పవన్ కళ్యాణ్ మ్యూజికల్ సర్ ఫ్రైజ్ కేక..
on Sep 2, 2017
ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా త్రివిక్రమ్- పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పవన్ ఏదో సీరియస్ ఆలోచిస్తున్నట్టు ఉన్న ఈ పోస్టర్ అందరికీ నచ్చింది. పోస్టర్ తో పాటు ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా చెప్పేసింది చిత్ర యూనిట్. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా చెప్పారు. అయితే ఈ సినిమాకు పేరు మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ... ఇందులో పవన్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపిస్తున్నాడు కనుక 'ఇంజనీర్ బాబు' అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి ఒక చిన్న మ్యూజిక్ బిట్ ను కూడా విడుదల చేశారు. పవన్ అభిమానులకు మ్యూజికల్ సర్ ప్రైజ్ ఇచ్చారు. 1 మినిట్ 18 సెకన్స్ ఉన్న ఈ మ్యూజికల్ బిట్... ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. కాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు... ఎస్.రాధాకృష్ణ నిర్మాతగా..కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్నారు.
Also Read