వచ్చిన ఈ మ్యూజికల్ హిట్ యువతను విపరీతంగా ఆకట్టుకుంది.
నిన్నే ప్రేమిస్తా (2000): శ్రీకాంత్, సౌందర్య ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో నాగార్జున ప్రత్యేక పాత్ర పోషించడం విశేషం.
ప్రియమైన నీకు (2001): తరుణ్ కెరీర్‌లో ఒక మైలురాయి లాంటి సినిమా.
సింహరాశి (2001): రాజశేఖర్ హీరోగా ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
శివరామరాజు (2002): అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో వచ్చిన ఈ భారీ మల్టీస్టారర్ మంచి విజయం సాధించింది.
సంక్రాంతి (2005): కుటుంబ విలువల నేపథ్యంలో వెంకటేష్ హీరోగా వచ్చిన మరో క్లాసిక్ హిట్.
రచ్చ (2012): రామ్ చరణ్ హీరోగా నిర్మించిన ఈ మాస్ ఎంటర్‌టైనర్ భారీ వసూళ్లను రాబట్టింది.
గాడ్ ఫాదర్ (2022): మెగాస్టార్ చిరంజీవితో కలిసి నిర్మించిన ఈ భారీ ప్రాజెక్ట్ ఆయన కెరీర్‌లో ఒక ప్రత్యేక చిత్రం.
వీటితో పాటు 'నేను ప్రేమిస్తున్నాను', 'శీను', 'స్నేహమంటే ఇదేరా', 'అన్నవరం', 'గోరింటాకు', 'భీమిలి కబడ్డీ జట్టు' వంటి వైవిధ్యమైన చిత్రాలను ఆయన తెలుగు ప్రేక్షకులకు అందించారు.
ఆర్.బి. చౌదరి కేవలం ఒక నిర్మాత మాత్రమే కాదు, సినిమా విజయ సూత్రాన్ని క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి. నూతన దర్శకులను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఆయన మరణం చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. తెలుగు సినిమా చరిత్రలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ అందించిన ఈ చిత్రాలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి.
మరిన్ని అద్భుతమైన తెలుగు సినిమాలను చూడటం కోసం తెలుగువన్ (TeluguOne) యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు.
టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.
జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్‌లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్‌డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్‌స్టర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు.
చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్ విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది.
ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.
అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి 15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్ పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు ఒకే సారి ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.
రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .
దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.
ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు. వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి. అయితే జీవితంలో విజయం సాధించాలంటే.. కొన్ని పనులను అస్సలు వాయిదా వేయకూడదని చెబుతాడు ఆచార్య చాణక్యుడు. ఆచార్య చాణక్యుడు గొప్ప ఆధ్యాత్మిక వేత్త, తత్వవేత్త.. మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలను ఆయన రెండు వేల సంవత్సరాల క్రితమే ఎంతో క్షుణ్ణంగా వివరించి చెప్పాడు. లైఫ్ లో సక్సెస్ కావాలంటే ఏ పనులను వాయిదా వేయకూడదు? ఆచార్య చాణక్యుడు ఏం చెప్పాడు? తెలుసుకుంటే..
ముఖ్యమైన పనులు..
ఒక మనిషి సక్సెస్ ఫుల్ వ్యక్తి కావాలంటే ఆ వ్యక్తి తన ముఖ్యమైన పనులకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. తమకు ముఖ్యమైన పనుల విషయంలో వారు చూపించే చురుకుదనమే వారిని ఆ పనిలో విజయం సాధించేలా చేస్తుంది.ముఖ్యమైన పనులు ఏవైనా సరే.. మళ్లీ చేద్దాంలే అనే ఆలోచనతో వాయిదా వేయకూడదు. సమయం చాలా విలువైన ఆస్తి అని, పనులను వాయిదా వేయడం వల్ల ఎంతో గొప్ప ఆస్తిని కోల్పోయినట్టేనని, దీని వల్ల ఒత్తిడి పెరగడమే కాకుండా భవిష్యత్తులో పెద్ద సమస్యలు కూడా తలెత్తుతాయని ఆచార్య చాణక్యుడు చెబుతాడు.
