రవితేజ 'పవర్' ఫస్ట్ షో లైవ్ ఆప్ డేట్స్
on Sep 12, 2014
'బలుపు' హిట్ తో జోష్ లో ఉన్న రవితేజ ఇప్పుడు ఫుల్ 'పవర్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విక్రమార్కుడు, మిరపకాయ్ తరువాత రవితేజ పోలీస్ పాత్రలో నటిస్తున్న మూడో సినిమా ఇది. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్న బాబీ 'పవర్'పై చాలా కాన్ఫిడెంట్ గా వున్నాడు. ఈ సినిమా లైవ్ ఆప్ డేట్స్ మీ కోసం తీసుకువచ్చింది తెలుగువన్.
పవర్ 'సినిమా' మొదలైంది. భారీ 'పవర్' చేజింగ్ తో ఎసిపి బలదేవ్ గా ఎంట్రీ ఇచ్చాడు రవితేజ. ఆ తరువాత జరిగిన ఓ యాక్సిడెంట్ లో ఎసిపి బలదేవ్ చనిపోయినట్లు అందరూ అనుకుంటున్నారు.
రెండో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా ఫుల్ మాస్ ఎంట్రీ ఇచ్చాడు. ఆణిముత్యం గా బ్రహ్మానందం ఎంట్రీ థియేటర్లలో ఫుల్ విజిల్స్..కేకలు
మొదటపాటకి టైం అయ్యింది. దేవుడా.. దేవుడా.. పాట మొదలైంది..
మొదటి హీరోయిన్ హన్సిక నిరుపమగా ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ రైజింగ్ కామెడియన్ సప్తగిరి కూడా ఎంట్రీ ఇచ్చాడు. కామెడీ సన్నివేశాలు మొదలయ్యాయి.
రవితేజ, సప్తగిరి మధ్య కామెడీ సన్నివేశాలు బాగా పేలుతున్నాయి. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో రెండో పాట మొదలైంది. 'బద్మాష్ పిల్లా...'
సినిమా 'పవర్' మోడ్ లోకి టర్న్ అయ్యింది. రవితేజ పెర్ఫార్మన్స్ సూపర్..
ముఖేష్ రిషి రెండో రవితేజ ను ఎసిపి బలదేవ్ గా నటించమని అడుగుతాడు. బలదేవ్ పాత్రలో రవితేజ రీఎంట్రీ ఇచ్చాడు.
ఎసిపి బలదేవ్ గా రవితేజ ఇరగదీస్తున్నాడు. ఓహో..సినిమాలో ఎవరూ ఊహించని ట్విస్ట్ ..అందరికి కాస్త విరామం...!!
అందరూ కాఫీ తాగిన తరువాత సినిమా మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ తో ప్రారంభమైంది. ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావులు ఎంట్రీ ఇచ్చారు.
రవితేజ ఎసిపి బలదేవ్ అవీనీతి పోలీస్ ఆఫీసర్. ఆశ ఫౌండేషన్ మె౦బర్ గా వైష్ణవి పాత్రలో రెజీనా ఎంట్రీ ఇచ్చింది. చంపెసిందే..చంపెసిందే.. సాంగ్.
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మరో ఫ్లాష్ బాక్ ప్రారంభం. హెవీ సెంటిమెంట్ సన్నివేశాలు వస్తున్నాయి. ఫుల్ మదర్ సెంటిమెంట్.
పవర్ ఫుల్ ఫైట్...ఎసిపి బలదేవ్ విలన్లనీ కుమ్మేస్తున్నాడు..కోట శ్రీనివాస్..రెజీనా చనిపోయారు.
సినిమాలో ఫైట్స్ బాగా ఎక్కువగా వున్నాయి.
ఫ్లాష్ బ్యాక్ అయిపొయింది. తిరిగి సినిమా మళ్ళీ ప్రజెంట్ కలకత్తాలోకి షిఫ్ట్ అయ్యింది. రెండో రవితేజ ఎసిపి గా వచ్చాడు. బ్రహ్మానందం మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు.
రవితేజకి హెల్ప్ చేయడానికి నిరుపమ హన్సిక కూడా కోల్ కత్తా కి వచ్చింది. రవితేజకి విలన్ లతో ఆడుకుంటున్నాడు. టైం ఫర్ ది ఫేమస్ సాంగ్ 'నాట౦కి... నాట౦కి' పాట మొదలయ్యింది.
బ్రహ్మానందం లుంగీ డాన్స్ ఎపిసోడ్..బ్రహ్మి డాన్స్ సూపర్
సినిమా క్లైమాక్స్ చేరుకొంది.
Watch out this space for our full review.