LATEST NEWS
మార్గదర్శి ఫిన్ క్యాప్ కేసు వ్యవహారంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌కు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ కేసులో సుప్రీం కోర్టు ఉండవల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ, ఈ కేసుతో ఆయనకు నేరుగా ఉన్న సంబంధం ఏమిటని నిలదీసింది.
2008 నుంచి ప్రారంభమైన ఈ మార్గదర్శి కేసు అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది. గతంలో హైకోర్టు ఈ కేసును కొట్టివేసినప్పటికీ, ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఊరూరా సభలు నిర్వహించి మరీ మార్గదర్శి సంస్థలు ఆర్‌బిఐ నిబంధనలను ఉల్లంఘించాయని, ప్రజలను మోసం చేశాయని ఆరోపణలు గుప్పించారు. అయితే ఆయన వాదనలు, ప్రచారాలు, ఆరోపణలూ అన్నీ అసత్యాలని సుప్రీం తీర్పుతో తేలిపోయింది. దీనిపై ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు.. ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ అడుసుమిల్లి శ్రీనివాసారావు తెలుగువన్ చానల్ కు ఇచ్చినఇంటర్వ్యూలో ఉండవల్లి మార్గదర్శిపై కేసు, న్యాయపోరాటం అంతా కేవలం ఈర్ష్యతోనే అన్నారు. అయితే దోమ ఏనుగుని చూసి ఈర్ష్యపడితే ఏమౌతుందో.. ఇప్పుడు ఉండవల్లి పరిస్థితి కూడా అంతేనన్నారు.
మార్గదర్శి డిపాజిటర్ల పరంగా ఇప్పటివరకూ ఒక్క బాధితుడు కూడా ఫిర్యాదు చేయకపోవడం, సంస్థ ఇప్పటికే రూ.2,600 కోట్లకు పైగా ఎస్క్రో అకౌంట్‌లో జమ చేయడం వంటి అంశాలను గుర్తు చేసిన అడుసుమిల్లి.. రామోజీరావు నిర్మించిన పత్రికా, వ్యాపార సామ్రాజ్యంపై కేవలం ఈర్ష్యా ద్వేషాలతోనే ఉండవల్లి అరుణ్ కుమార్, వైసీపీ నాయకులు వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారన్నారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో రామోజీరావును విచారణ పేరిట ఇబ్బందులకు గురిచేసినప్పటికీ, ఆయన ఏనాడూ వెనకడుగు వేయలేదన్నారు.
ఈ తీర్పు రామోజీరావు ప్రతిష్టను ఇనుమడింపచేసిందనీ, ఆయనపై కక్షసాధింపు చర్యలకు చెక్ పడిందని అడుసుమిల్లి అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు లేదా రాజకీయ అజెండాతో చేసిన పోరాటాలు చివరికి న్యాయస్థానాల ముందు నిలబడవని ఈ కేసు మరోసారి స్పష్టం చేసిందన్న ఆయన. సుప్రీం కోర్టు నిర్ణయంతో మార్గదర్శి వివాదానికి ముగింపు పడినట్లేనన్నారు. ఇప్పటికైనా విమర్శకులు తమ వైఖరిని మార్చుకోవాలని అడుసుమిల్లి హితవు పలికారు.
Supreme Court, Margadarsi Judgement, Vundavalli Aruna Kumar, Margadarsi Case, Court Verdict Telugu, TeluguOne
తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో ఇప్పుడు కాంగ్రెస్ అంతర్గత విభేదాలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా కొందరు సీనియర్ లు విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకు ప్రతిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు, 5 గురు ఎమ్మెల్సీలు ఒక్కసారిగా మీడియా ముందుకు వచ్చి, మంత్రి కొండా సురేఖను పదవి నుంచి బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
దీనిపై ప్రభుత్వ విప్ వేముల వీరేషం తెలుగువన్ న్యస్ చానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాలన్న డిమాండ్ ఎవరి స్వార్థం కోసం చేసిన రచ్చ కాదు, పార్టీ క్రమశిక్షణను కాపాడేందుకు తీసుకున్న చర్య అని వివరించారు. కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ప్రభుత్వంని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన వీరేషం.. క్రమశిక్షణ రాహిత్యంగా ఎవరు మాట్లాడినా సరే సహించేది లేదు అని వీరేషం స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక జోడెడ్ల బండిలా రాత్రింబవళ్లు కష్టపడి పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తుంటే... కొంతమంది వ్యక్తులు మీడియా మైకులు దొరగ్గానే నోటికొచ్చినట్టు లూజ్ టాక్ మాట్లాడటం వల్ల క్యాడర్ తీవ్ర గందరగోళానికి గురవుతోందని వేముల వీరేషం అన్నారు.
కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాలన్న డిమాండ్ ను బీసీ మంత్రిని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న దాడిగా జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, రెడ్డి అనే తేడాలు ఉండవు. బి ఫామ్ అందరికీ ఒక్కటే, పార్టీ క్రమశిక్షణ అందరికీ ఒక్కటే! తప్పు చేస్తే చర్యలు తప్పవు, నిన్న జక్కిడి ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేయలేదా?" అని ప్రశ్నించారు. తెలంగాణలో ఆగస్టు సంక్షోభం, రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనను క్యాన్సిల్ చేసుకుని హుటాహుటిన తిరిగి వస్తున్నారన్న కామెంట్లను కూడా వీరేషం ఖండించారు. 2029 వరకే కాదు, 2034 వరకు కూడా రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారన్నారు.
Demand in Congress to Burthruf Konda Surekha, Vemula Veeresham, CM Revanth Reddy, Telangana Congress Politics, Konda Sushmitha Comments, Revanth Reddy Cabinet
తెలుగు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పుడు ఈడీ రంగప్రవేశం చేసింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన సన్నిహితుల నివాసాలలో ఏకకాలంలో విస్తృత సోదాలు నిర్వహించింది. 2019 మార్చిలో జరిగిన వివేకా హత్య వెనుక 40 కోట్ల సుపారీ ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో రూ.1 కోటి అడ్వాన్స్‌గా ఇచ్చారని, అందులో రూ.70 లక్షలు రికవరీ అయ్యాయని వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు దాదాపు ఏడేళ్ల తరువాత ఈడీ సోదాలు నిర్వహించిందంటే ఏం జరుగుతోంది? ఆర్థిక లావాదేవీలు, మనీ ల్యాండరింగ్ కోణంలో ఈడీ ఎలాంటి కీలక ఆధారాలు సేకరించబోతోంది? అన్న విషయంపై ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు, ఏపీ కమ్మకార్పొరేషన్ చైర్మన్ అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ఈ కేసులో కీలక సాక్షులు కొందరు ఇప్పిటికే అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో అప్రూవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం కీలకంగా మారింది. జైలులో బెదిరింపులు వచ్చినా, కోట్లాది రూపాయల ఆఫర్లు ఇచ్చినా లొంగకుండా దస్తగిరి మెజిస్ట్రేట్ ముందు వివరాలు వెల్లడించారు.