నేర్చుకోవడం..
నేర్చుకోవడాన్ని అభ్యాసం అని అంటారు. చాణక్యుడి ప్రకారం, జ్ఞానమే మనిషి నిజమైన శక్తి. విజయవంతమైన వ్యక్తులు నేర్చుకోవడం ఎప్పుడూ ఆపరు. వారు ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి, తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కృషి చేస్తారు. ఎందుకంటే, ఈ రోజు తాము సంపాదించే జ్ఞానమే రేపటి విజయానికి పునాది వేస్తుందని వారికి తెలుసు.
కష్టం..
విజయానికి కష్టపడటమే ఏకైక, ప్రధాన మార్గం. సక్సెస్ కావాలంటే.. పనులను భారంగా కాకుండా.. వాటిని చాలెంజ్ గా తీసుకుని పూర్తీ చేయాలి. తమకు ఎదురొచ్చే ప్రతి పని, తమ ఎదుగుదలకు ఒక గొప్ప మార్గంగా చూడాలి. సోమరితనం , వాయిదా వేయడం మానవ పతనానికి దారితీస్తాయి. అందుకే చాణక్యుడు ప్రతి పనిని సమయానికి పూర్తి చేయమని సలహా ఇస్తాడు.
తప్పులు..
తప్పు చేసినప్పుడు దాన్ని సరిదిద్దుకోకుండా పారిపోవడం వైఫల్యానికి ప్రదాన కారణం అవుతుంది. తన తప్పుల గురించి తెలుసుకుని, వెంటనే వాటిని అంగీకరించి, ఏమాత్రం సమయం వృథా చేయకుండా సరిదిద్దుకునే వ్యక్తి జీవితంలో విజయం సాధించగలుగుతాడు. తప్పులను సకాలంలో సరిదిద్దుకోకపోతే, అవి భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీయవచ్చు.
అవకాశాలు..
జీవితంలో సువర్ణావకాశాలు కాలంతో పాటు వస్తూ ఉంటాయి. అలాగే కాలంతో పాటు చేజారి పోతాయి కూడా. ఒకసారి అవకాశం చేజారితే అది తిరిగి రాదని తెలిసి, దానిని గుర్తించి ఆలస్యం చేయకుండా వినియోగించుకోవడంలో నేర్పరి అయినవాడే విజయం సాధిస్తాడని చాణక్య నీతి చెబుతుంది.
*రూపశ్రీ.
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ వాతావరణం చాలా చక్కగా సహకరిస్తుంది. అయితే వేసవి కాలం మాత్రం కరివేపాకు మొక్కలకు కష్టకాలం అని చెప్పవచ్చు. వేసవిలో ఉండే తీవ్రమైన ఎండ కారణంగా కరివేపాకు మొక్క బాగా వాడిపోవడం, ఎదుగుదల మందగించడం జరుగుతుంది. అయితే మొక్క తిరిగి తాజాగా మారాలన్నా, ఆరోగ్యంగా పెరగాలన్నా కేవలం నీరు పోస్తే సరిపోదు. ఇందుకోసం ఇంట్లోనే ఉండే ఒక పానీయం చక్కగా సహాయపడుతుంది. అదేంటో తెలుసుకుంటే..
మజ్జిగ..
భారతీయుల చాలా ఇళ్లలో కరివేపాకు మొక్క ఉన్నట్టే.. వేసవి కాలంలో ప్రతి ఇంట్లో పెరుగు, మజ్జిగ ఖచ్చితంగా ఉంటుంది. కలివేపాకు మొక్కకు మజ్జిగను ఉపయోగించడం వల్ల వాడిన మొక్క తిరిగి తాజాగా మారడమే కాకుండా మొక్క ఆరోగ్యంగా కూడా పెరుగుతుంది.
