రానా 'అరణ్య' రిలీజ్ డేట్ వచ్చింది!
on Feb 10, 2020
హ్యాండ్సం హీరో రానా దగ్గుబాటి తెలుగు, హిందీ, ఇతర భాషల్లో వరుస హిట్లతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఆయన నెగటివ్ రోల్లో నటించగా ఇటీవల విడుదలైన బాలీవుడ్ ఫిల్మ్ 'హౌస్ ఫుల్ 4' బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఇప్పుడు ఆయన 'హాథీ మేరే సాథీ' అనే బహుళ భాషా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తెలుగులో ఆ సినిమా 'అరణ్య' పేరుతో రిలీజ్ అవుతోంది. సోమవారం చిత్ర బృందం సరికొత్త పోస్టర్ ను విడుదల చేసి, విడుదల తేదీని ప్రకటించింది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వేసవిలో ఏప్రిల్ 2న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఎంతో లావిష్ గా తయారవుతున్న ఈ సినిమాని ప్రభు సాల్మన్ డైరెక్ట్ చేస్తున్నారు.
పోస్టర్లో చేతిలో కర్ర పట్టుకొని సింహంలా గర్జిస్తున్నాడు రానా. ఆయన వెనుక ఒక ఏనుగు కనిపిస్తోంది. ఈ పాత్ర కోసం గడ్డం పెంచిన రానా అడవి మనిషి తరహాలో కనిపిస్తున్నాడు. నిజంగా సినిమాలో ఆయన చేస్తున్న పాత్ర అలాంటిదే. 25 ఏళ్లుగా ఒక అరణ్యంలో నివసిస్తున్న ఒక మనిషి కథ ఇది. పర్యావరణం, అడవుల నరికివేత వంటి సమస్యలపై ఈ కథ నడుస్తుంది. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియా పిల్గావోంకర్ ఇతర ప్రధాన పాత్రధారులు. శంతను మొయిత్రా సంగీతం అందిస్తుండగా, ఎ.ఆర్. అశోక్ కుమార్ సినిమాటోగ్రఫీని సమకూరుస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