అదలా ఉంటే.. ప్రజా కోర్టులో వివేకా హత్య కేసులో తీర్పు వచ్చేసిందన్న అడుసుమిల్లి శ్రీనివాసరావు.. బాధితురాలైన కుమార్తెకు చట్టబద్ధంగా న్యాయం జరిగాల్సి ఉందన్నారు. అర్ధరాత్రి హత్య జరిగితే, తెల్లవారక ముందే ఫోన్ కాల్స్ వెళ్లడం, సాక్ష్యాధారాలు తుడిచిపెట్టే ప్రయత్నం జరగడంపై ఇప్పటికీ అనేక ప్రశ్నలు ఉన్నాయి? అయితే ఇప్పుడు ఈ కేసులో ఈడీ ఎంట్రీ.. 40 కోట్ల సుపారీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరెవరి ఖాతాల నుంచి ఎక్కడికి బదిలీ అయింది? అన్నది తేల్చడమే.. అయితే ఇప్పుడు ఇక ఈడీ సోదాల వల్ల ఒరిగిందేమీ ఉండదన్న అడుసుమిల్లి.. ఆ 40 కోట్లు వీళ్లకి రోడ్డు మీద దొరికాయని ఈడీ ముక్తాయించేసినా ఆశ్చర్యంలేన్నారు.
ఏది ఏమైనా, ఓ మాజీ ఎంపీ, మాజీ మంత్రి స్వగృహంలోనే హత్యకు గురైతే.. ఏళ్లు గడుస్తున్నా బాధ్యులకు సరైన శిక్ష పడకపోవడం వ్యవస్థల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈడీ దర్యాప్తులోనైనా అసలు సూత్రధారులు బయటకు వస్తారా? లేక ఇది కూడా కేవలం విచారణలకే పరిమితమవుతుందా చూడాల్సి ఉంది.
ED entry in YS Viveka Murder Case, ED Investigation AP, Avinash Reddy ED Raids, Dastagiri Statement, YS Jagan Mohan Reddy, AP Politics, TeluguOne
ALSO ON TELUGUONE N E W S
మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో గతంలో ప్రకటించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చుట్టూ గత కొద్దిరోజులుగా రకరకాల రూమర్లు షికార్లు చేస్తున్నాయి. కథ విషయంలో వ్యత్యాసాల వల్ల లేదా శ్రీకాంత్ ఓదెల వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా క్యాన్సిల్ అయిపోయిందంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్లన్నింటికీ స్వయంగా దర్శకుడే చెక్ పెట్టారు.
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీకాంత్ ఓదెల సోషల్ మీడియా వేదికగా ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా "మన సినిమా షూటింగ్ ప్రారంభించి మీతో మరచిపోలేని జ్ఞాపకాలను క్రియేట్ చేసుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను బాస్" అని పోస్ట్ చేశారు. దీంతో ఈ కాంబో ప్రాజెక్ట్ రద్దయిందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది.
డైరెక్టర్‌గా తొలి చిత్రం 'దసరా'తో బాక్సాఫీస్ వద్ద రికార్డు సంచలనం సృష్టించిన శ్రీకాంత్ ఓదెల, ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో 'ది ప్యారడైజ్' అనే భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉండటం వల్లే చిరంజీవి సినిమా సెట్స్‌పైకి వెళ్లడంలో కొంత ఆలస్యం జరిగిందని ఇండస్ట్రీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్‌ను నాచురల్ స్టార్ నాని స్వయంగా సమర్పిస్తున్నారు. 1970ల బ్యాక్‌డ్రాప్‌లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా, అత్యంత రా అండ్ రస్టిక్ పీరియాడిక్ మాస్ డ్రామాగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది.
గతంలో విడుదలైన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రక్తంతో తడిసిన చేతులు కనిపించడంతో, ఇది మెగాస్టార్ కెరీర్‌లోనే మునుపెన్నడూ లేని విధంగా అత్యంత వైలెంట్ అండ్ ఎమోషనల్ యాక్షన్ ఫిల్మ్‌గా ఉండబోతోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల 'ది ప్యారడైజ్' చిత్రీకరణను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉండగా, అది పూర్తయిన వెంటనే మెగాస్టార్ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్లారిటీతో మెగా అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరోసారి సంక్షోభ వాతావరణం నెలకొంది. ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ నిబంధనలపై థియేటర్ యాజమాన్యాలకు, నిర్మాతల మండలికి నడుమ వివాదం చెలరేగడంతో సెప్టెంబరు 1 నుంచి కొత్త తమిళ సినిమాల విడుదలను నిలిపివేస్తున్నట్లు తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) మరియు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఉమ్మడిగా సంచలన ప్రకటన చేశాయి.
ఈ వివాదానికి ప్రధాన కారణం థియేటర్ రిలీజ్, ఓటీటీ స్ట్రీమింగ్‌ల మధ్య ఉండాల్సిన కాలపరిమితి అని తెలుస్తోంది. థియేటర్లలో విడుదలైన ప్రతీ చిత్రం కనీసం 8 వారాల (రెండు నెలలు) వ్యవధి తర్వాతే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కావాలని, ఈ మేరకు హామీ పత్రం ఇస్తేనే థియేటర్లలో సినిమాలను ప్రదర్శిస్తామని తమిళనాడు థియేటర్ ఓనర్స్ అసోసియేషన్, డిస్ట్రిబ్యూటర్ల సమాఖ్య ఏకపక్షంగా కండిషన్ విధించాయి.
ఈ నిబంధనను తమిళ నిర్మాతల మండలి తీవ్రంగా ఖండించింది. పొరుగున ఉన్న తెలుగు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ), కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలలో లేని కొత్త నిబంధనలను కేవలం కోలీవుడ్‌లోనే రుద్దడం ఏమాత్రం తగదని స్పష్టం చేసింది. అన్ని వర్గాల భాగస్వాములతో చర్చించకుండా థియేటర్ యాజమాన్యాలు ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం తమకు ఆమోదయోగ్యం కాదని నిర్మాతలు తేల్చిచెప్పారు.
థియేటర్ యజమానుల మొండి వైఖరికి నిరసనగా సెప్టెంబరు 1వ తేదీ నుంచి కొత్త సినిమాల విడుదలలతో పాటు, చిత్రాల షూటింగ్‌లు మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తిగా నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయించింది. దీంతో కోలీవుడ్‌లో నిర్మాణాలు, విడుదలలు అన్నీ ఒకేసారి స్తంభించిపోయే ప్రమాదం ఏర్పడింది.
గత కొద్దికాలంగా చిన్న, పెద్ద సినిమాలనే తేడా లేకుండా థియేటర్లలో విడుదలైన కొన్ని వారాలకే ఓటీటీల్లోకి వచ్చేస్తుండటంతో థియేటర్లకు ప్రేక్షకుల రాక తగ్గుతోందని యజమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఓటీటీ హక్కుల ద్వారా వచ్చే ఆదాయం సినిమాల నిర్మాణ వ్యయానికి కీలక ఆధారంగా మారిందని నిర్మాతలు భావిస్తుండటంతో ఈ ప్రతిష్టంభన ఏర్పడింది.