మజ్జిగ ఎందుకు సహాయపడుతుంది?
కరివేపాకు మొక్కల పెరుగుదలకు ఆమ్ల నేల అవసరం. మజ్జిగలో ఆమ్లం ఉంటుంది. కరివేపాకు మొక్క పాదులో మజ్జిగను పోసినప్పుడు నేల pH స్థాయి సమతుల్యంగా ఉంటుంది, ఇది మొక్క నేల నుండి పోషకాలను గ్రహించడానికి వీలు కల్పిస్తుంది.
నత్రజని ఇస్తుంది..
కరివేపాకు పచ్చగా, దట్టంగా ఉండటానికి నత్రజని చాలా అవసరం. మజ్జిగలో కూడా నత్రజని ఉంటుంది, ఇది మొక్కల పెరుగుదలకు ఎంతో మేలు చేస్తుంది. మజ్జిగలోని పోషకాలు ఆకులను మరింత ముదురుగా, పచ్చగా మారడానికి సహాయపడతాయి. మజ్జిగను వాడటం కొత్త చిగుళ్ల పెరుగుదలను ప్రేరేపిస్తుంది.
కీటకాల నుండి రక్షణ..
కరివేపాకు మొక్కలకు తరచుగా తెల్లటి బూజు లేదా కీటకాలు పడతాయి. మజ్జిగ ఒక సహజ శిలీంధ్రనాశకం. దానిలో ఉండే లాక్టిక్ ఆమ్లం ఈ బ్యాక్టీరియా , శిలీంధ్రాలను చంపి, మొక్క పెరగడానికి సహాయపడుతుంది.
పోషకాలు..
మజ్జిగలో కాల్షియం మాత్రమే కాకుండా ఫాస్ఫరస్ , ప్రోబయోటిక్ బ్యాక్టీరియా కూడా ఉంటాయి. ఈ బ్యాక్టీరియా నేలను సారవంతం చేస్తుంది. కరివేపాకు మొక్కలు బాగా ఏపుగా పెరగడానికి మజ్జిగను ఉపయోగించవచ్చు.
*రూపశ్రీ.
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు. అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం. కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే.. కూలర్ ఉపయోగించేటప్పుడు కూలర్ లో నీరు చేపల వాసన వస్తూ ఉంటుంది. కొందరు కూలర్ నుండి వాసన వస్తూ ఉందనే కారణంతో దాన్ని ఆఫ్ చేస్తారు. అయితే కూలర్ ను వాడకుండా ఉండటం పరిష్కారం కాదు. కూలర్ ట్యాంక్ లోని పాత నీరు, నాచు, తేమ కారణంగా కూలర్ లో చేపల వాసన లాగా వస్తూ ఉంటుంది. ఈ సమస్యకు చాలా సులువుగా చెక్ పెట్టవచ్చు. అందుకోసం అనుసరించాల్సిన చిట్కాలు ఏంటో తెలుసుకుంటే..
కూలర్ నుండి చేపల వాసన ఎందుకు వస్తుంది?
కూలర్‌లో చేపల వాసన రావడానికి అత్యంత సాధారణ కారణం ట్యాంక్‌లో పేరుకుపోయిన బయోఫిల్మ్ , బ్యాక్టీరియా. ట్యాంక్‌లో నీరు ఎక్కువ సేపు నిలిచి ఉన్నప్పుడు, సూక్ష్మజీవులు వృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. నిలిచిపోయిన నీరు బయోఫిల్మ్‌ను ఏర్పరుస్తుంది, ఇది వాసనకు కారణమవుతుంది. అది మాత్రమే కాకుండా కూలర్‌లోని మురికి, దుమ్ము , తేమ కూడా ఈ వాసనకు కారణం అవుతాయి.
వాసన ఎలా తొలగించాలంటే..
