సమంతకు పిల్లలు పుడితే...
on Sep 25, 2019
అక్టోబర్ 7వ తేదీ వస్తే అక్కినేని నాగచైతన్య, సమంత ప్రేమ వివాహం చేసుకుని రెండేళ్లు అవుతుంది. ‘కల్యాణం వచ్చినా, కక్కు వచ్చినా ఎవరు ఆపలేరు’ అని పెద్దలు అంటుంటారు. చై-సామ్ కల్యాణం అయినప్పట్నుంచి... ‘కల్యాణం వచ్చింది. రెండోది ఎప్పుడు’ అనే ప్రశ్న ఏదో ఒక సందర్భంలో సమంతకు ఎదురవుతూనే ఉంది. నాగచైతన్యకూ తండ్రి ఎప్పుడవుతారనే ప్రశ్న ఎదురవుతోంది. దీనికి చిరునవ్వుతో ఇద్దరూ సమాధానాన్ని దాటవేస్తూ వస్తున్నారు.
అందరూ పిల్లలు ఎప్పుడు? అని అడుగుతుంటే... మంచు లక్ష్మి ఓ అడుగు ముందుకు వేసి, ‘పిల్లలు పుడితే సినిమాలకు బ్రేక్ ఇస్తావా?’ అని సమంతను అడిగారు. ‘‘కొన్నాళ్లు బ్రేక్ ఇచ్చి, మళ్లీ సినిమాలు చేస్తా’’ అని సమంత సమాధానం ఇచ్చారు. కచ్చితంగా మళ్లీ సినిమాలు చేస్తానని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. సాధారణంగా డెలివరీ టైమ్లో ఏ హీరోయిన్ అయినా సినిమాలకు బ్రేక్ ఇవ్వాల్సిందే. సమంత కూడా అదే చేస్తానని చెప్పారు. ఇంకొకటి... తమకు ఒక్క బిడ్డ చాలని అనుకుంటున్నట్టు సమంత తెలిపారు.