పొట్టోడు అని ఆ హీరోని కెలుకుతున్నారు..
on Jan 20, 2018
గ్యాంగ్ సినిమా హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న సూర్య అభిమానులను ఒక ఛానెల్లో యాంకర్లు చేసిన ఓవర్ యాక్షన్ ఒళ్లు మండించింది. సూర్య హైట్ గురించి సెటైర్లు వేయడంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు యాంకరమ్మలను నానా తిట్లు తిడుతున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవ్వడంతో మరోసారి హీరోల హైట్ గురించి హాట్ డిస్కషన్ నడుస్తోంది. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ దాకా ఎంతోమంది హీరోలు ఉన్నా హైట్ విషయంలో మాత్రం వ్యత్యాసాలు ఉన్నాయి. నటనతో ఎంతగా మెప్పిస్తున్నప్పటికీ.. హైట్‌ను సాకుగా చూపి వారిని టార్చర్ చేసిన సందర్భాలు ఏన్నో.
అంతెందుకు తెలుగునాట నందమూరి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తన నటనతో.. డ్యాన్స్‌తో యంగ్ జనరేషన్లో ఆల్‌రౌండర్‌గా పేరు సంపాదించిన జూనియర్ ఎన్టీఆర్‌ను.. మానసికంగా కొట్టడానికి హైట్ చూసుకోని మాట్లాడాలంటూ యాంటీ ఫ్యాన్స్ వాదించేవారు. ఇది ఎంతకు వెళ్లింది అంటే ఒక సినిమాలో తన హైట్ గురించి మాట్లాడిన వారిని గుడ్డలూడదీసి కొడతా అని జూనియర్ డైలాగ్ చెప్పేంతగా.. అప్పటి నుంచి యాంటీ ఫ్యాన్స్ కాస్త తగ్గినట్లుగానే కనిపిస్తోంది. సరే అది వేరే విషయం.. అసలు హీరోలు అంటే ఆరడుగుల హైట్.. అదిరిపోయే పర్సనాలిటీ.. మంచి స్కిన్ టోన్ ఉండాలన్న పాత మాటను పక్కనబెట్టి.. హీరోకి నటనే కొలమానం అన్న వాదన నడుస్తున్న ప్రస్తుత రోజుల్లో మళ్లీ హైట్ ప్రస్తావన రావడం సిగ్గు చేటు. ఇకనైనా ఇలాంటి పనికిమాలిన వాదనలు పక్కనబెట్టాలని పలువురు అంటున్నారు.