కూలర్ నుండి దుర్వాసనను తొలగించడానికి వైట్ వెనిగర్‌ను ఉపయోగించవచ్చు. వైట్ వెనిగర్‌ను ఉపయోగించడం వల్ల కూలర్ నీటి నుండి వచ్చే చేపల వాసనను తొలగిపోతుంది. ఒకవేళ వైట్ వెనిగర్ లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా బేకింగ్ సోడాను కూడా ఉపయోగించవచ్చు. వెనిగర్ అనేది దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపే ఒక సహజ క్రిమిసంహారకం.
మొదటగా కూలర్ ట్యాంక్‌ను ఖాళీ చేయాలి. ఆ తర్వాత, ట్యాంక్‌లో వెనిగర్ పోసి కాసేపు అలానే ఉంచాలి. తర్వాత, ట్యాంక్‌ను శుభ్రంగా రుద్దాలి. ఆ తర్వాత 2 నుండి 3 టీస్పూన్ల బేకింగ్ సోడా కలపాలి. ట్యాంక్ శుభ్రం చేయాలి. దీని తర్వాత ట్యాంక్‌ను నీటితో నింపాలి. దీనివల్ల కూలర్‌లోని దుర్వాసన పోతుంది.
ఎసెంటియల్ ఆయిల్స్..
ట్యాంక్‌ను శుభ్రం చేసిన తర్వాత నీటిని నింపి ఆ నీటిలో ఎసెంటియల్ ఆయిల్స్ ఉపయోగించవచ్చు. కూలర్ నీటిలో 2 నుండి 3 చుక్కల టీ ట్రీ ఆయిల్ లేదా లెమన్‌గ్రాస్ ఆయిల్ కలపాలి. ఇది కూలర్ నుండి స్వచ్ఛమైన గాలి ప్రవహించడానికి సహాయపడుతుంది. కూలర్‌లోని నీటిని ప్రతి 2 నుండి 3 రోజులకు మార్చితే కూలర్ నుండి దుర్వాసన రాదు. చాలా మంది కూలర్ లో నీటి మట్టం తగ్గగానే ప్రతిరోజూ నీటిని అయితే నింపుతూ ఉంటారు. కానీ.. పూర్తీగా కూలర్ ట్యాంక్ ను క్లీన్ చేసి కొత్త నీటిని నింపుతూ ఉంటే కూలర్ నుండి వాసన అనేది రాదు.
*రూపశ్రీ.
శివకాశి ఎమ్మెల్యేగా కీర్తన సంపత్ సంచలనం..
తమిళనాట తెలుగులో ప్రచారం..
శివకాశికి తొలి మహిళా ఎమ్మెల్యేగా రికార్డు..
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ, ఒక తెలుగు మహిళ సంచలన విజయాన్ని నమోదు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. కోలీవుడ్ స్టార్ విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ తరపున శివకాశి నియోజకవర్గం నుండి పోటీ చేసిన కీర్తన సంపత్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. రాజకీయ ఉద్దండులు తలపడిన ఈ ఎన్నికల్లో ఒక సామాన్య నేపథ్యం ఉన్న తెలుగు మహిళ విజయం సాధించడం ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్ గా మారింది.
కీర్తన సంపత్ తన ఎన్నికల ప్రచారంలో అనుసరించిన వ్యూహం ఆమెను విజయతీరాలకు చేర్చింది. శివకాశి ప్రాంతంలో గణనీయంగా ఉన్న తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆమె 'తెలుగు'నే ఆయుధంగా మలుచుకున్నారు. ఇంటింటికీ వెళ్లి స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతూ, స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా తెలుగు మూలాలున్న కుటుంబాలతో ఆమె పెంచుకున్న ఆత్మీయ బంధం ఓట్ల రూపంలో మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పార్టీ అధినేత విజయ్ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీర్తన సఫలమయ్యారు. విద్య, వైద్యం మరియు ఉపాధి అవకాశాలపై ఆమె ఇచ్చిన హామీలకు యువత మరియు మహిళా ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. శివకాశి లాంటి కీలకమైన పారిశ్రామిక నియోజకవర్గంలో పట్టు సాధించడం అంటే సామాన్యమైన విషయం కాదు, కానీ తనదైన శైలిలో ప్రచారాన్ని నిర్వహించి ప్రత్యర్థులను చిత్తు చేశారు.
