రూ.20 కోట్లు నష్టపోయిన 'శ్రీమంతుడు'
on Aug 11, 2015
శ్రీమంతుడు రిజల్ట్ పట్ల మహేష్ బాబు, అతని అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే నిర్మాతలు మాత్రం కాస్త బెంగ పెట్టుకొన్నారు. అయ్యె అనవసరంగా తొందరపడ్డామే అని బోలెడు బాధపడిపోతున్నారు. దానికీ కారణం ఉంది. ఇప్పుడంటే సినిమాకి పాజిటీవ్ బజ్ వచ్చి వసూళ్లు కుమ్మేస్తోంది గానీ, విడుదలకు ముందు ఇంత హైప్ లేదు. టీమ్ కూడా శ్రీమంతుడు ఇంత పెద్ద సక్సెస్ అవుతుందనుకోలేదు. అందుకే రాత్రికి రాత్రి ఈ సినిమాని యూరోస్ ఇంటర్నేషనల్ సంస్థకి హోల్‌సేల్‌గా అమ్మేశారు. రూ.80 కోట్లకు ఈసినిమా వాళ్ల చేతిలో పెట్టేశారు.
ఇప్పుడు ఈ సినిమా వంద కోట్ల దిశగా దూసుకుపోతోంది. కనీసం వంద కోట్లు సాధించినా - రూ.20 కోట్లు శ్రీమంతుడు నష్టపోయినట్టే. వన్ - నేనొక్కడినే సినిమా కొని, తీవ్రంగా నష్టపోయింది యూరోస్ సంస్థ. వాళ్లు ఈ సినిమాతో కాస్త గట్టెక్కగలిగారు. శ్రీమంతుడుకి ఓవరాల్‌గా రూ.120 కోట్లు రావచ్చన్నది ట్రేడ్ వర్గాల అభిప్రాయం. రూ.80 కోట్లు దాటి ఎంతొచ్చినా యూరోస్ కళ్లలో వెలుగులు చూసే అవకాశం ఉంది. రికార్డులు కొల్లగొడుతున్న కొద్దీ... శ్రీమంతుడు నిర్మాతల మొహాలు బోసిబోతుంటాయి. ఎందుకంటే... ఆ వసూళ్లంతా తమ ఖాతాలోకి రావాలి కదా. అందుకే. ఈ సినిమా హిట్టయినా వాళ్లకు మాత్రం సంపూర్ణ ఆనందం దక్కడం లేదు.