ఈ సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాల్సిందిగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మాతల మండలి విజ్ఞప్తి చేయడానికి సిద్ధమవుతోంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం లేదా ఇరు వర్గాల ప్రతినిధులు చర్చలు జరిపి ఒక సయోధ్యకు రాకపోతే, సెప్టెంబర్ నెలలో విడుదల కావలసిన పలు క్రేజీ తమిళ సినిమాలు వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తోంది.
B Sreedhar Varma has assumed charge as the new Chairman of Sri Venkateswara Bhakti Channel (SVBC), the devotional channel of Tirumala Tirupati Devasthanams (TTD). He formally took charge at the SVBC office near Alipiri in Tirupati.
Before assuming his responsibilities, B Sreedhar Varma received the blessings at the Sri Ranganayakula Mandapam in Tirumala and later arrived in Tirupati to take charge as SVBC Chairman. Speaking on the occasion, B Sreedhar expressed his happiness at being given the opportunity to serve as SVBC Chairman. He said SVBC plays a key role in taking the glory of Lord Sri Venkateswara and the message of Hindu Dharma to devotees across the world. He assured that he would work in coordination with all employees and strive to further strengthen the channel.
Sreedhar expressed his heartfelt gratitude to Andhra Pradesh Chief Minister Sri N. Chandrababu Naidu, Minister Sri Nara Lokesh, Deputy Chief Minister Sri Pawan Kalyan, and Endowments Minister Sri Anam Ramanarayana Reddy for giving him the opportunity to serve as SVBC Chairman.
The programme was attended by several members of the Nandamuri family, including Nandamuri Mohana Krishna, Nandamuri Ramakrishna, Nandamuri Mohana Roopa, Kamineni Sreemantini and Daggubati Nivedita, who congratulated B Sreedhar Varma, AP FDC Chairman Bharath Bhushan, TFPC secretary Thummala Prasanna Kumar and others extended their best wishes for his tenure. Several alliance leaders and well-wishers also attended the programme.
Nandamuri Mohana Krishna congratulated B Sreedhar Varma on being appointed SVBC Chairman and described him as a brother-like figure. Recalling the long-standing association between the Nandamuri family and B Sreedhar Varma’s family, he said that although they were not related by blood, the bond of affection and respect between the families was like that of brothers.
He recalled that NTR Raju had been offered an early party ticket by Nandamuri Taraka Rama Rao but chose not to contest, instead dedicating himself to the service of Lord Venkateswara and TTD. He also recalled Raju’s contribution to the development of TTD, including his voluntary donation of land.
Mohana Krishna said that Raju’s family had stood by the Nandamuri family since the generation of NTR and expressed happiness that his son B Sreedhar Varma was now carrying forward that legacy through his new responsibility as SVBC Chairman.
Nandamuri Ramakrishna said that the appointment of B Sreedhar Varma, son of the well-known NTR Raju, as SVBC Chairman was a matter of great happiness for the Nandamuri family. He recalled that B Sreedhar Varma’s family had been associated with the service of Lord Venkateswara for four generations. Describing NTR Raju as a highly trusted and disciplined person who was deeply committed to the service of Lord Venkateswara, he expressed confidence that Sri Dhar Varma would follow in his father’s footsteps.
He hoped that B Sreedhar Varma would take SVBC to greater heights and conveyed his blessings and best wishes to him and his family. He also thanked Chief Minister Sri N. Chandrababu Naidu and everyone involved in his appointment.
Nandamuri Mohana Roopa said that it was a moment of immense happiness and pride for the entire Nandamuri family. She recalled the close association between NTR Raju and Nandamuri Taraka Rama Rao, describing Raju as a selfless person who worked with dedication and remained committed to his values throughout his life.
She said it was particularly gratifying that SreedharVarma, the son of such a respected personality, had been given the responsibility of serving as SVBC Chairman. She expressed confidence that he would do complete justice to the position and carry forward his family’s legacy with dedication and integrity.
She also expressed gratitude to the government for honouring B Sreedhar Varma with the responsibility. The Nandamuri family members and other dignitaries wished B Sreedhar Varma success in his new role and expressed confidence that under his leadership, SVBC would continue to spread the glory of Lord Sri Venkateswara and devotional values to devotees across the globe.
Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
Megastar Chiranjeevi's Vishwambhara is steadily building curiosity as the ambitious fantasy spectacle moves through its extensive post-production. On the occasion of Chiranjeevi's birthday, the makers unveiled an OST composed by Gowra Hari, offering the first real taste of the film's larger-than-life musical world.
The track stands out for its Sanskrit shlokas, powerful orchestration and spiritual undertone, creating an imposing aura around Chiranjeevi's character. The background score is designed to underline the connection between the protagonist and Lord Shiva, giving the track an epic quality that suits the film's fantasy setting.
The accompanying poster adds another layer to the intrigue. Chiranjeevi appears with striking green eyes, while the reflection of a mystical gemstone connected to Lord Shiva's trident hints at the power surrounding his character and the enormous threat he is expected to confront.
Directed by Vassishta Mallidi and produced by UV Creations, Vishwambhara has already completed its shoot and is undergoing heavy VFX work involving international studios. MM Keeravaani is composing the film's songs, while Gowra Hari handles the background score. Trisha Krishnan and Ashika Ranganath are part of the cast. The makers are expected to announce the release date soon.
Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా తీవ్ర వివాదాస్పదంగా మారిన జానపద కళాకారులు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్‌ల వ్యవహారం ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలపై డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఎట్టకేలకు స్పందించడమే కాకుండా, తనపై దాడి చేసిన వారిపై రివర్స్ కేసు పెట్టడం ఇండస్ట్రీ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.
వేములవాడలోని రెడ్డి భవన్‌లో ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనపై అకారణంగా దాడికి పాల్పడ్డారని మాధురి రాథోడ్ వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కొందరితో కలిసి వచ్చిన శరణ్య, తనను అసభ్యకర పదజాలంతో దూషించడమే కాకుండా భౌతికంగా దాడికి తెగబడ్డారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అంతటితో ఆగకుండా దాడి చేస్తున్న సమయంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారని మాధురి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆ గొడవ సమయంలో తన వద్ద ఉన్న రూ. 50 వేల విలువైన ఐఫోన్‌ను దొంగిలించారని ఆమె పోలీసుల దృష్టికి తీసుకెళ్లడం గమనార్హం.
ఈ వ్యవహారంపై నిజానిజాలు తెలుసుకోకుండా తన వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా కథనాలు ప్రసారం చేసిన కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ఛానళ్లపై కూడా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. మాధురి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈశ్వర్ సాయి భార్య శరణ్యతో పాటు సంబంధిత వ్యక్తులపై వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తెలుగు రాష్ట్రాల్లో 'బాసింగా బలాలు' పాటతో ఈశ్వర్ సాయి, అనేక ప్రైవేట్ జానపద గీతాలతో మాధురి రాథోడ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పోలీసులు ఈ కేసు నమోదు చేయడంతో తదుపరి విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయోనని నెటిజన్లు ఎంతో ఉత్కంఠగా గమనిస్తున్నారు.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు.
టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.
జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్‌లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్‌డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్‌స్టర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు.
చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్ విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది.
ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.
అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి 15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్ పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు ఒకే సారి ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.
రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .
దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.
ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు. వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .
జీవితంలో మనం ప్రతిరోజూ ఎన్నో పనులు చేస్తుంటాం. కొన్ని పనులు ఆలోచించి చేస్తాం.. మరికొన్ని పనులు మాత్రం ఆవేశంలోనో.. తొందరపాటుతో నిర్ణయం తీసుకుని మొదలుపెడతాం. అయితే ఏ పని అయినా ప్రారంభించే ముందు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుంటే, తప్పులు తగ్గించుకోవడంతో పాటు విజయానికి చేరువయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో చాణక్యుడి నీతి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పని చేయడానికి ముందు మూడు ప్రశ్నలు వేసుకోవాలని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ఆ మూడు ప్రశ్నలు ఏంటో.. ఎందుకు వేసుకోవాలో.. దీని వెనుక గల కారణం ఏంటో తెలుసుకుంటే..
పని ఎందుకు చేస్తున్నాను?
ముందుగా మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి — నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను? అని. ఆ పని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటో తెలుసుకోవాలి. ఇతరులను చూసి చేస్తున్నామా? ఎవరో చెప్పారని చేస్తున్నామా? లేక నిజంగా మనకు అవసరం ఉందా?
మన లక్ష్యం స్పష్టంగా ఉంటే, ఆ పనిని సరైన దిశలో కొనసాగించడం సులభమవుతుంది. కారణం తెలియకుండా ప్రారంభించిన పని మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
పని వల్ల ఎలాంటి ఫలితం వస్తుంది?
రెండో ప్రశ్న చేయాలనుకున్న పని వల్ల నాకు ఎలాంటి ఫలితం వస్తుంది? అని ప్రశ్నించుకోవాలి. ఏ పని చేసినా దానికి ఒక ఫలితం ఉంటుంది. ఆ ఫలితం మనకు ఉపయోగపడుతుందా? నష్టాన్ని కలిగిస్తుందా? భవిష్యత్తులో దాని ప్రభావం ఎలా ఉంటుంది? అనే విషయాలను ముందుగానే ఆలోచించాలి.
తక్షణ ప్రయోజనం మాత్రమే కాకుండా, దీర్ఘకాలంలో వచ్చే ఫలితాలను కూడా అంచనా వేయడం తెలివైన నిర్ణయం.
పనిలో విజయం సాధించగలనా?
మూడో ప్రశ్ చేయాలనకున్న పనిలో విజయం సాధించగలనా అని. మన దగ్గర ఉన్న సామర్థ్యం, సమయం, వనరులు, పరిస్థితులు, ఎదురయ్యే సమస్యలు వంటి అంశాలను ఆలోచించాలి. విజయం సాధించే అవకాశం ఉందా? ఉంటే దాని కోసం నేను ఏమి చేయాలి? అనే విషయాలను ముందుగానే పరిశీలించాలి.
ఇది భయపడి పనిని వదిలేయడం కోసం కాదు. విజయానికి అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసుకోవడం కోసం..
ఈ మూడు ప్రశ్నలు ఎందుకు ముఖ్యం?
చాలాసార్లు మనం ఒక పని చేయాలనే ఉత్సాహంలో దాని పరిణామాలను ఆలోచించకుండా ముందుకు వెళ్తాం. ఆ తర్వాత సమస్యలు ఎదురైనప్పుడు “ముందే ఆలోచించి ఉంటే బాగుండేది” అని అనుకుంటాం.
అందుకే ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు, లేదా ఏదైనా పని మొదలు పెట్టేముందు ఈ మూడు ప్రశ్నలను మనసులో వేసుకోవడం అలవాటు చేసుకుంటే, తొందరపాటు నిర్ణయాలు తగ్గుతాయి. ఈ మూడు ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం దొరికిన తర్వాతే ముందడుగు వేయడం మంచిది.
*రూపశ్రీ.
భార్యాభర్తల బంధం జీవితాంతం కలిసి నడవాల్సిన అనుబంధం. ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవం ఉంటే ఈ బంధం ఎంతో ఆనందంగా ఉంటుంది. అయితే చిన్న చిన్న విషయాలకే తరచుగా గొడవలు రావడం, ఒకరి మాటను మరొకరు అర్థం చేసుకోకపోవడం, ఇంటి పనుల విషయంలో అసంతృప్తి పెరగడం వల్ల దాంపత్య జీవితంలో దూరం ఏర్పడవచ్చు. గొడవలు రావడం ఒక్కటే సమస్య కాదు. వాటిని ఎలా పరిష్కరించుకుంటున్నారన్నదే భార్యాభర్తల బంధానికి అసలు పరీక్ష.
భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలకు కారణాలు..
ఒకరి మాట మరొకరు వినకపోవడం..
చాలా సందర్భాల్లో సమస్య పెద్దది కాకపోయినా, తమ మాటను భాగస్వామి పట్టించుకోవడం లేదనే భావన గొడవకు దారితీస్తుంది. ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు మధ్యలోనే అడ్డుకోవడం, వెంటనే సమాధానం చెప్పడానికి ప్రయత్నించడం సమస్యను మరింత పెంచుతుంది.
ఇంటి పనుల విషయంలో..
ఇంటిని చూసుకోవడం, వంట చేయడం, పిల్లలను చూసుకోవడం, సరుకులు తీసుకురావడం, బిల్లులు చెల్లించడం వంటి పనులు ఒకరి మీదే ఎక్కువగా పడితే అసంతృప్తి పెరుగుతుంది. ప్రత్యేకంగా ఒకరు బయట ఉద్యోగం చేస్తున్నారనే కారణంతో ఇంటి బాధ్యతలన్నీ మరొకరి బాధ్యతగా భావించడం కూడా గొడవలకు కారణం కావచ్చు.
ఆర్థిక విషయాల్లో స్పష్టత లేకపోవడం..
ఆదాయం, ఖర్చులు, పొదుపు, అప్పులు, కుటుంబ అవసరాలు వంటి విషయాల్లో భార్యాభర్తల మధ్య స్పష్టమైన అవగాహన లేకపోతే తరచుగా విభేదాలు రావచ్చు.
చిన్న విషయాలను పెద్దవిగా మార్చుకోవడం..
ఇంట్లో ఎవరు ఏ పని చేయాలి, ఎవరు ఆలస్యంగా వచ్చారు, ఫోన్ ఎందుకు ఎత్తలేదు వంటి చిన్న విషయాలు వెంటనే పెద్ద గొడవలుగా మారితే దాంపత్య జీవితంలో ప్రశాంతత తగ్గుతుంది.