ఈ విజయంపై కీర్తన సంపత్ స్పందిస్తూ.. ఇది తన గెలుపు మాత్రమే కాదని, తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్క తెలుగు మరియు తమిళ సోదర సోదరీమణుల విజయం అని పేర్కొన్నారు. శివకాశి అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని, ముఖ్యంగా కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తానని ఆమె హామీ ఇచ్చారు. విజయ్ నాయకత్వంలో తమిళనాడులో నవశకం ప్రారంభమైందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త పార్టీ అభ్యర్థికి, అదీ తెలుగు ప్రచారంతో ఇంతటి ఆదరణ లభించడం విశేషం. ఇది భవిష్యత్తులో తమిళ రాజకీయాల్లో భాషా పరమైన వైవిధ్యానికి మరియు ప్రాంతీయ బంధాలకు అద్దం పడుతోంది.
రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా కీర్తన సంపత్ శివకాశి ముఖచిత్రాన్ని ఎలా మారుస్తారో చూడాలి. స్థానికంగా పెండింగ్‌లో ఉన్న మౌలిక సదుపాయాల కల్పన మరియు బాణాసంచా పరిశ్రమ కార్మికుల భద్రత వంటి అంశాలపై ఆమె తక్షణమే దృష్టి సారిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. ఒక తెలుగు మహిళగా తమిళ అసెంబ్లీలో ఆమె గళం ఏ విధంగా వినపడనుందో వేచి చూడాలి.
పశ్చిమ బెంగాల్ సీఎం రేసులో ముందు వరుసలో కనిపిస్తున్న సువేందు అధికారి ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ఈ సందర్భంగా సువేందు స్పందిస్తూ.. తమ తదుపరి టార్గెట్ ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలేనని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. బీజేపీకి ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ అధినేతను ఉద్దేశించి.. మమతా బెనర్జీ, తేజస్వి యాదవ్, రాహుల్ గాంధీల పనైపోయిందని.. తర్వాతి వంతు అఖిలేశ్ యాదవేనని హెచ్చరించారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీతో పోల్చారు సువేందు. ఆప్‌లాగే టీఎంసీ కూడా అవినీతిమయమైందని, పతనం ఖరారైందని విమర్శించారు. ఆ పార్టీకి ఎలాంటి సిద్ధాంతాలు లేవని.. అందుకే నందిగ్రామ్ ప్రజలు మరోసారి తనను గెలిపించారన్నారు. దీదీ రాజకీయ బహిష్కరణ ఖాయమైందని పేర్కొన్నారు. త్వరలోనే టీఎంసీ ఎంపీలు బీజేపీలో చేరతారని జోస్యం చెప్పిన సువేందు అధికారి.. ఇక తమ దృష్టిపి సమాజ్‌వాదీ పార్టీపై కేంద్రీకరిస్తామని అఖిలేశ్ యాదవ్‌కు హెచ్చరిక జారీచేశారు.
ఒకప్పుడు మమతా బెనర్జీకి కుడిభుజంగా.. తూర్పు మిడ్నాపూర్ వంటి జిల్లాలలో టీఎంసీ ఎదుగుదలలో సువేందు కీలక పాత్ర పోషించారు. కానీ.. 2020లో మమతతో విబేధించి బీజేపీలో చేరారు. ఆపై ఆమె ఓటమిని శాసించారు. నందిగ్రామ్‌లో టీఎంసీకి చెందిన పవిత్ర కర్‌ను కూడా సువేందు ఓడించారు. ఇప్పుడు బీజేపీ సీఎం రేసులో ఆయన పేరు ముందు వరుసలో ఉంది.
