ఓ శ్రీమంతుడు.. చాలా మైనస్‌లు
on Aug 8, 2015
శ్రీమంతుడు సినిమా విడుదలైంది. బెన్ ఫిట్ షో పూర్తయినప్పటి నుంచీ ఈ సినిమాని ఆహో ఓహో అని పొగిడేస్తున్నారంతా. సినీ సెలబ్రెటీలూ ముందుకొచ్చి శ్రీమంతుడు ఓ క్లాసిక్ అనే రేంజులో కీర్తిస్తున్నారు. స్టార్ హీరో అయ్యిండి, ఓ మంచి పాయింట్ ని నమ్మి, సినిమా చేసిన మహేష్‌ని అభినందించాల్సిందే. కథ లోంచి ఎప్పుడూ ఎక్కడా పక్కకు తప్పుకోకుండా కేవలం తాను చెప్పదలచుకొన్న పాయింట్‌పైనే ఫోకస్ పెట్టిన దర్శకుడినీ మెచ్చుకొని తీరాలి. కాస్త విశ్లేషణాత్మకంగా ఆలోచించి చూస్తే.. శ్రీమంతుడులో బోలెడన్ని మైనస్‌లు కనిపిస్తాయి.
* హీరో క్యారెక్టరైజేషన్ చుట్టూ తిరిగే కథ ఇది. సినిమా మొత్తం అదే కనిపిస్తుంది. హీరో బిహేవియర్‌ని తెరపై చూపించడానికి దర్శకుడు సగం సినిమా మొత్తం వాడుకొన్నాడు. ఇంట్రవెల్ ముందు వరకూ కూడా కథలోకి ప్రవేశించలేదు.
* దానం చేయడం కథానాయకుడిలోని ఉదాత్తమైన స్వభావంగా తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు. ఓ సందర్భంలో రోడ్డుపై అడుక్కొంటున్న ముసలమ్మకు వేలకి వేలు దానం చేస్తాడు హీరో. ఇది మంచితనానికి పరాకాష్ట. ఎంత అంబానీ అయినా, బిల్‌గేట్స్ దిగొచ్చినా అడుక్కొనేవాళ్లకు వేయి రూపాయల కట్టల్ని దానం చేయడు. ఈ సీన్ మరీ టూమచ్‌గా అనిపిస్తుంది.
* ఐ యామ్ వెరీ బ్యాడ్ సన్ అంటాడు ఓ సందర్భంలో మహేష్ బాబు. తండ్రి ఆశయాల్ని, ఆశల్ని ఏమాత్రం పట్టించుకోడు. కానీ తండ్రి సంపాదించిన ఆస్తి మాత్రం విచ్చలవిడిగా దానం చేస్తుంటాడు.
* కంపెనీలో పనిచేసే ఉద్యోగికి రూ.20 లక్షలు ఇచ్చినందుకే.. జగపతిబాబు సీరియస్ గా డిస్కర్షన్ పెడతాడు. కానీ... ఊరుకెళ్లి తన తనయుడు కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నా పట్టించుకోడు.
* డబ్బుకి కక్కుర్తి పడి కొటేషన్ శత్రువులకు చేరేశాడని తెలిసినా.. రాహుల్ రవీంద్రన్‌కి కంపెనీ బాధ్యతలు అప్పగించి వెళ్లిపోతాడు మహేష్.
* సెకండాఫ్ మరీ ల్యాగ్. స్లోగా నడుస్తూనే ఉంటుంది. క్లైమాక్స్ మరీ వీక్. ఆసుపత్రి సీన్ సరిగా పండలేదు.
* వినోదానికి ఈ సినిమాలో్ ప్రాముఖ్యమే లేదు. అలీ, వెన్నెల కిషోర్‌ల చేత ఫోర్డ్స్ కామెడీ చేయించారు.
ఇలా చెప్పుకొంటూ పోతే బోలెడన్ని మైనస్ లు కనిపిస్తాయి. ఓ మంచి కథ, స్టార్ హీరో దొరికినప్పుడు ఈ మైనస్‌లు సరవించుకొంటే మరింత మంచి రిజల్ట్ వచ్చేది.