గత తప్పులను పదేపదే గుర్తు చేయడం..
గతంలో జరిగిన విషయాలను ప్రతి గొడవలోనూ బయటకు తీసుకురావడం వల్ల సమస్య పరిష్కారం కాకుండా కోపం మాత్రమే పెరుగుతుంది. ఒక సమస్యను పరిష్కరించిన తర్వాత దాన్ని మళ్లీ మళ్లీ లేవనెత్తడం మంచిది కాదు.
పనుల విషయంలో భార్యాభర్తలు ఎలా ఉండాలి?
ఇంటి పని ఎవరిది అనే ప్రశ్న కంటే, మన ఇంటి పని అనే భావన ఉండాలి..
ఇంటి పని భార్యది మాత్రమే, బయట పని భర్తది మాత్రమే అనే ఆలోచన ప్రతి కుటుంబానికీ సరిపోదు. ఎవరి పని, సమయం, ఆరోగ్యం, బాధ్యతలు ఎలా ఉన్నాయో.. దాన్ని బట్టి పనులను పంచుకోవడం మంచిది.
భార్య వంట చేస్తే భర్త పాత్రలు శుభ్రం చేయవచ్చు. ఒకరు పిల్లలను చూసుకుంటే మరొకరు ఇంటి ఇతర పనులను చూసుకోవచ్చు. వారాంతాల్లో ఇద్దరూ కలిసి ఇంటి పనులు చేసుకోవచ్చు.
పని పంచుకోవడం అంటే సరిగ్గా సగం సగం కావాల్సిన అవసరం లేదు..
భార్యాభర్తలు ప్రతి పనిని 50-50గా పంచుకోవాల్సిన అవసరం లేదు. ఒకరి పరిస్థితిని మరొకరు అర్థం చేసుకుని అవసరమైనప్పుడు ఎక్కువ బాధ్యత తీసుకోవడం కూడా దాంపత్య జీవితంలో పరస్పర సహకారమే.
ఒక రోజు భార్యకు ఎక్కువ పని ఉంటే భర్త సహాయం చేయవచ్చు. మరోరోజు భర్తకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే భార్య అతనికి సహకరించవచ్చు.
"నువ్వు ఏం చేస్తావు?" అనే మాటకు బదులు "నేను ఏం చేయగలను?" అని ఆలోచించాలి..
దాంపత్య జీవితంలో మాటలకంటే మనస్తత్వం ముఖ్యం.
"ఇది నీ పని కదా?" అని అడగడం కన్నా
"నీకు పని ఎక్కువగా ఉంది, నేను ఏం చేయగలను?" అని అడిగితే బంధంలో ప్రేమ, గౌరవం పెరుగుతాయి.
అలాగే సహాయం చేసిన తర్వాత దాన్ని గొప్పగా చెప్పుకోవడం కూడా అవసరం లేదు. భార్యాభర్తలు ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఉపకారం కాదు, అది కుటుంబ బాధ్యతలో భాగం.
గొడవ వచ్చినప్పుడు ఏం చేయాలి?
గొడవ సమయంలో వెంటనే సమస్యను గెలవాలని ప్రయత్నించకుండా, సంబంధాన్ని కాపాడుకోవాలని ఆలోచించాలి.
కోపంలో అవమానకరమైన మాటలు మాట్లాడకూడదు.
తల్లిదండ్రులు, బంధువులు, పిల్లలను గొడవలోకి లాగకూడదు. పాత విషయాలను తవ్వి తీసుకురాకూడదు. "నువ్వు ఎప్పుడూ ఇలాగే చేస్తావు" వంటి మాటలు తగ్గించాలి.
ఇద్దరూ ప్రశాంతంగా ఉన్న సమయంలో సమస్య గురించి మాట్లాడాలి. తప్పు ఉంటే "నా వల్ల తప్పు జరిగింది" అని చెప్పడానికి సంకోచించకూడదు.
ఎదుటివారు చేసిన మంచి పనులను కూడా గుర్తించి ప్రశంసించాలి. పిల్లల ముందు గొడవపడటం మంచిది కాదు
చివరగా...
భార్యాభర్తల మధ్య గొడవలు పూర్తిగా లేకపోవడం కంటే, గొడవ వచ్చిన తర్వాత ఇద్దరూ దాన్ని ఎలా పరిష్కరించుకుంటారన్నదే ముఖ్యం.
*రూపశ్రీ.
ప్రతి వ్యక్తి జీవితంలో భార్యాభర్తల బంధం ఎంతో అపురూపమైనది. ఒక వయసుకు వచ్చాక ముడిపడే ఈ బంధం మరణం వరకు తోడు ఉంటుంది. అయితే.. నేటికాలంలో చాలామంది బార్యాభర్తల మధ్య ప్రేమ, ఆప్యాయత కంటే గొడవలే ఎక్కువ ఉంటున్నాయి. ఈ గొడవలే చాలామంది విడిపోవడానికి కూడా దారితీస్తాయి. భార్యాభర్తల మధ్య అసలు గొడవలు లేకపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. కానీ.. ఒకే కుటుంబంలో పుట్టి పెరిగిన వాళ్ల మధ్య కూడా గొడవలు అనేవి సహజంగానే ఉంటాయి. అసలు గొడవలే లేకుండా ఉండే బంధం ఏదీ ఉండదు. కానీ వీలైనంత వరకు గొడవలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం తప్పకుండా భార్యాభర్తలు ఇద్దరి మీదా ఉంటుంది. భార్యాభర్తలు కొన్ని అలవాట్లు వదిలేస్తే.. వారి బంధంలో చాలా వరకు గొడవలు తగ్గుతాయి. ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే..
పరస్పర అగౌరవం, బాధపెట్టేలా మాట్లాడటం..
భార్యాభర్తల సంబంధానికి పునాది పరస్పర గౌరవం. , భార్యాభర్తలు చిన్న విషయాలకే ఒకరినొకరు అవమానించుకున్నా లేదా కఠినమైన మాటలు మాట్లాడినా, ఆ ఇంటిలోని పాజిటివ్ ఎనర్జీ నశిస్తుంది. రోజూ దూషణలు లేదా అవమానకరమైన మాటలు వాడే ఇంట్లో శాంతి ఎప్పటికీ ఉండదు, పైగా పేదరికం మొదలవుతుంది.
దుబారా ఖర్చు..
ఒక కుటుంబం ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేసుకోవడానికి సరైన ఆర్థిక నిర్వహణే కీలకం. భార్యాభర్తలలో ఎవరికైనా తమ ఆదాయానికి మించి ఖర్చు చేసే అలవాటు ఉన్నా లేదా డబ్బును విచక్షణారహితంగా దుబారా చేసినా, ఆ కుటుంబం త్వరగా పేదరికంలోకి జారిపోతుంది. వైవాహిక జీవితంలో ఒత్తిడికి, ఆర్థిక ఇబ్బందులకు అనవసరమైన ఆర్భాటం, దుబారా ఖర్చులే అతి పెద్ద కారణాలు.
రహస్యాలు, అపనమ్మకం..
