ఆగష్టులో శర్వా నిత్యాల సినిమా
on Feb 27, 2014
శర్వానంద్, నిత్యమీనన్ జంటగా మరో చిత్రం ప్రారంభమైంది. క్రాంతిమాధవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నారు. కె.ఎస్.రామారావు సమర్పకులు. ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు ఇటీవలే హైదరాబాదులో ప్రారంభమయ్యాయి. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ... "అందమైన ప్రేమకథ ఇది. సాయిమాధవ్ బుర్రా రాసిన సంభాషణలు ప్రాణం పోస్తాయి" అని అన్నారు. కె.ఎస్.రామారావు మాట్లాడుతూ... "ప్రేమ ఎంత పవిత్రమైనదో తనదైన శైలిలో చూపించబోతున్నాడు దర్శకుడు. తొలిసారి కథ వినగానే నాకు నా జీవితం గుర్తుకొచ్చింది. ఇందులో కథానాయకుడు ఓ క్రీడాకారుడిగా నటిస్తున్నాడు. నిత్యా పాత్ర కూడా అందరికి గుర్తుండిపోయేలా ఉంటుంది. ఆగష్టులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము" అని అన్నారు.