రాణా సినిమాలో బన్నీ భామ!
on Jul 9, 2016
"బాహుబలి"తో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకొన్న రాణా ప్రస్తుతం తెలుగు సినిమాలపైనా దృష్టి సారిస్తున్నాడు. అందులో భాగంగా తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూట్ సెప్టెంబర్ లో మొదలుకానుంది. తెలుగుతోపాటు తమిళంలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకొంటున్న నిర్మాత సురేష్ బాబు రెండు భాషల్లోనూ మంచి క్రేజ్ ఉన్న మరో కథానాయికను ఎంచుకొన్నట్లు సమాచారం అందుతోంది.
మెయిన్ హీరోయిన్ గా కాజల్ ఓ గృహిణిగా నటించనుండగా.. రెండో క్యారెక్టర్ కోసం "సరైనోడు"తో మొదటి సక్సెస్ సొంతం చేసుకొన్న కేతరీన్ ను ఎంచుకొన్నట్లు తెలుస్తోంది. "హోరా హోరీ" అనంతరం దర్శకుల రేసులో వెనుకబడ్డ.. ఈ తాజా చిత్రంతో మళ్ళీ "జయం" రేంజ్ సెక్సెస్ అందుకోవాలన్న ధృడ నిశ్చయంతో ఈ ప్రోజెక్ట్ పై దృష్టి సారిస్తున్నాడట. మరి ఆయన శ్రమ ఫలించి దర్శకుడిగా పూర్వ వైభవం సంపాదించుకొంటాడేమో చూడాలి!