ఏ బంధం అయినా బలంగా ఉండాలంటే.. నమ్మకమే ప్రాథమిక విషయం. భార్యాభర్తలలో ఎవరైనా ఒకరికొకరు ముఖ్యమైన విషయాలను దాచడం మొదలుపెట్టినప్పుడు లేదా మోసానికి పాల్పడినప్పుడు, ఆ సంబంధంలో అనుమానం, విద్వేషం చోటుచేసుకుంటాయి. పారదర్శకత లేనిచోట గొడవలు ఎక్కువ ఉంటాయి. అటువంటి అల్లకల్లోల వాతావరణం మనిషి సామర్థ్యం మీద ప్రభావం చూపిస్తుంది, ఆర్థిక వృద్ధికి ఆటంకం కలిగిస్తుంది.
సోమరితనం..
సోమరులకు , అపరిశుభ్రంగా జీవించేవారికి లక్ష్మీదేవి ఆశీస్సులు లభించవు. భార్యాభర్తలు ఉదయాన్నే ఆలస్యంగా నిద్రలేచినా, ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోయినా, లేదా వారే అపరిశుభ్రంగా ఉన్నా, ఇంట్లో ప్రతికూల శక్తి ప్రభావం పెరుగుతుంది. సోమరితనం సమయం , డబ్బు రెండింటి నష్టానికి దారితీసి, పేదరికానికి కారణం అవుతుంది. తద్వారా వారి మధ్య గొడవలు కూడా పెరుగుతాయి.
ఇంటి విషయాలు బయటపెట్టడం..
ఇంటి విషయాలు ఎల్లప్పుడూ కుటుంబంలోనే ఉండాలి. తమ పరస్పర వివాదాలు, వ్యక్తిగత బలహీనతలు లేదా కుటుంబ రహస్యాలను ఇతరులకు వెల్లడించే భార్యాభర్తలు తమ వినాశనాన్ని తామే కొనితెచ్చుకుంటారు. బయటి వ్యక్తులు దీనిని అవకాశంగా తీసుకుని, విభేదాలను మరింత పెంచుతారు. చాణక్య నీతి ప్రకారం సంతోషకరమైన వైవాహిక జీవితానికి ఇతరుల సలహాలు తీసుకోవాలంటే, ముందుగా సమస్యలను అందరికీ చెప్పకుండా గోప్యత పాటించడం ముఖ్యం. ఒకరికొకరు రక్షణ కవచంగా ఉండటం, కోపాన్ని అదుపులో ఉంచుకోవడం, సంక్షోభసమయాల్లో ఓర్పు వహించడం, , కుటుంబంలోని పూజలు, వ్రతాలు వంటివి కలిసి ఆచరించడం, మర్యాదను కాపాడుకోవడం ముఖ్యం.
*రూపశ్రీ.
మార్గదర్శి ఫిన్ క్యాప్ కేసు వ్యవహారంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌కు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ కేసులో సుప్రీం కోర్టు ఉండవల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ, ఈ కేసుతో ఆయనకు నేరుగా ఉన్న సంబంధం ఏమిటని నిలదీసింది.
2008 నుంచి ప్రారంభమైన ఈ మార్గదర్శి కేసు అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది. గతంలో హైకోర్టు ఈ కేసును కొట్టివేసినప్పటికీ, ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఊరూరా సభలు నిర్వహించి మరీ మార్గదర్శి సంస్థలు ఆర్‌బిఐ నిబంధనలను ఉల్లంఘించాయని, ప్రజలను మోసం చేశాయని ఆరోపణలు గుప్పించారు. అయితే ఆయన వాదనలు, ప్రచారాలు, ఆరోపణలూ అన్నీ అసత్యాలని సుప్రీం తీర్పుతో తేలిపోయింది. దీనిపై ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు.. ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ అడుసుమిల్లి శ్రీనివాసారావు తెలుగువన్ చానల్ కు ఇచ్చినఇంటర్వ్యూలో ఉండవల్లి మార్గదర్శిపై కేసు, న్యాయపోరాటం అంతా కేవలం ఈర్ష్యతోనే అన్నారు. అయితే దోమ ఏనుగుని చూసి ఈర్ష్యపడితే ఏమౌతుందో.. ఇప్పుడు ఉండవల్లి పరిస్థితి కూడా అంతేనన్నారు.
మార్గదర్శి డిపాజిటర్ల పరంగా ఇప్పటివరకూ ఒక్క బాధితుడు కూడా ఫిర్యాదు చేయకపోవడం, సంస్థ ఇప్పటికే రూ.2,600 కోట్లకు పైగా ఎస్క్రో అకౌంట్‌లో జమ చేయడం వంటి అంశాలను గుర్తు చేసిన అడుసుమిల్లి.. రామోజీరావు నిర్మించిన పత్రికా, వ్యాపార సామ్రాజ్యంపై కేవలం ఈర్ష్యా ద్వేషాలతోనే ఉండవల్లి అరుణ్ కుమార్, వైసీపీ నాయకులు వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారన్నారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో రామోజీరావును విచారణ పేరిట ఇబ్బందులకు గురిచేసినప్పటికీ, ఆయన ఏనాడూ వెనకడుగు వేయలేదన్నారు.
ఈ తీర్పు రామోజీరావు ప్రతిష్టను ఇనుమడింపచేసిందనీ, ఆయనపై కక్షసాధింపు చర్యలకు చెక్ పడిందని అడుసుమిల్లి అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు లేదా రాజకీయ అజెండాతో చేసిన పోరాటాలు చివరికి న్యాయస్థానాల ముందు నిలబడవని ఈ కేసు మరోసారి స్పష్టం చేసిందన్న ఆయన. సుప్రీం కోర్టు నిర్ణయంతో మార్గదర్శి వివాదానికి ముగింపు పడినట్లేనన్నారు. ఇప్పటికైనా విమర్శకులు తమ వైఖరిని మార్చుకోవాలని అడుసుమిల్లి హితవు పలికారు.
Supreme Court, Margadarsi Judgement, Vundavalli Aruna Kumar, Margadarsi Case, Court Verdict Telugu, TeluguOne
తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో ఇప్పుడు కాంగ్రెస్ అంతర్గత విభేదాలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా కొందరు సీనియర్ లు విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకు ప్రతిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు, 5 గురు ఎమ్మెల్సీలు ఒక్కసారిగా మీడియా ముందుకు వచ్చి, మంత్రి కొండా సురేఖను పదవి నుంచి బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
దీనిపై ప్రభుత్వ విప్ వేముల వీరేషం తెలుగువన్ న్యస్ చానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాలన్న డిమాండ్ ఎవరి స్వార్థం కోసం చేసిన రచ్చ కాదు, పార్టీ క్రమశిక్షణను కాపాడేందుకు తీసుకున్న చర్య అని వివరించారు. కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ప్రభుత్వంని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన వీరేషం.. క్రమశిక్షణ రాహిత్యంగా ఎవరు మాట్లాడినా సరే సహించేది లేదు అని వీరేషం స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక జోడెడ్ల బండిలా రాత్రింబవళ్లు కష్టపడి పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తుంటే... కొంతమంది వ్యక్తులు మీడియా మైకులు దొరగ్గానే నోటికొచ్చినట్టు లూజ్ టాక్ మాట్లాడటం వల్ల క్యాడర్ తీవ్ర గందరగోళానికి గురవుతోందని వేముల వీరేషం అన్నారు.
కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాలన్న డిమాండ్ ను బీసీ మంత్రిని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న దాడిగా జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, రెడ్డి అనే తేడాలు ఉండవు. బి ఫామ్ అందరికీ ఒక్కటే, పార్టీ క్రమశిక్షణ అందరికీ ఒక్కటే! తప్పు చేస్తే చర్యలు తప్పవు, నిన్న జక్కిడి ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేయలేదా?" అని ప్రశ్నించారు. తెలంగాణలో ఆగస్టు సంక్షోభం, రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనను క్యాన్సిల్ చేసుకుని హుటాహుటిన తిరిగి వస్తున్నారన్న కామెంట్లను కూడా వీరేషం ఖండించారు. 2029 వరకే కాదు, 2034 వరకు కూడా రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారన్నారు.
Demand in Congress to Burthruf Konda Surekha, Vemula Veeresham, CM Revanth Reddy, Telangana Congress Politics, Konda Sushmitha Comments, Revanth Reddy Cabinet
తెలుగు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పుడు ఈడీ రంగప్రవేశం చేసింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన సన్నిహితుల నివాసాలలో ఏకకాలంలో విస్తృత సోదాలు నిర్వహించింది. 2019 మార్చిలో జరిగిన వివేకా హత్య వెనుక 40 కోట్ల సుపారీ ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో రూ.1 కోటి అడ్వాన్స్‌గా ఇచ్చారని, అందులో రూ.70 లక్షలు రికవరీ అయ్యాయని వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు దాదాపు ఏడేళ్ల తరువాత ఈడీ సోదాలు నిర్వహించిందంటే ఏం జరుగుతోంది? ఆర్థిక లావాదేవీలు, మనీ ల్యాండరింగ్ కోణంలో ఈడీ ఎలాంటి కీలక ఆధారాలు సేకరించబోతోంది? అన్న విషయంపై ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు, ఏపీ కమ్మకార్పొరేషన్ చైర్మన్ అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ఈ కేసులో కీలక సాక్షులు కొందరు ఇప్పిటికే అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో అప్రూవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం కీలకంగా మారింది. జైలులో బెదిరింపులు వచ్చినా, కోట్లాది రూపాయల ఆఫర్లు ఇచ్చినా లొంగకుండా దస్తగిరి మెజిస్ట్రేట్ ముందు వివరాలు వెల్లడించారు.
అదలా ఉంటే.. ప్రజా కోర్టులో వివేకా హత్య కేసులో తీర్పు వచ్చేసిందన్న అడుసుమిల్లి శ్రీనివాసరావు.. బాధితురాలైన కుమార్తెకు చట్టబద్ధంగా న్యాయం జరిగాల్సి ఉందన్నారు. అర్ధరాత్రి హత్య జరిగితే, తెల్లవారక ముందే ఫోన్ కాల్స్ వెళ్లడం, సాక్ష్యాధారాలు తుడిచిపెట్టే ప్రయత్నం జరగడంపై ఇప్పటికీ అనేక ప్రశ్నలు ఉన్నాయి? అయితే ఇప్పుడు ఈ కేసులో ఈడీ ఎంట్రీ.. 40 కోట్ల సుపారీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరెవరి ఖాతాల నుంచి ఎక్కడికి బదిలీ అయింది? అన్నది తేల్చడమే.. అయితే ఇప్పుడు ఇక ఈడీ సోదాల వల్ల ఒరిగిందేమీ ఉండదన్న అడుసుమిల్లి.. ఆ 40 కోట్లు వీళ్లకి రోడ్డు మీద దొరికాయని ఈడీ ముక్తాయించేసినా ఆశ్చర్యంలేన్నారు.
ఏది ఏమైనా, ఓ మాజీ ఎంపీ, మాజీ మంత్రి స్వగృహంలోనే హత్యకు గురైతే.. ఏళ్లు గడుస్తున్నా బాధ్యులకు సరైన శిక్ష పడకపోవడం వ్యవస్థల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈడీ దర్యాప్తులోనైనా అసలు సూత్రధారులు బయటకు వస్తారా? లేక ఇది కూడా కేవలం విచారణలకే పరిమితమవుతుందా చూడాల్సి ఉంది.
ED entry in YS Viveka Murder Case, ED Investigation AP, Avinash Reddy ED Raids, Dastagiri Statement, YS Jagan Mohan Reddy, AP Politics, TeluguOne
సూపర్‌మార్కెట్‌లో, షాప్స్ లో, చిన్న అంగళ్లలో కొనుగోలు చేసే బిస్కెట్లు, ప్యాకెట్ ఫుడ్స్, పాల
ఉత్పత్తులు, జ్యూస్‌లు, సాస్‌లు, రెడీ-టు-ఈట్ ఆహార పదార్థాలపై “Best Before”, “Use By”, “Expiry
Date” వంటి పదాలు కనిపిస్తుంటాయి. చాలామందికి వీటి మధ్య తేడా స్పష్టంగా తెలియదు.
“తేదీ అయిపోయింది కదా… ఇక ఆహారం మొత్తం పారేయాలా?” అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అంతే కాదు.. తేదీ దాటి ఇంకా ఒక్కరోజే, ఒక్క వారమే.. కాబట్టి ఏమి కాదు అనుకుని వాడేవాళ్ళు కూడా ఉంటారు. అయితే Best Before తేదీ , Use By/Expiry తేదీ ఒకే అర్థాన్ని ఇవ్వవు. ఆహారం ఎంతకాలం నాణ్యతగా ఉంటుంది?
ఎప్పుడు దాన్ని తినడం సురక్షితం కాదు? అనే విషయాల్లో ఈ తేదీలకు చాలా తేడా ఉంది. దీని గురించి ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.
తేదీ ఎందుకు వేస్తారు?
ఆహార పదార్థాలను తయారు చేసిన తర్వాత వాటి రుచి, వాసన, రంగు, ఆకృతి, పోషకాల నాణ్యత, భద్రత కాలం గడిచేకొద్దీ మారవచ్చు. అందుకే తయారీదారులు ప్యాకెట్‌పై ఒక నిర్దిష్ట తేదీని సూచిస్తారు. అయితే ఆ తేదీ ప్రతి సందర్భంలో “ఆ రోజు తర్వాత ఆహారం విషంగా మారుతుంది” అని అర్థం కాదు. ఇక్కడే Best Before, Use By మధ్య తేడా వస్తుంది.
“Best Before” అంటే ఏమిటి?