అస్సాం మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అక్రమాలకు పాల్పడిందనీ, పద్ధతి ప్రకారం ఓట్ల చోరీని అమలు చేసిందనీ ధ్వజమెత్తారు. కేంద్రంలోని అధికార పార్టీ తన బలాన్ని ఉపయోగించి ఓటర్ల తీర్పును తారుమారుచేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు. ఈ మేరకు సోమవారం (మే 4) తన అధికారిక 'ఎక్స్' ఖాతాలో చేసిన ఓ పోస్టులో.. పశ్చిమ బెంగాల్‌లో వందకు పైగా సీట్లలో ఫలితాలను బీజేపీ తారుమారు చేసిందన్న తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపణలతో తాను ఏకీభవిస్తున్నానని పేర్కొన్నారు. ఇది బీజేపీకి తెలిసిన పాత వ్యూహమేనని, గతంలో మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర రాష్ట్రాలతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇదే తరహా పద్ధతిని చూశామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బీజేపీ ఎన్నికలనే కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలను పరిరక్షించే వ్యవస్థల విశ్వసనీయతను కూడా దెబ్బతీస్తోందని ఆయన ధ్వజమెత్తారు.
కాలం మారినా మనిషి జీవన పోరాటం మాత్రం మారదు. కొందరు కాలంతో పోటీ పడి ఎండ, వాన, చలి వంటి వాటిని లెక్క చేయకుండా సాగుతూ ఉండాలి. లేకపోతే వారితో పాటు వారిని నమ్ముకున్న కుటుంబాలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక ప్రస్తుతం వేసవి కాలం నడుస్తోంది. ఈ వేసవి కాలంలో అడుగు బయట పెట్టాలంటే భయపడాల్సి వస్తోంది. కానీ కొందరు మాత్రం ఎండలో కూడా బయటకు వెళ్లాలి, ఎండలో తిరిగి పనులు చేయాల్సి వస్తుంది. చాలామంది బయటి పనులకు బైక్ వాడుతూ ఉంటారు. సాధారణ రోజులలో బైక్ ప్రయాణం ఏమంత సమస్య అనిపించదు. కానీ.. వేసవిలో, తీవ్రమైన ఎండలో మాత్రం బైక్ ప్రయాణించే వారు చాలా జాగ్రత్త పడాలి. లేకపోతే వడగాలులు, డీహైడ్రేషన్ సమస్య చాలా తొందరగా దెబ్బతీస్తాయి. బైక్ రైడర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుంటే..
సరైన దుస్తుల ఎంపిక..
ఎండలో ప్రయాణించేటప్పుడు సురక్షితమైన దుస్తులు , హెల్మెట్ ధరించడం అత్యంత ముఖ్యం. చెమట త్వరగా ఆవిరైపోయి, శరీరాన్ని చల్లగా ఉంచడానికి తేలికైన, గాలి ప్రసరించే దుస్తులు ధరించాలి. హెల్మెట్ సరిగ్గా బిగువుగా సరిపోయేలా , తలను ఎండ నుండి రక్షించేలా ఉండేలా చూసుకోవాలి.
నీరు..
తగినంత నీరు , ఎలక్ట్రోలైట్లను తీసుకోవడం చాలా ముఖ్యం. వేడిలో, శరీరం నుండి నీరు , ఖనిజాలు వేగంగా నష్టపోతాయి, దీనివల్ల డీహైడ్రేషన్ , బలహీనత ఏర్పడతాయి. నీటితో పాటు కొబ్బరి నీరు లేదా ఎలక్ట్రోలైట్ పానీయాలను తీసుకోవడం శరీరంలోని నీరు , ఖనిజాల సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది.
సమయం..
ఎక్కువ సేపు ఎండలో బైక్ డ్రైవ్ చేయడం మానుకుంటే మంచిది. తెల్లవారుజాము లేదా సాయంత్రం వంటి చల్లని సమయాల్లో బైక్ డ్రైవింగ్ మేలు. దీనివల్ల ఎండ వేడిమి, అలసట తగ్గుతాయి. మధ్యాహ్నం 12 నుండి 4 గంటల మధ్య ఎండ తగలకుండా ఉండేందుకు ప్రయత్నించాలి.
