చలికాలంలో  ఈ ఒక్క పని చేస్తే  చర్మం  మెరిసిపోతుంది!

చలికాలంలో చర్మం పొడిబారడం, దురద, తామర, చర్మం తెల్లబడటం, చర్మం పొలుసుగా పైకి లేవడం వంటి అనేక సమస్యలు మొదలవుతాయి. అంతేకాకుండా శరీరంలో తేమ లేకపోవడం వల్ల జుట్టు రాలడం, చుండ్రు తదితర సమస్యలు కూడా వస్తాయి. ఈ సమస్యలను నివారించడానికి, గోరువెచ్చని ఉప్పు నీటితో స్నానం చేయడం  చాలా సహాయపడుతుంది.

రోజూ గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా ఉప్పు కలిపి స్నానం చేస్తే చర్మం బాగా శుభ్రపడుతుంది. ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల జుట్టు,  చర్మం మెరుపు సంతరించుకుంటాయి. చలికాలంలో చాలా సార్లు పరిశుభ్రత లేకపోవడం, తడి బట్టలతో ఉండటం. చలికారణంగా  శరీరంలో దద్దుర్లు, దురదలు, తామర వంటి సమస్యలు వస్తాయి. వీటన్నింటిని పరిష్కరించడానికి ఉప్పు సహాయపడుతుంది.  ఉప్పులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటికి  చర్మంపై ఉండే బ్యాక్టీరియా,  క్రిములను తొలగించే శక్తి ఉంటుంది. ఇది చర్మసంబంధ   వ్యాధులను నివారిస్తుంది.

సాధారణంగా వేసవి కాలంతో పోలిస్తే శీతాకాలంలో చర్మం  మెరుపు తగ్గడం ప్రారంభమవుతుంది. దీనికి మొదటి కారణం చలి వల్ల నీరు సరిపడినంత తీసుకోకపోవడం. శరీరంలో నీటి శాతం లోపిస్తే చర్మ సమస్యలు సులభంగా వస్తాయి. చర్మం కూడా నిర్జీవంగా మారుతుంది.  ముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్నవారిలో సమస్య అధికంగా ఉంటుంది.

 గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి స్నానం చేయడం వల్ల చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. ఇది  చర్మ రంధ్రాలలో ఉండే మురికిని తొలగించడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. దీన్ని ఫాలో అయితే  అందం చెక్కుచెదరకుండా ఉంటుంది.  

ఒత్తిడి సమస్యతో ఇబ్బంది పడేవారికి కూడా ఉప్పునీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.  ఒత్తిడిగా ఉన్నప్పుడు కండరాలు ఉద్రిక్తంగా ఉంటాయి. ఇలాంటి  పరిస్థితిలో ఉప్పు కలిపిన గోరువెచ్చని నీరు  మంచి పరిష్కారంగా మారుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి స్నానం చేయడం వల్ల కండరాలకు ఉపశమనం కలుగుతుంది.   అలసట తొలగిపోతుంది. ఇది శరీరానికి విశ్రాంతినిస్తుంది.

                                                   *నిశ్శబ్ద.