ఈ రోజే రానా నిశ్చితార్థం
on May 20, 2020
దగ్గుబాటి ఇంట పెళ్లి కళ వచ్చేసింది. డోలు భాజాలు మోగే సమయం ఆసన్నమైంది. మూవీమొఘల్ డా. దగ్గుబాటి రామానాయుడి మనవడు, ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు కుమారుడు రానా పెళ్లికి ముందు ముఖ్యమైన వేడుక నిశ్చితార్థానికి రెడీ అయ్యాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఈ రోజే అనగా బుధవారమే రానా నిశ్చితార్థం. ఈ వేడుకకు దగ్గుబాటి ఫ్యామిలీతో పాటు అమ్మాయి మిహీకా బజాజ్ ఫ్యామిలీ మెంబెర్స్, అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు. పెళ్లి ముహుర్తాలు కూడా ఈ రోజే పెట్టనున్నారని తెలిసింది. సాయంత్రానికి నిశ్చితార్థం ఫొటోలు విడుదల చేయడంతో పాటు పెళ్లి తేదీ కూడా ప్రకటించనున్నారని టాక్.
లాక్‌డౌన్ ముందువరకూ, లాక్‌డౌన్‌లోనూ టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ పేర్లలో రానా పేరు వినిపించేది. అయితే, ఒక్కసారిగా అందరికీ అతడు షాక్ ఇచ్చాడు. మిహీకాతో ప్రేమలో ఉన్నట్టు ప్రకటించాడు. రానా తండ్రి సురేష్ బాబు సైతం ఈ ఏడాది ఆఖరులోపు పెళ్లి చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