విశ్రాంతి..
తప్పనిసరి పరిస్థితిలో బయటకు వెళితే.. బైక్ వేగాన్ని అదుపులో ఉంచుకోవాలి. విశ్రాంతి తీసుకోవడానికి, శరీరాన్ని చల్లార్చుకోవడానికి అక్కడక్కడా ఆగుతూ, విశ్రాంతి తీసుకుంటూ వెళ్లడం మంచిది. ఎక్కువ సేపు అధిక వేగంతో ప్రయాణించడం వల్ల శరీర వేడి పెరిగి అలసటకు దారితీస్తుంది. చిన్న చిన్న విరామాలు తీసుకోవడం శరీరాన్ని కూల్ చేసుకోవడానికి, సురక్షితమైన ప్రయాణానికి సహాయపడతాయి.
గ్లౌజులు, సన్ స్క్రీన్..
తీవ్రమైన ఎండ నుండి ప్రొటెక్షన్ కోసం సన్‌స్క్రీన్ , చేతికి గ్లౌజులు వాడాలి. సన్‌స్క్రీన్ చర్మాన్ని UV కిరణాల నుండి రక్షిస్తుంది, అదే సమయంలో గ్లౌజులు బైక్ నడుపుతున్నప్పుడు చేతుల చర్మాన్ని రక్షిస్తాయి. ఇది చర్మం కాలిన గాయాలు , నష్టం కలిగే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
*రూపశ్రీ.
వేసవి అంటే మండే ఎండలు, వేడి గాలులు, చెమటలు పట్టించే వాతావరణం.. ఇవన్నీ ఉంటాయి. ఇలాంటి రోజుల్లో రోడ్డు పక్కన అమ్మే చెరకు రసం తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. నిమ్మరసం, నల్ల ఉప్పు, పుదీనా కలపడం వల్ల చెరకు రసం రుచి మరింత ఇనుమడిస్తుంది. పైగా మార్కెట్ లో అమ్మే కూల్ డ్రింకులతో పోలిస్తే.. చెరకు రసం చాలా సహజమైన పానీయం. అందుకే వేసవిలో చాలామంది చెరకు రసం తాగడానికి చాలా ఇష్టపడతారు. కానీ ఎంతో ఆరోగ్యకరమైనదని, తక్షణ చల్లదనాన్ని ఇచ్చేదాని అనుకునే చెరకు రసం తాగడం నిజంగా సురక్షితమేనా? ఈ విషయం నేటి కాలంలో చాలా సందేహమైన ప్రశ్నగా మారుతోంది. వేసవి కాలంలో చెరకు తాగడం ఆరోగ్యానికి ఎంత వరకు మంచిది? దీని గురించి వైద్యులు ఏం చెప్తున్నారో తెలుసుకుంటే..
చెరకు రసం మంచిదే.. కానీ ఎక్కువగా తాగితే..
వేసవిలో చెరకు రసం చాలా ఎక్కువగా తాగుతుంటారు. చెరకు రసం శరీరానికి తేమను అందించి, తక్షణ శక్తిని ఇస్తుంది. చెరకు రసంలోని సహజ చక్కెర శరీరానికి తక్షణ శక్తిని అందించి, అలసట , డీహైడ్రేషన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. అందుకే మండుటెండలలో ఉపశమనం కోసం చాలామంది చెరకు రసం తాగుతారు. చెరకు సహజంగానే తీపిగా ఉన్నప్పటికీ, రసంగా తీసుకున్నప్పుడు దానిలోని చక్కెర శాతం మరింత ఎక్కువగా మారుతుంది. రసం తీయడం వల్ల ఫైబర్ దాదాపు పూర్తిగా తొలగిపోతుంది, ఇది సాధారణంగా శరీరం చక్కెరను గ్రహించడాన్ని నెమ్మదింపజేస్తుంది. అందువల్ల, చెరకు రసం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది.
