ముందు గోపీంచంద్‌తో... తర్వాత రానాతో!
on May 8, 2020
విలక్షణ దర్శకుడు తేజ ఫిబ్రవరిలో రెండు సినిమాలు ప్రకటించారు. అందులో ఒకటి... 'రాక్షస రాజు రావణాసురుడు'. రెండోది... 'అలిమేలు మంగ వెంకటరమణ'. మొదటి సినిమా రానా దగ్గుబాటి హీరోగా తెరకెక్కించనున్నారు. ఇంతకు ముందు వీళ్లిద్దరి కాంబినేషన్లో 'నేను రాజు నేనే మంత్రి' వచ్చింది. ఇక, రెండో సినిమా విషయానికి వస్తే గోపీచంద్ హీరోగా నటించనున్నారు. 'నిజం'లో అతడిని భయంకరమైన ప్రతినాయకుడిగా చూపించిన తేజ, ఈసారి కథానాయకుడిగా చూపించనున్నారు. ఈ రెండు సినిమాల్లో ఏది ముందు మొదలవుతుంది? ఏది వెనుక తెరకెక్కిస్తారు? అనేది తేజ చెప్పలేదు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... గోపీచంద్ హీరోగా 'అలిమేలు మంగ వెంకటరమణ' సినిమాను ముందు పట్టాలు ఎక్కించనున్నారు. ప్రస్తుతం గోపీచంద్ 'సీటిమార్' చేస్తున్నారు. దీని తర్వాత మరో సినిమా కమిట్ కాలేదు. అందుకని, అది పూర్తయిన వెంటనే తేజ సినిమా స్టార్ట్ చేయనున్నారు. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్ నిర్మించనున్నారు. ఈ సినిమా తర్వాత 'రాక్షస రాజు రావణాసుడు' చేయాలని తేజ ప్లాన్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