Best Before అంటే ఆ ప్యాక్ లో ఉన్న ఆహార పదార్థం మంచి నాణ్యతను కలిగి ఉండే కాలం. అంటే, ప్యాకెట్‌పై.. ఒక నిర్దిష్ట తేదీ వరకు ఆహారం తన రుచి, వాసన, క్రిస్పీనెస్, రంగు వంటి నాణ్యతలను బాగా కలిగి ఉంటుందనీ అర్ధం.
తేదీ దాటిన వెంటనే ఆహారం పాడైపోతుందా?
సరిగ్గా నిల్వ చేసిన కొన్ని ఆహార పదార్థాలు Best Before తేదీ దాటిన తర్వాత కూడా కొంతకాలం తినడానికి అనుకూలంగా ఉండవచ్చు. అయితే వాటి నాణ్యత తగ్గి ఉండవచ్చని చెబుతున్నారు.
ఉదాహరణకు..
బిస్కెట్లు మెత్తబడవచ్చు, సీరియల్స్
క్రిస్పీనెస్ కోల్పోవచ్చు, కొన్ని ప్యాకెట్ ఫుడ్స్ రుచి తగ్గవచ్చు, టీ, కాఫీ వంటి పదార్థాల సువాసన తగ్గవచ్చు. అందుకే Best Before అనేది
ప్రధానంగా నాణ్యతకు సంబంధించిన అంశం అని చెబుతారు.
“Use By” అంటే ఏమిటి?
Use By అనేది ఆహారం భద్రతకు సంబంధించిన
గడువు. ఈ తేదీ ముఖ్యంగా త్వరగా పాడయ్యే ఆహార పదార్థాలకు వర్తిస్తుంది.
ఉదాహరణకు:
కొన్ని తాజా పాల ఉత్పత్తులు, తాజా మాంసం, చేపలు, కొన్ని రెడీ-టు-ఈట్ ఆహారాలు, త్వరగా పాడయ్యే ఇతర ఆహారాలు ప్యాకెట్‌పై నిర్ణీత తేదీ ఉంటే.. ఆ తేదీ దాటిన తర్వాత అది బయటికి చూడటానికి లేదా వాసనకు బాగానే ఉన్నప్పటికి తినడం సురక్షితం అని అని అనుకోకూడదు. అందుకే Use By తేదీ దాటిన ఆహారాన్ని తినకుండా ఉండటం మంచిది.
Best Before తేదీ దాటితే ఏం చేయాలి?
ఆహారం ఏ రకమైనది, ఎలా నిల్వ చేశారు, ప్యాకెట్ తెరిచారా లేదా అనే విషయాలపై ఇది ఆధారపడి ఉంటుంది. కొన్ని ఆహారాలు ఈ తేదీ దాటిన తర్వాత కూడా తినడానికి అనువుగానే ఉంటాయి. కానీ వాటిలో నాణ్యత మాత్రం తగ్గిపోయి ఉంటుంది. అలాంటి ఆహారం తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.
వాసన చూసి ఆహారం సురక్షితమా కాదా తెలుసుకోగలమా?
కొన్ని హానికరమైన బ్యాక్టీరియా లేదా ఇతర సూక్ష్మజీవులు ఆహారంలో పెరిగినా, ఆహారంలో దుర్వాసన, రంగు మార్పు కనిపించకపోవచ్చు కూడా. అందువల్ల ఆహారం వాసన రాలేదనే కారణంతో తినడం సరైనది కాదు. ముఖ్యంగా Use By తేదీ దాటిన
ఆహారాన్ని కేవలం వాసన లేదా రుచి చూసి ఏమి కాదని నిర్ధారించుకోవడం సరైన పద్ధతి కాదు.
ప్యాకెట్ తెరిచిన తర్వాత గడువు మారుతుందా?
కొన్ని ఆహార పదార్థాలకు ఇది చాలా ముఖ్యమైన విషయం. కొన్ని ఆహారాల మీద best before అని ఉన్నా.. ప్యాకెట్ లు లేదా బాటిల్ మూతలు తెరిచిన తర్వాత వాటిని ఎక్కువ రోజులు వాడటం మంచిది కాదు. వాటిని తొందరగా వాడేయాలి.
*రూపశ్రీ.
ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఇది ఎందుకు వస్తుంది? లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలా గుర్తించాలి? అనే విషయాలను ఈ వీడియోలో డాక్టర్ ఆర్. బాలాజీ సులభంగా వివరిస్తున్నారు.
కాలేయ కణాల్లో అధికంగా కొవ్వు పేరుకుపోవడాన్ని ఫ్యాటీ లివర్ (Fatty Liver Disease) అంటారు. చాలా మందిలో దీనివల్ల ప్రారంభ దశలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. అయితే కొంతమందిలో అలసట, బరువు తగ్గడం లేదా పొత్తికడుపులో అసౌకర్యం వంటి సమస్యలు కనిపించవచ్చు.
అధిక బరువు, ఊబకాయం, జీవనశైలి వంటి కారణాలు ఫ్యాటీ లివర్‌కు దారితీయవచ్చు. ఆహారపు అలవాట్లలో మార్పులు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బరువును నియంత్రించుకోవడం ద్వారా ప్రమాద కారకాలను తగ్గించుకోవచ్చు.
ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేయకుండా సరైన సమయంలో వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం. కొంతమందిలో ఈ సమస్య కాలేయంలో తీవ్రమైన మార్పులకు దారితీసే అవకాశం ఉంటుంది.
ఫ్యాటీ లివర్‌కు కారణాలు ఏమిటి? దాని లక్షణాలు ఏంటి? ఎలా నిర్ధారిస్తారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి పూర్తి వివరాలను డాక్టర్ ఆర్. బాలాజీ ఈ వీడియోలో వివరించారు.
వీడియోను పూర్తిగా చూడండి.. ఫ్యాటీ లివర్ గురించి ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు లేదా లక్షణాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.
మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
మునగాకు (Moringa Leaves) మనకు ప్రకృతి అందించిన పోషక విలువలు ఉన్న ఆహారాల్లో ఒకటి. మునగాకులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే దీనిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతుంటారు.
మునగాకు పొడిని ఎలా తీసుకోవాలి? ఎంత మోతాదులో తీసుకోవాలి? దీన్ని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? షుగర్, కీళ్ల నొప్పులు, రోగనిరోధక శక్తి వంటి విషయాల్లో మునగాకు ఎలా ఉపయోగపడుతుంది? అనే అంశాలను ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ వివరించారు.
మునగాకు పొడిని సరైన విధంగా తీసుకోవడం, ఆహారంలో ఎలా చేర్చుకోవాలి అనే విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు.
గమనిక: మునగాకు లేదా మునగాకు పొడి ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా ఉపయోగపడవచ్చు. అయితే డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచనల మేరకు ఆహారంలో మార్పులు చేసుకోవడం మంచిది. మందులకు బదులుగా మునగాకు పొడిని ఉపయోగించకండి.
TeluguOne Health లో ఆరోగ్యానికి సంబంధించిన తాజా సమాచారం, నిపుణుల సూచనలు, ఉపయోగకరమైన ఆరోగ్య చిట్కాలను తెలుసుకోండి.