చెరకు రసం మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది కాదని చెబుతారు. అంతేకాకుండా, ఫ్యాటీ లివర్, ఊబకాయం లేదా జీవక్రియ సమస్యలు ఉన్నవారు చెరకు రసం తాగడాన్ని చాలా తగ్గించాలని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ చక్కెర శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమై ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
చెరకు రసం పరిశుభ్రత..
చెరకు రసం విషయంలో ఉన్న మరొక ప్రమాదం దాని పరిశుభ్రత. తరచుగా చెరకు రసాన్ని ఆరుబయట తయారు చేస్తారు, చెరకు పైన ఉండే తెల్లని పొడిని శుభ్రపరచకుండా చెరకు నుండి రసం తీస్తుంటారు. పైగా చెరకు రసం తీసే చోట యంత్రాలు, ఐస్, నీరు , గ్లాసులు సరైన పరిశుభ్రతతో ఉండవు. వైద్యుల ప్రకారం, రసం తయారీలో ఉపయోగించే యంత్రాలు లేదా ఐస్ శుభ్రంగా లేకపోతే, బ్యాక్టీరియా , వైరస్‌లు సులువుగా అటాక్ అవుతాయి. దీనివల్ల టైఫాయిడ్, కలరా , హెపటైటిస్ వంటి నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.
చెరకు రసం విషయంలో ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే..
చెరకు రసం తాగే విషయంలో కొందరు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహం, ఊబకాయం, లేదా ఫ్యాటీ లివర్ ఉన్నవారు, రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతున్నవారు చెరకు రసం తాగే ముందు జాగ్రత్త వహించాలి. చెరకు రసాన్ని ఎల్లప్పుడూ శుభ్రమైన , పరిశుభ్రమైన ప్రదేశం నుండే కొనుగోలు చేయాలి.
*రూపశ్రీ.
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని మీకు తెలుసా? హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ 'ఆయుర్వేద పాన్' అద్భుతంగా పనిచేస్తుంది.
గుండె రక్తనాళాల్లో అడ్డంకులను (Blockages) తొలగించి, గుండెపోటు రాకుండా కాపాడే ప్రత్యేక ఆయుర్వేద పాన్/తాంబూలం తయారీ విధానం మరియు దాని ప్రయోజనాలు ఈ వీడియోలో చూడండి.
ఈ వీడియోలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే హార్ట్ స్పెషల్ తాంబూలం తయారీని వివరించారు:
ఈ ఆయుర్వేద తాంబూలానికి కావలసినవి:
తమలపాకు: ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు ఔషధ గుణాలను రక్తంలోకి త్వరగా చేరుస్తుంది.
అర్జున చెట్టు బెరడు చూర్ణం: గుండె పనితీరును మెరుగుపరచడంలో ఇది అగ్రగామి.
వెల్లుల్లి: రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును (Cholesterol) కరిగించి, అడ్డంకులను తొలగిస్తుంది.
అల్లం లేదా సొంఠి: రక్త ప్రసరణను సాఫీగా చేస్తుంది.
దాల్చిన చెక్క: రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఎలా తీసుకోవాలి?
వీడియోలో చూపిన విధంగా, తమలపాకులో ఈ మూలికలను సరైన మోతాదులో ఉంచి, తాంబూలంలా చప్పరిస్తూ తీసుకోవాలి. ఇది రక్తాన్ని పల్చగా ఉంచి, గడ్డకట్టకుండా (Blood Clots) చేయడంలో సహాయపడుతుంది.
ప్రయోజనాలు:
గుండె రక్తనాళాల్లో బ్లాకేజీలు ఏర్పడకుండా నిరోధిస్తుంది.
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె కండరాలను దృఢంగా మారుస్తుంది.
అధిక రక్తపోటు (BP) సమస్యను అదుపులో ఉంచుతుంది.
శరీరంలోని వ్యర్థాలను తొలగించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి!
సూచన: ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. తీవ్రమైన గుండె సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని ప్రయత్నించాలి.
